PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/stone949a861f-c484-4444-8d83-7918ab03a37c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/stone949a861f-c484-4444-8d83-7918ab03a37c-415x250-IndiaHerald.jpgఅహ్మదాబాద్‌ తాళ్‌తేజ్ ప్రాంతంలోని సింఫనీ పార్క్‌లో ఆరడుగుల పొడవున్న లోహంతో కూడిన ఏకశిల ప్రత్యక్షమైంది. ఇది భూమిలో పాతిపెట్టినట్టు ఉన్నా, ఎక్కడా మట్టిని తవ్విన ఆనవాళ్లు లేవు. ఈ ఘటనపై సింఫనీ పార్క్ తోటమాలి ఆశారామ్‌ మాట్లాడుతూ.. ఆ ఏకశిల అక్కడికి ఎలా వచ్చిందో అర్థం కావడంలేదని విస్మయం వ్యక్తం చేశారుstone;darshana;india;france;romania;director;sardar vallabhai patel;vప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తున్న ఏకశిల... భారత్ లో కూడా ప్రత్యక్షంప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తున్న ఏకశిల... భారత్ లో కూడా ప్రత్యక్షంstone;darshana;india;france;romania;director;sardar vallabhai patel;vFri, 01 Jan 2021 20:00:00 GMTఈ భూప్రపంచం మీద జరిగే కొన్ని సంఘటనలు, అద్భుతాలు ఎవరికీ అంతు చిక్కవు. ఇప్పుడు కూడా అలాంటి విచిత్రమైన సంఘటన గురించే ప్రపంచ దేశాలలో ఆసక్తికరమైన ర్చ జరుగుతోంది. నిర్మానుష్య ప్రదేశాల్లో ప్రత్యక్షమై.. ఆ తర్వాత కొద్ది రోజులకే అదృశ్యమవుతూ పరిశోధకులకు అంతుబట్టని ఏకశిల ఇపుడు భారత్‌ లోనూ దర్శనమిచ్చింది. అహ్మదాబాద్‌ తాళ్‌తేజ్ ప్రాంతంలోని సింఫనీ పార్క్‌లో ఆరడుగుల పొడవున్న లోహంతో కూడిన ఏకశిల ప్రత్యక్షమైంది. ఇది భూమిలో పాతిపెట్టినట్టు ఉన్నా, ఎక్కడా మట్టిని తవ్విన ఆనవాళ్లు లేవు. ఈ ఘటనపై సింఫనీ పార్క్ తోటమాలి ఆశారామ్‌ మాట్లాడుతూ.. ఆ ఏకశిల అక్కడికి ఎలా వచ్చిందో అర్థం కావడంలేదని విస్మయం వ్యక్తం చేశారు. ముందురోజు సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో చూసినపుడు అసలు దాని ఆనవాళ్లే లేవని, ఉదయం వచ్చి చూసేసరికి ప్రత్యక్షమైందని వివరించాడు.



ఆ శిలపై ఏవో కొన్ని అంకెలు, త్రికోణాకార గుర్తులు ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 30 నగరాల్లో ఇదే తరహా ఏకశిలలు ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఇవి అంతుచిక్కని రహస్యంగానే ఉన్నాయి. ఈ వింత శిల గురించి తెలియడంతో జనాలు అక్కడకు చేరుకుని ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ ఏకశిల తొలిసారి అమెరికాలో ప్రత్యక్షమయ్యింది. తర్వాత కొద్ది రోజులకు మాయమయ్యింది. తర్వాత రొమేనియా, ఫ్రాన్స్, పోలెండ్, యూకే, కొలంబియాలోనూ ఇటువంటి ఏకశిల దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని సింఫనీ పార్క్‌‌ను ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. మున్సిపల్ కార్పొరేషన్‌కు కానీ, ప్రయివేట్ సంస్థకు కానీ ఈ నిర్మాణం మూలాలు గురించి ఇంత వరకు తెలియదు. కానీ, మున్సిపల్ కార్పొరేషన్ హార్టికల్చర్ విభాగం డైరెక్టర్ జిగ్నేశ్ పటేల్ మాట్లాడుతూ.. ఈ ఏకశిలాను పార్కును సందర్శించే వ్యక్తుల కోసం సింఫనీ లిమిటెడ్ ఏర్పాటు చేసిందన్నారు. ప్రజలు దాని మెరిసే ఉపరితలం ప్రతిబింబాన్ని చూడవచ్చు.. దానితో సెల్ఫీ తీసుకోవచ్చు అని పేర్కొన్నారు.




రంగ్‌దే రిలీజ్ డేట్ ఫిక్స్.. కీర్తి అందాన్ని చూడడానికి రెడీగా ఉండండి...

మూడో టెస్టులో రోహిత్, నట్టూ... ఇక ఆసీస్‌కు చుక్కలే...

సంక్రాంతికి ఆ రెండూ క్రేజీ మూవీస్ ?

హరీష్ రావుని స్పెషల్ గా ఫోకస్ చేసిన బిజెపి... సోషల్ మీడియాలో ఏం చేస్తారు...?

జగన్ రెడ్డీ.. అప్పన్న సన్నిధికి రా.. తేల్చుకుందాం: నారా లోకేష్

బుల్లిపిట్ట: చంద్రుడిపై స్థలం కొన్న తరువాత.. ఏం జరుగుతుందో తెలుసా?

సీఎం జగన్ హిందువు కాదు కాబట్టే ఇలా జరుగుతోంది.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>