PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kurnool-murder-case-killed-man-wife-demand-her-father-arrest993df683-7ad3-44e0-ae44-a6d7594b3e75-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kurnool-murder-case-killed-man-wife-demand-her-father-arrest993df683-7ad3-44e0-ae44-a6d7594b3e75-415x250-IndiaHerald.jpgతన కుటుంబసభ్యులు విడిచిపెట్టలేదని తన భర్తను దారుణంగా చంపారని.. తక్కువ కులం వ్యక్తిని ప్రేమించకూడదా? అంటూ కన్నీటిపర్యంతమైంది మహేశ్వరి . తన భర్తను ఎలాగూ చంపారు. ఒంటరిగా జీవించలేనని, తనని కూడా చంపేయాలని తండ్రిని కోరింది. తాను అత్త మామలతో కలిసి ఊరిలో ఉన్నా బతకనీయరని, వారికి కూడా ప్రాణహానీ ఉందని మహేశ్వరి వాపోయింది.knl murder;maheswari;prema;district;police;marriage;love;husband;arrest;murder.;fatherతనను చంపేయాలని తండ్రిని కోరిన కూతురుతనను చంపేయాలని తండ్రిని కోరిన కూతురుknl murder;maheswari;prema;district;police;marriage;love;husband;arrest;murder.;fatherFri, 01 Jan 2021 20:02:56 GMTజిల్లా ఆదోని లో బుధ‌వారం జ‌రిగిన ప‌రువు హ‌త్య కేసులో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. త‌మ కుంటే త‌క్కువ కులానికి చెందిన వ్య‌క్తిని ప్రేమ వివాహం చేసుకున్నంద‌న్న కార‌ణంగానే యువ‌తి  కుటుంబ స‌భ్యులు అత‌న్ని దారుణంగా చంపారు. ఈ విష‌యంపై మ‌హేశ్వ‌రి మీడియాతో మాట్లాడుతూ.. కులాంతర వివాహం చేసుకున్నందుకే తన భర్త ఆడ‌మ్ స్మిత్‌ను తన తండ్రి చిన్న ఈరన్న, పెద్దనాన్న పెద్ద ఈరన్నలు క‌లిసి చంపారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త చనిపోయినప్పటికీ తాను మాత్రం అత్త మామలవద్దే ఉంటానని ఆమె స్పష్టం చేసింది.

    తాము ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, అయితే చదువులు పూర్తయి, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందామని అనుకున్నామని ఆ యువతి చెప్పింది. ఆడమ్‌ స్మిత్‌‌కు ఉద్యోగం వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నామని, వివాహం అయినప్పటి నుంచి తన భర్త మంచిగా చూసుకున్నారని ఆమె తెలిపింది. ఈ వివాహం ఇష్టం లేని తమ తల్లిదండ్రుల నుంచి రక్షణ కావాలని పోలీసులను కోరామని, తమ కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారని ఆమె చెప్పింది. అయినా దూరంగా ఉందామనే ఉద్దేశంతో ఆదోనిలో ఉంటున్నా… తమకు ఫోన్లు చేసి బెదిరించారని తెలిపింది. అయినా తన కుటుంబసభ్యులు విడిచిపెట్టలేదని తన భర్తను దారుణంగా చంపారని.. తక్కువ కులం వ్యక్తిని ప్రేమించకూడదా? అంటూ కన్నీటిపర్యంతమైంది మహేశ్వరి . తన భర్తను ఎలాగూ చంపారు. ఒంటరిగా జీవించలేనని, తనని కూడా చంపేయాలని తండ్రిని కోరింది. తాను అత్త మామలతో కలిసి ఊరిలో ఉన్నా బతకనీయరని, వారికి కూడా ప్రాణహానీ ఉందని మహేశ్వరి వాపోయింది.

 
మరోవైపు పరువు హత్య కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న యువతి తండ్రి చిన్న ఈరన్న, పెద్దనాన్న పెద్ద ఈరన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కర్నూల్ జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.




రంగ్‌దే రిలీజ్ డేట్ ఫిక్స్.. కీర్తి అందాన్ని చూడడానికి రెడీగా ఉండండి...

మూడో టెస్టులో రోహిత్, నట్టూ... ఇక ఆసీస్‌కు చుక్కలే...

సంక్రాంతికి ఆ రెండూ క్రేజీ మూవీస్ ?

హరీష్ రావుని స్పెషల్ గా ఫోకస్ చేసిన బిజెపి... సోషల్ మీడియాలో ఏం చేస్తారు...?

జగన్ రెడ్డీ.. అప్పన్న సన్నిధికి రా.. తేల్చుకుందాం: నారా లోకేష్

బుల్లిపిట్ట: చంద్రుడిపై స్థలం కొన్న తరువాత.. ఏం జరుగుతుందో తెలుసా?

సీఎం జగన్ హిందువు కాదు కాబట్టే ఇలా జరుగుతోంది.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>