MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-balakrishnaca180914-771d-4b7a-93e2-d5895c9124a1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-balakrishnaca180914-771d-4b7a-93e2-d5895c9124a1-415x250-IndiaHerald.jpgసాధారణంగా మన తెలుగు ఇండస్ట్రీలో (టాలీవుడ్ లో) టాప్ హీరోలు తండ్రి కొడుకులుగా కలిసి ఒకటో రెండో సినిమాలు చేస్తూ ఉంటారు. మహా అయితే 3 సినిమాలు. అంతకుమించి ఒకే తెరపై తండ్రీకొడుకులు కనిపించడం అరుదు. కానీ ఇక్కడ ఏకంగా తండ్రీకొడుకులు 10 సినిమాలకు పైగా నటించి వెండితెరపై తిరుగులేని చరిత్రను సృష్టించారు. వారెవరో?ఏ సినిమాలో కలిసి తీసారో? ఇప్పుడు ఇక్కడ చూసేద్దాం. ntr,balakrishna;koti;ntr;balakrishna;sridevi kapoor;harika;harikrishnan;jeevitha rajaseskhar;krishna;raaga;ramu;simhaa;tiru;audi;tollywood;cinema;history;hindi;film industry;industry;comedy;nandamuri taraka rama rao;father;maha;chitramసినీ ఇండస్ట్రీలో ఎవరూ చేయలేని పని వీరు చేశారు!సినీ ఇండస్ట్రీలో ఎవరూ చేయలేని పని వీరు చేశారు!ntr,balakrishna;koti;ntr;balakrishna;sridevi kapoor;harika;harikrishnan;jeevitha rajaseskhar;krishna;raaga;ramu;simhaa;tiru;audi;tollywood;cinema;history;hindi;film industry;industry;comedy;nandamuri taraka rama rao;father;maha;chitramFri, 01 Jan 2021 16:28:27 GMTసాధారణంగా మన తెలుగు ఇండస్ట్రీలో (టాలీవుడ్ లో) టాప్ హీరోలు తండ్రి కొడుకులుగా  కలిసి ఒకటో రెండో సినిమాలు చేస్తూ ఉంటారు.  మహా అయితే 3 సినిమాలు. అంతకుమించి ఒకే తెరపై తండ్రీకొడుకులు కనిపించడం అరుదు. కానీ ఇక్కడ ఏకంగా తండ్రీకొడుకులు 10 సినిమాలకు పైగా నటించి వెండితెరపై తిరుగులేని చరిత్రను సృష్టించారు. వారెవరో?ఏ సినిమాలో కలిసి తీసారో? ఇప్పుడు ఇక్కడ చూసేద్దాం.

అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు సినీ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపేస్తున్న నందమూరి వారసులు సీనియర్ ఎన్టీఆర్ గారు, ఆయన తనయుడు బాలకృష్ణ. వీరిద్దరూ కలిసి ఏకంగా పది సినిమాలకు పైగా నటించి ఓకే వెండితెరపై ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఆ సినిమా వివరాలు ఇప్పుడు చర్చించుకుందాం.
 
1. తాతమ్మ కల :
ఎన్టీఆర్ గారు స్వీయ దర్శకత్వంలో 1974 సంవత్సరంలో ఆగస్టు 30వ తేదీన విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.  బాల కృష్ణ బాలనటుడిగా ఈ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.అయితే ఈ సినిమాలో హరికృష్ణ కూడా కనిపించడం గమనార్హం.

2. అన్నదమ్ముల అనుబంధం:
యాదోంకీ బారాత్ అనే హింది సినిమా రిమేక్ అన్నదమ్ముల అనుబంధం. ఈ సినిమా 1975వ  సంవత్సరంలో విడుదలయ్యి బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి తమ్ముడిగా బాలకృష్ణ నటించాడు.

3. వేములవాడ భీమకవి:
9వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ వేములవాడ భీమకవి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా 1976 లో విడుదలయ్యింది. ఈ సినిమా ఆవరేజ్ గా ఆడింది.బాలకృష్ణ గురువుకు తగ్గ శిష్యుడు గా నటించాడు.

4.  దాన వీర శూర కర్ణ:
ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వం వహించిన దాన వీర శూర కర్ణ కేవలం పది లక్షల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లోనే కోటి రూపాయలకు పైగా వసూలు చేసింది.1994వ సంవత్సరంలో తిరిగి రెండోసారి  విడుదల అయ్యి మరో కోటి రూపాయలను సొంతం చేసుకోవడం తోపాటు అత్యంత భారీ విజయాన్ని సాధించింది.


5. అక్బర్ సలీం అనార్కలి:
మొఘల్ ఎ అజమ్ హిందీ సినిమా ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం హిట్ టాక్ గా  నిలిచింది. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ అక్బర్ గా, బాలకృష్ణ సలీం గా పోటీపడి నటించారు.

6. రౌడీ రాముడు కొంటె కృష్ణుడు:
1980వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమాలో బాలకృష్ణ,శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించారు.

7. అనురాగ దేవత:
ఆశ అనే హిందీ సినిమా ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి కూడా కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. అంతేకాకుండా ఎన్టీఆర్ గారు ఈ చిత్రానికి దర్శకుడు.

8. శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర:
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి కూడా ఎన్టీఆర్ గారు స్వీయ దర్శకుడు.

9. సింహం నవ్వింది:
నందమూరి హరికృష్ణ 1983 సంవత్సరంలో నిర్మించిన కామెడీ చిత్రం సింహం నవ్వింది.డి.యోగానంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలకృష్ణ,ఎన్టీఆర్ కళా రంజని లు ప్రత్యేక పాత్రలో నటించారు.

10. బ్రహ్మర్షి విశ్వామిత్ర:
1991వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమాను కూడా ఎన్టీఆర్ గారే దర్శకత్వం వహించారు.


ఆందోళన పరుస్తున్న హిందూ దేవాలయాలపై దుండగుల వరుస దాడులు

సీఎం జగన్ హిందువు కాదు కాబట్టే ఇలా జరుగుతోంది.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బండి సంజయ్ ఫైర్స్ ఆన్ కెసిఆర్ ...?

గర్భం దాల్చిన పది రోజుల తర్వాత మళ్లీ గర్భం.. అసలు ఏం జరిగిందంటే..

క్రాక్ ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది.. ఈ సారి కేకే!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>