MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/new-year-fore-cast44cfd9dc-8a60-4b34-8824-a91cdcf01513-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/new-year-fore-cast44cfd9dc-8a60-4b34-8824-a91cdcf01513-415x250-IndiaHerald.jpgమరో మూడు రోజులలో వెళ్ళిపోతున్న 2020 సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీ మరిచిపోలేనంత గడ్డు సంవత్సరంగా మారింది. వాస్తవానికి ‘అలవైకుంఠ పురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ సినిమాలు వరస సూపర్ హిట్స్ గా మారడంతో ఈ సంవత్సరం ఇండస్ట్రీకి సంబంధించి కలక్షన్స్ వర్షం కురిసిన సంవత్సరంగా మారుతుందని భావించారు.అయితే కరోనా రాకతో పరిస్థితులు అన్నీ తారుమారై ఇండస్ట్రీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితులలో నలుగురు హీరోల కెరియర్ కు పరీక్షగా మారినా రాబోతున్న 2021 పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఫిలిం ఇండnew year fore cast;ravi;sharwanand;kalyan;kalyan ram;kranthi;kranti;manu;ram pothineni;ravi teja;tara;varsha;vijay;vijay deverakonda;makar sakranti;india;tollywood;cinema;sankranthi;2020;industry;jaggery;vegetable market;entha manchivaadavuraa;joseph vijay;research and analysis wing;world famous lover;fighter;devarakonda;krack;loverఈ హీరోలకు రాబోతున్న కాలం అత్యంత కీలకం !ఈ హీరోలకు రాబోతున్న కాలం అత్యంత కీలకం !new year fore cast;ravi;sharwanand;kalyan;kalyan ram;kranthi;kranti;manu;ram pothineni;ravi teja;tara;varsha;vijay;vijay deverakonda;makar sakranti;india;tollywood;cinema;sankranthi;2020;industry;jaggery;vegetable market;entha manchivaadavuraa;joseph vijay;research and analysis wing;world famous lover;fighter;devarakonda;krack;loverFri, 01 Jan 2021 09:00:00 GMT2020 సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీ మరిచిపోలేనంత గడ్డు సంవత్సరంగా మారింది. వాస్తవానికి ‘అలవైకుంఠ పురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ సినిమాలు వరస సూపర్ హిట్స్ గా మారడంతో ఈ సంవత్సరం ఇండస్ట్రీకి సంబంధించి కలక్షన్స్ వర్షం కురిసిన సంవత్సరంగా మారుతుందని భావించారు.


అయితే కరోనా రాకతో పరిస్థితులు అన్నీ తారుమారై ఇండస్ట్రీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితులలో నలుగురు హీరోల కెరియర్ కు పరీక్షగా మారినా రాబోతున్న 2021 పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి రవితేజ విజయ్ దేవరకొండ శర్వానంద్ కళ్యాణ్ రామ్ లకు సంబంధించి రాబోతున్న 2021 అత్యంత కీలకం.


ముఖ్యంగా వరస ఫెయిల్యూర్స్ బాటలో ఉన్న రవితేజా కు సంక్రాంతి రేస్ కు రాబోతున్న ‘క్రాక్’ అత్యంత కీలకంగా మారింది. రామ్ బెల్లంకొండ శ్రీను హీరోలతో కూడ రవితేజా పోటీ పడలేకపోతే ఇక అతడి కెరియర్ అత్యంత ప్రమాదంలో పడినట్లే అన్న కామెంట్స్ వస్తాయి. ఇక ఈ లిస్టులో రెండవ స్థానంలో ఉన్నది విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో విజయ్ కెరియర్ సమస్యలలో పడింది.


ప్రస్తుతం ఇతడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఫైటర్’ మూవీ సక్సస్ పై విజయ్ మార్కెట్ ఆధారపడి ఉంటుంది. దక్షణ భారత దేశంలో ఏ హీరోకి లేనంత ఫాలోయర్స్ ను సోషల్ మీడియాలో ఏర్పరుచుకున్న విజయ్ దేవరకొండ మరొక ఫ్లాప్ ఎదుర్కునే స్థితిలో లేడు. సంక్రాంతి సినిమాల హీరోగా వరసగా హిట్స్ అందుకున్న శర్వానంద్ ‘జాను’ ఫ్లాప్ తో దిగాలు పడిపోయాడు. ఇప్పుడు అతడి ఆశలు అన్నీ వచ్చే ఏడాది విడుదల కాబోతున్న ‘శ్రీకారం’ మూవీ పైనే ఉన్నాయి. అదేవిధంగా జయాపజయాలతో సంబంధం లేకుండా వరస పెట్టి సినిమాలు చేస్తున్న కళ్యాణ్ రామ్ ‘ఎంతమంచి వాడవురా’ ఫ్లాప్ కావడంతో అతడి మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఇప్పుడు అతడికి కూడ రాబోతున్న 2021 అత్యంత కీలకం. ఇలా టాలీవుడ్ ఫిలిం ఇందాస్త్రీకే కాకుండా ఈ నలుగురు హీరోల కెరియర్ ను తేల్చే సంవత్సరంగా వచ్చే సంవత్సరం ఉండబోతోంది అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి..




ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా కి డేట్ ఇచ్చేశారు..?

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

ట్రైన్ టికెట్ ఇక సరికొత్తగా..

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్రం కన్నెర్ర.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్!

రజనీ డెడ్లీ డెసిషన్ తో వారికి ఇనుప తెర ?

ధరణి పోర్టల్... స్లాట్ రద్దు చేసుకుంటే డబ్బులు వాపస్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>