PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/rajanikanth-announced-that-he-is-not-coming-into-politicsdc493638-ab53-4856-9dbc-e66662a54eff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/rajanikanth-announced-that-he-is-not-coming-into-politicsdc493638-ab53-4856-9dbc-e66662a54eff-415x250-IndiaHerald.jpgరాజకీయాలు అంటే ఆషామాషీ కాదు. ఒకసారి ఆ రాజకీయ చట్రంలో ఇరుక్కున్నాము అంటే దాని నుంచి బయటపడడం కష్టం. కానీ ఆ విషయం తెలుసుకోకుండా తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆ చట్రంలో ఇరుక్కు పోయారు. తన వయసు ను సైతం లెక్క చేయకుండా, ఈ సమయంలో పార్టీ పెట్టాలని డిసైడ్ అవడమే కాకుండా, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి త్వరలోనే పార్టీ పేరును ప్రకటించడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. అదే సమయంలో అకస్మాత్తుగా రజిని అనారోగ్యానికి గురి కావడం, కోలుకోగానే తాను రాజకీయ పార్టీ స్థాపించడం లేదని, అభిమానులంతా క్షమించాలని రజిని స్టేrajnikant tamil nadu tamil superstar;auto;kamal hassan;rajani kanth;smart phone;tamil;letter;partyఫోన్ ఎత్తాలంటే నే వణికిపోతున్న రజనీ ?ఫోన్ ఎత్తాలంటే నే వణికిపోతున్న రజనీ ?rajnikant tamil nadu tamil superstar;auto;kamal hassan;rajani kanth;smart phone;tamil;letter;partyFri, 01 Jan 2021 09:00:00 GMTరాజకీయాలు అంటే ఆషామాషీ కాదు. ఒకసారి ఆ రాజకీయ చట్రంలో ఇరుక్కున్నాము అంటే దాని నుంచి బయటపడడం కష్టం. కానీ ఆ విషయం తెలుసుకోకుండా తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆ చట్రంలో ఇరుక్కు పోయారు. తన వయసు ను సైతం లెక్క చేయకుండా, ఈ సమయంలో పార్టీ పెట్టాలని డిసైడ్ అవడమే కాకుండా, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి త్వరలోనే పార్టీ పేరును ప్రకటించడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. అదే సమయంలో అకస్మాత్తుగా రజిని అనారోగ్యానికి గురి కావడం, కోలుకోగానే తాను రాజకీయ పార్టీ స్థాపించడం లేదని,  అభిమానులంతా క్షమించాలని రజిని స్టేట్మెంట్ ఇచ్చారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినా , రజనీ ఆరోగ్య రీత్యా ఇదే బెటర్ అనేది చాలా మంది అభిప్రాయపడ్డారు. 





అభిమానులు పార్టీ స్థాపించాలి అంటూ ధర్నా చేశారు. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం లేదు అని చెప్పేసిన రజిని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుందాం అనుకుంటే ఆయనను రాజకీయాలు వదిలిపెట్టెలా కనిపించడం లేదు. ఇప్పుడు ఇదే ఆయనకు అగ్నిపరీక్షగా మారింది. పార్టీ పెట్టడం లేదు కాబట్టి తమ పార్టీకి మద్దతు ఇవ్వాలంటూ పెద్దఎత్తున ఇతర పార్టీల నాయకులు కోరుతూ, రజనీపై ఒత్తిడి చేస్తున్నారట.రాజకీయ పార్టీల నాయకుల పరామర్శలు , ఒత్తిడితో రజనీకి ఫోన్ ఎత్తాలి అంటే నే భయపడే పరిస్థితి వచ్చిందట. ముఖ్యంగా కమల్ హాసన్ సైతం రజిని పొత్తు కోసం చేస్తున్న ప్రయత్నాలు చర్చనీయాంశం అవుతున్నాయి. రజిని పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేయకముందే ఆయనతో కలిసి పని చేస్తానంటూ ఎప్పుడో ప్రకటించారు.




 తాము ఎప్పుడూ వేరు వేరు కాదని , ఒకే ఆశయం కోసం రాజకీయాల్లోకి వస్తున్నామంటూ గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు రాజకీయాల్లోకి రాకపోవడాన్ని కూడా కమల్ హాసన్ స్వాగతిస్తున్నారు. రజిని నిర్ణయంపై నిరుత్సాహ పడినప్పటికీ , ఆయన ఆరోగ్యంగా ఉండడమే అందరికీ అవసరం అంటూ త్వరలోనే కలుస్తాను అంటూ స్టేట్మెంట్ఇ చ్చారు. ఇప్పుడు రజనీ కమల్ భేటీ అయినా అప్పుడు కూడా మద్దతు అంశం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక రజిని ఫోన్ విరామం లేకుండా రాజకీయ నేతల పరామర్శ పొత్తు ప్రయత్నాలు చేస్తుండడంతో ఫోన్ ఎత్తాలి అంటే రజిని వణికిపోతున్న ట్టు ఆయన కుమార్తెలు వెల్లడిస్తున్నారు.



మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

ట్రైన్ టికెట్ ఇక సరికొత్తగా..

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్రం కన్నెర్ర.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్!

రజనీ డెడ్లీ డెసిషన్ తో వారికి ఇనుప తెర ?

ధరణి పోర్టల్... స్లాట్ రద్దు చేసుకుంటే డబ్బులు వాపస్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>