PoliticsSiva Prasadeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nara-lokesh94723498-6f9b-4bac-a210-d48e66ce222e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nara-lokesh94723498-6f9b-4bac-a210-d48e66ce222e-415x250-IndiaHerald.jpgకొత్త సంవత్సరాన్ని టీడీపీ నేత, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ దూకుడుగా ప్రారంభించారు. అధికారపక్షంపై విమర్శల బాణాలు సంధించారు.టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వైసీపీ అధినాయకత్వంపై తీ స్థాయిలో ధ్వజమెత్తారు. ఏ1 క్రిమినల్ సీఎం తన బందిపోటు ముఠా నాయకుడు ఏ2 దొంగరెడ్డితో దొంగ ఆరోపణలు చేయిస్తున్నాడంటూ ఆరోపించారు. నీ బతుకు ఫేక్, నీ పార్టీ ఫేక్, నీ హామీలు ఫేక్, నీ పాలన కూడా ఫేక్ అంటూ మండిపడ్డారుnara lokesh;cbn;jagan;nara lokesh;government;media;thief;tdp;pink;ycp;research and analysis wing;donga;v;dookudu;party;criminalకొత్త సంవత్సరాన్ని దూకుడుతో ప్రారంభించిన లోకేశ్కొత్త సంవత్సరాన్ని దూకుడుతో ప్రారంభించిన లోకేశ్nara lokesh;cbn;jagan;nara lokesh;government;media;thief;tdp;pink;ycp;research and analysis wing;donga;v;dookudu;party;criminalFri, 01 Jan 2021 17:05:57 GMTటీడీపీ నేత, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ దూకుడుగా ప్రారంభించారు. అధికారపక్షంపై విమర్శల బాణాలు సంధించారు.టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వైసీపీ అధినాయకత్వంపై తీ స్థాయిలో ధ్వజమెత్తారు. ఏ1 క్రిమినల్ సీఎం తన బందిపోటు ముఠా నాయకుడు ఏ2 దొంగరెడ్డితో దొంగ ఆరోపణలు చేయిస్తున్నాడంటూ ఆరోపించారు. నీ బతుకు ఫేక్, నీ పార్టీ ఫేక్, నీ హామీలు ఫేక్, నీ పాలన కూడా ఫేక్ అంటూ మండిపడ్డారు. చివరికి నీ దొంగల బ్యాచ్ తో చేయించే ఆరోపణలు సైతం ఫేక్ అని పింక్ డైమండ్ వ్యవహారంతో తేలిందని లోకేశ్ స్పష్టం చేశారు."ఇంకెన్నాళ్లీ దొంగ ఆరోపణలు జగన్ రెడ్డీ! సింహాచలం అప్పన్న సన్నిధికి నువ్వే రా తేల్చుకుందాం. నువ్వు నాపై చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలు అని ప్రమాణం చేయడానికి నేను సిద్ధం... మరి నువ్వు సిద్ధమా?" అంటూ సవాల్ విసిరారు.
                                                                జీవో నెం.2430 తెచ్చి మీడియా గొంతు నొక్కారు. చేసిందే చట్టం, ఇచ్చేదే జీవోగా జగన్ సర్కారు వ్యవహరిస్తోంది .జీవో 142 తెచ్చి జర్నలిస్టులకు ఉన్న అక్రెడిటేషన్ తీసేశారు. అక్రెడిటేషన్ కమిటీలో జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలకు చోటు లేకపోవడం వింతలోకెల్లా వింత అంటూ లోకేశ్ దుయ్యబట్టారు. టీడీపీ పాలనలో ఇచ్చిన అక్రెడిటేషన్లలో పది శాతం కూడా ఇప్పుడు ఇవ్వలేదంటూ ఎద్దేవా చేశారు. కొత్త జీవో తన మీడియావారికే అక్రెడిటేషన్లు ఇచ్చి.. మిగిలిన జర్నలిస్టులందరికీ మొండిచేయి చూపడం దారుణమన్నారు.
  వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబును మించి లోకేశ్ విరుచుకుపడుతున్నారు. జగన్ పాలనను భూతద్దంలో తప్పులు వెతుకుతూ మరి ఎద్దేవా చేస్తున్నారు. ఇంతకుముందు ఎన్నడూ కనిపించని ప్రశ్నలు, విమర్శలతో లోకేశ్ చలరేగిపోతున్నారు. ఇన్నాళ్లు తనని పప్పు అంటూ హేళన చేసిన వైసీపీ నేతలకు తాను పప్పు కాదు నిప్పు అన్నట్లుగా లోకేశ్ వ్యవహరిస్తున్నారు. ప్రజలతో పాటు పాత్రికేయులకు అండగా ఉంటానని భరోసా కల్పిస్తూ లోకేశ్ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది.


ఆందోళన పరుస్తున్న హిందూ దేవాలయాలపై దుండగుల వరుస దాడులు

సీఎం జగన్ హిందువు కాదు కాబట్టే ఇలా జరుగుతోంది.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బండి సంజయ్ ఫైర్స్ ఆన్ కెసిఆర్ ...?

గర్భం దాల్చిన పది రోజుల తర్వాత మళ్లీ గర్భం.. అసలు ఏం జరిగిందంటే..

క్రాక్ ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది.. ఈ సారి కేకే!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva Prasad]]>