PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-check-to-opposition-parties-8e1b4d21-2dd4-4ad8-ab1d-69f68f078f87-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-check-to-opposition-parties-8e1b4d21-2dd4-4ad8-ab1d-69f68f078f87-415x250-IndiaHerald.jpgఏపీలో జగన్ ఎంత భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చారో, అందుకే తగ్గట్టుగానే ప్రతిపక్షాల నుంచి జగన్ ప్రభుత్వం విమర్శలు ఎదురుకుంటుంది. జగన్ సీఎం పీఠంలో కూర్చున్న దగ్గర నుంచి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విమర్శలు చేస్తూనే వస్తుంది. ప్రతిరోజూ టీడీపీ నాయకులు ఏదొరకంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్ధంలో పెట్టి మరీ చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. jagan;deva;ramu;bharatiya janata party;korcha;jagan;hosta;janasena;congress;government;christian;cheque;tdp;ycp;janasena party;reddyఒక్క దెబ్బతో వారికి చెక్ పెట్టేసిన జగన్...అసలు ఆట మొదలైందా?ఒక్క దెబ్బతో వారికి చెక్ పెట్టేసిన జగన్...అసలు ఆట మొదలైందా?jagan;deva;ramu;bharatiya janata party;korcha;jagan;hosta;janasena;congress;government;christian;cheque;tdp;ycp;janasena party;reddyFri, 01 Jan 2021 02:00:00 GMTజగన్ ఎంత భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చారో, అందుకే తగ్గట్టుగానే ప్రతిపక్షాల నుంచి జగన్ ప్రభుత్వం విమర్శలు ఎదురుకుంటుంది. జగన్ సీఎం పీఠంలో కూర్చున్న దగ్గర నుంచి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విమర్శలు చేస్తూనే వస్తుంది. ప్రతిరోజూ టీడీపీ నాయకులు ఏదొరకంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్ధంలో పెట్టి మరీ చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు.

అయితే టీడీపీతో పాటు జనసేన, బీజేపీ, కాంగ్రెస్, సి‌పి‌ఐ, సి‌పి‌ఎం పార్టీలు సైతం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా జగన్‌ని కులం, మతం పరంగా టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. జగన్ రెడ్డి కులానికి, క్రిస్టియన్ మతానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో మత మార్పిడులు ఎక్కువయ్యాయని, హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని విమర్శిస్తున్నారు.

ఈ విమర్శలకు తగ్గట్టుగా ఏపీలో హిందూ దేవుళ్లపై దాడులు జరుగుతున్నాయి. అంతర్వేది రథం దగ్ధంతో మొదలుపెట్టుకుంటే, తాజాగా రామతీర్ధంలో రాముడు విగ్రహం ధ్వంసం వరకు ఏపీలో హిందూ ఆలయాల్లో పలు దాడులు జరిగాయి. అయితే ఈ దాడులు ఎలా జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారు? అనే విషయాలపై కూడా పెద్దగా క్లారిటీ రావడం లేదు. ఇదంతా జగన్ ప్రభుత్వమే చేయిస్తుందని టీడీపీ, బీజేపీలతో సహ మిగిలిన ప్రతిపక్షాలు గట్టిగా వాదిస్తున్నాయి.

ఇక ఈ దాడులతో తమకేమి సంబంధం లేదని, ప్రతిపక్షాలే కావాలనే కుట్ర పన్ని చేస్తున్నాయని అధికార వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. కానీ వీటిపై జగన్ ఎప్పుడు స్పందించలేదు. తాజాగా మాత్రం జగన్ తీవ్రంగా స్పందించారు. దేవుడితో చెలగాటమాడితే తప్పకుండా శిక్షిస్తాడన్నారు. మరోసారి ఇలాంటి తప్పిదాలకు పాల్పడకుండా చర్యల చేపట్టాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తానికి జగన్ స్పందించడంతో ప్రతిపక్షలకు ఒక్కసారిగా చెక్ పెట్టినట్లు అయింది. ఈ దేవాలయాలపై దాడుల వ్యవహారం మరో మలుపు తిరిగింది. దీని వెనుక ఎవరి హస్తం ఉందో త్వరలోనే తేలిపోయే అవకాశం ఉంది.




ఈ సారి మహేష్ 'మహర్షి'లో ఆ క్రికెటర్.. ఇరగదీస్తున్నాడుగా...

ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్రం కన్నెర్ర.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్!

రజనీ డెడ్లీ డెసిషన్ తో వారికి ఇనుప తెర ?

ధరణి పోర్టల్... స్లాట్ రద్దు చేసుకుంటే డబ్బులు వాపస్

'బండి'కి ఢిల్లీ పిలుపు ? బీజేపీ పెద్ద ల నిర్ణయం ఏంటో ?

బడ్జెట్ విషయంలో వెనక్కు తగ్గని డైరెక్టర్.. టెన్షన్‌లో బాలయ్య నిర్మాత!

2020లో తెలంగాణలో బీజేపీ హవా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>