PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr270e5941-9ce3-44e7-ae65-89e0ed528243-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr270e5941-9ce3-44e7-ae65-89e0ed528243-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన తెరాస ని టార్గెట్ చేసుకుని చేస్తున్న విమర్శల మీద తెరాస పార్టీ నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సిఎం కేసీఆర్ ని క్షేత్ర స్థాయిలో ఇబ్బంది పెట్టడానికి బండి సంజయ్ కాస్త ఎక్కువగా కష్టపడుతున్నారు. తెరాస మీద ఆయన చేసే విమర్శలను రాజకీయ వర్గాలు కూడా ఆసక్తికరంగా గమనిస్తున్నాయి. తాజాగా ఆయన కీలక ప్రకటన చేసారు. ప్రజా సమస్యలపై ఆరు నెలల నుంచి ఏడాది వరకు పాదయాత్ర చేస్తాం అని ఆయన స్పష్టం చేసారు. bandi sanjay;kcr;tara;bharatiya janata party;telangana rashtra samithi trs;january;love;february;central government;hindus;party;mantraపాదయాత్ర చేస్తా: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలుపాదయాత్ర చేస్తా: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలుbandi sanjay;kcr;tara;bharatiya janata party;telangana rashtra samithi trs;january;love;february;central government;hindus;party;mantraFri, 01 Jan 2021 19:00:00 GMTబిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన తెరాస ని టార్గెట్ చేసుకుని చేస్తున్న విమర్శల మీద తెరాస పార్టీ నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సిఎం కేసీఆర్ ని క్షేత్ర స్థాయిలో ఇబ్బంది పెట్టడానికి బండి సంజయ్ కాస్త ఎక్కువగా కష్టపడుతున్నారు. తెరాస మీద ఆయన చేసే విమర్శలను రాజకీయ వర్గాలు కూడా ఆసక్తికరంగా గమనిస్తున్నాయి. తాజాగా ఆయన కీలక ప్రకటన చేసారు. ప్రజా సమస్యలపై ఆరు నెలల నుంచి ఏడాది వరకు పాదయాత్ర చేస్తాం అని ఆయన స్పష్టం చేసారు.

కేసీఆర్ తో కలసి పనిచేసే అవకాశం మాకేముంది. 2023లో అధికారం మాదే అని ఆయన స్పష్టం చేసారు. ఎన్డీఏలో చేరదామని కేసీఆర్ మంత్రులను మభ్యపెడ్తున్నాడు అని అన్నారు. కేసీఆర్ ను కేంద్ర పెద్దలు నమ్మటంలేదు అని ఆయన అన్నారు. కేంద్రం కేసీఆర్ నే లెక్కచేయటంలేదు.. తామెంత అనే భయంలో మంత్రులు, ఎమ్మెల్యేలున్నారు అని ఆయన పేర్కొన్నారు. మేం గేట్లు ఎత్తితే టీఆర్ఎస్ ఖాళీ అవుతోంది. ఎవర్ని పడితే వాళ్ళను తీసుకోం అని ఆయన స్పష్టం చేసారు. తప్పులు ఒప్పుకుని.‌. పాప పరిహారం చేసుకుంటే ఆలోచిస్తాం అని ఆయన వ్యాఖ్యానించారు.

రామ మందిర నిర్మాణ నిధుల కోసం జనవరి 22నుంచి ఫిబ్రవరి 10వరకు ప్రతి హిందువు గడప తొక్కుతాం అని అన్నారు. కాబట్టి.. బస్సు యాత్రను కొద్దిరోజులు వాయిదా వేసుకుంటున్నాను అని అన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల అవినీతిపై పోరాటాలకు సిద్ధమవుతున్నాం అని ఆయన వెల్లడించారు. కేసీఆర్ రాజకీయ లవ్ జిహాద్ చేస్తున్నాడు.. ఒన్ సైడ్ లవ్ ను ఎవరు నమ్ముతారు? అని నిలదీశారు. మమల్ని నమ్మించి మోసం చేయటానికి సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ పై ప్రజలు తిరగబడుతున్నారు కాబట్టే మేము వ్యతిరేకిస్తున్నాం అని అన్నారు.


రంగ్‌దే రిలీజ్ డేట్ ఫిక్స్.. కీర్తి అందాన్ని చూడడానికి రెడీగా ఉండండి...

మూడో టెస్టులో రోహిత్, నట్టూ... ఇక ఆసీస్‌కు చుక్కలే...

సంక్రాంతికి ఆ రెండూ క్రేజీ మూవీస్ ?

హరీష్ రావుని స్పెషల్ గా ఫోకస్ చేసిన బిజెపి... సోషల్ మీడియాలో ఏం చేస్తారు...?

జగన్ రెడ్డీ.. అప్పన్న సన్నిధికి రా.. తేల్చుకుందాం: నారా లోకేష్

బుల్లిపిట్ట: చంద్రుడిపై స్థలం కొన్న తరువాత.. ఏం జరుగుతుందో తెలుసా?

సీఎం జగన్ హిందువు కాదు కాబట్టే ఇలా జరుగుతోంది.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>