MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0006396c-d921-4a48-9520-2d8bf8ea79c7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0006396c-d921-4a48-9520-2d8bf8ea79c7-415x250-IndiaHerald.jpgఇక టాలీవుడ్ సినిమా ప‌రిశ్ర‌మ అంటే గ‌త రెండు ద‌శాబ్దాల్లో సినిమాల రిలీజ్‌ల్లో ఎన్నో సంచ‌ల‌న రికార్డులు క్రియేట్ చేసింది. ప్ర‌తి యేటా టాలీవుడ్ నుంచి 150 వ‌ర‌కు సినిమాలు రిలీజ్ అవుతూ ఉండేవి. ఓవ‌రాల్‌గా ద‌క్షిణ భార‌త సినీ ప‌రిశ్ర‌మ‌లో 500కు త‌గ్గ‌కుండా సినిమాలు ఉండేవి. ప్ర‌తి శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో కొత్త బొమ్మ ప‌డిపోయేది. క‌రోనా దెబ్బ‌తో అస‌లు ఏడెనిమిది నెల‌లుగా సినిమాలే లేవు. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ గ‌త రెండు ద‌శాబ్దాల్లో ఎన్న‌డూ లేనంత చెత్త రికార్డును మూట క‌ట్టుకుంది.tollywood;tollywood;cinema;telugu;hollywood;2020;cycle;letter2020 టాలీవుడ్‌లోనే చెత్త రికార్డు... అది ఇదే..!2020 టాలీవుడ్‌లోనే చెత్త రికార్డు... అది ఇదే..!tollywood;tollywood;cinema;telugu;hollywood;2020;cycle;letterFri, 01 Jan 2021 14:48:30 GMT2020 సంవ‌త్స‌రం ప్ర‌పంచానికే పెద్ద చెత్త సంవ‌త్స‌రంగా చెప్పుకోవాలి. ఈ యేడాది క‌రోనా ప్ర‌భావం ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో రంగాల‌ను అత‌లా కుత‌లం చేసింది. ఈ ప్ర‌భావం ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంట‌ర్టైన్ మెంట్ రంగంపై కూడా తీవ్రంగా ప‌డింది. హాలీవుడ్, బాలీవుడ్‌, టాలీవుడ్ ఇలా ఎన్నో సినిమా రంగాల్లో ఎంతో మంది తీవ్రంగా న‌ష్ట‌పోయారు. థియేట‌ర్ల వ‌ద్ద సైకిల్ క్యాంటిన్లు పెట్టుకున్నోళ్ల నుంచి ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు, థియేట‌ర్ల ఓన‌ర్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది క‌రోనా దెబ్బ‌తో న‌ష్ట‌పోయారు.

ఇక టాలీవుడ్ సినిమా ప‌రిశ్ర‌మ అంటే గ‌త రెండు ద‌శాబ్దాల్లో సినిమాల రిలీజ్‌ల్లో ఎన్నో సంచ‌ల‌న రికార్డులు క్రియేట్  చేసింది. ప్ర‌తి యేటా టాలీవుడ్ నుంచి 150 వ‌ర‌కు సినిమాలు రిలీజ్ అవుతూ ఉండేవి. ఓవ‌రాల్‌గా ద‌క్షిణ భార‌త సినీ ప‌రిశ్ర‌మ‌లో 500కు త‌గ్గ‌కుండా సినిమాలు ఉండేవి. ప్ర‌తి శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో కొత్త బొమ్మ ప‌డిపోయేది. క‌రోనా దెబ్బ‌తో అస‌లు ఏడెనిమిది నెల‌లుగా సినిమాలే లేవు. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ గ‌త రెండు ద‌శాబ్దాల్లో ఎన్న‌డూ లేనంత చెత్త రికార్డును మూట క‌ట్టుకుంది.

టాలీవుడ్‌లో 2020లో విడుదలైన సినిమాల సంఖ్య షాక్ కి గురి చేస్తోంది. గ‌త ప‌దేళ్ల లిస్ట్ చూస్తే ఈ యేడాది మాత్రమే చాలా త‌క్కువ సినిమాలు వ‌చ్చాయి. మొత్తం ఈ యేడాది తెలుగులో 65 సినిమాలు రిలీజ్ అయితే.. ఇందులో తెలుగు 50, డ‌బ్బింగ్ 15 మాత్ర‌మే వ‌చ్చాయి. 2011లో 243, 2014లో 276, 2019లో 269 సినిమాలు వ‌స్తే ... ఈ యేడాది మాత్రం కేవ‌లం 65 మాత్ర‌మే వ‌చ్చాయి. వీటిల్లో కూడా సంక్రాంతికి వ‌చ్చిన సినిమాలు ఆ త‌ర్వాత భీష్మ మిన‌హా మిగిలిన సినిమాల‌కు అంత స‌క్సెస్ టాక్ లేదు.

ఏదేమైనా గ‌త రెండు ద‌శాబ్దాల చ‌రిత్ర‌లో టాలీవుడ్ చాలా ఘోర‌మైన రికార్డును మూట క‌ట్టు కోవాల్సి వ‌చ్చింది. 2021లో అయినా ప‌రిస్థితి మెరుగు ప‌డుతుందేమో ?  చూడాలి. 


అందుకోసం 83కోట్ల సిరంజీల ఆర్డర్..!

గర్భం దాల్చిన పది రోజుల తర్వాత మళ్లీ గర్భం.. అసలు ఏం జరిగిందంటే..

క్రాక్ ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది.. ఈ సారి కేకే!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>