PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/central-govt-back-step-on-new-decision857ea5db-f58f-44fd-86a6-923ab1830330-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/central-govt-back-step-on-new-decision857ea5db-f58f-44fd-86a6-923ab1830330-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్ ద్వారా టోల్ చెల్లింపులు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం పదే పదే వెనకడుగు వేస్తోంది. అన్ని వాహనాలకు ఫాస్టాగ్ అనేది అసాధ్యం అని తేలడంతో మరోసారి గడువు పెంచింది. అసలు ఫాస్టాగ్ నిర్ణయాన్ని 2017లోనే తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. హైవేలపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద నగదు రూపంలో లావాదేవీలు ఆపేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. 2017 డిసెంబర్ 31నుంచి నగదు రహిత లావాదేవీలు జరపాలని నిర్ణయించింది. ఆమేరకు 2018 జనవరి 1నుంచి ఫాస్టాగ్ లేని వాహనాలు టోల్ గేట్ల వద్ద ఆగిపోవాల్సిందేననే ప్రచారం జfastag;amala akkineni;january;december;february;central government2017 సీన్.. 2020లోనూ రిపీట్ అయింది..2017 సీన్.. 2020లోనూ రిపీట్ అయింది..fastag;amala akkineni;january;december;february;central governmentFri, 01 Jan 2021 09:00:00 GMTకేంద్ర ప్రభుత్వం. హైవేలపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద నగదు రూపంలో లావాదేవీలు ఆపేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. 2017 డిసెంబర్ 31నుంచి నగదు రహిత లావాదేవీలు జరపాలని నిర్ణయించింది. ఆమేరకు 2018 జనవరి 1నుంచి ఫాస్టాగ్ లేని వాహనాలు టోల్ గేట్ల వద్ద ఆగిపోవాల్సిందేననే ప్రచారం జరిగింది. అయితే వివిధ వర్గాలనుంచి వచ్చిన విన్నపాల వల్ల కేంద్రం వెనకడుగు వేసింది.

తాజాగా మరోసారి కేంద్రం ఫాస్టాగ్ కంపల్సరీ అనే నిర్ణయంపై వెనక్కి తగ్గింది. ఈ దఫా కూడా రవాణా వర్గాలనుంచి వచ్చిన విన్నపాలను మన్నించింది. ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తే.. ఇతర వాహనాలు, ఆన్ లైన్ చెల్లింపులపై అవగాహన లేనివారు తీవ్ర ఇబ్బందులు పడతారనే విషయాన్ని గుర్తించిన కేంద్రం ఈ వెసులుబాటు కల్పించింది.  

జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ ప్లాజాల వద్ద నగదు రూపంలో టోల్‌ ట్యాక్స్‌ చెల్లించేందుకు ఫిబ్రవరి 15వ తేదీ వరకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. జనవరి 1వ తేదీ నుంచి టోల్‌ ప్లాజాల్లోని అన్ని వరుసల్లో ఫాస్టాగ్‌ ద్వారానే వంద శాతం పన్ను చెల్లింపు విధానాన్ని అమలుచేయాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ గతంలో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. ఫాస్టాగ్‌ అమలును ఫిబ్రవరి 15 వరకు సడలిస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రతి టోల్ ప్లాజా పరిధిలో హైబ్రిడ్‌ పేరిట ఒక్కో మార్గాన్ని నగదు చెల్లింపు కోసం కేటాయించారు.  2017, డిసెంబరు 1వ తేదీ తరవాత తయారైన అన్ని రకాల సరుకు రవాణా వాహనాలకు కూడా ఫాస్టాగ్‌ను అనివార్యం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆయా వాహనదారులకు వెసులుబాటు కల్పించేందుకు వీలుగా గడువు పొడిగించినట్లు పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు ఇప్పుడు అమమలవుతున్న విధానం లాగే, ప్రతి టోల్‌ ప్లాజా పరిధిలో ఒక్కో మార్గంలో నగదు రూపంలో టోల్ ‌టాక్స్‌ను చెల్లించవచ్చని, ఆ తరవాతి నుంచి వంద శాతం ఫాస్టాగ్‌ను అమలుచేస్తామని కేంద్రం తెలిపింది. జనవరి 1వ తేదీ నుంచి ఫాస్టాగ్‌ ద్వారానే టోల్‌ ట్యాక్స్‌ చెల్లించాలనే నిబంధనతో.. చాలా ప్రాంతాల్లోని టోల్‌ ప్లాజాల వద్ద వాహనదారులు ఫాస్టాగ్‌ కోసం బారులుదీరారు. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో కాస్త ఊరట చెందారు. 


మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

ట్రైన్ టికెట్ ఇక సరికొత్తగా..

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్రం కన్నెర్ర.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్!

రజనీ డెడ్లీ డెసిషన్ తో వారికి ఇనుప తెర ?

ధరణి పోర్టల్... స్లాట్ రద్దు చేసుకుంటే డబ్బులు వాపస్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>