PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pcc97616407-da2e-4bdf-b517-3285290ca91a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pcc97616407-da2e-4bdf-b517-3285290ca91a-415x250-IndiaHerald.jpg ఇప్పటి వరకు పడిన కష్టాలు చాలవన్నట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త కష్టాలు మొదలయ్యాయి. అది కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో ఈ సంవత్సరం అంతగా కాంగ్రెస్ కు కలిసి వచ్చేలా కనిపించడం లేదు. ఇప్పటికే తెలంగాణలో బలమైన రాజకీయ పార్టీగా ముద్ర వేయించుకుంటూ వస్తున్న బిజెపి ఇప్పుడు కాంగ్రెస్ లోని కీలక నాయకులు అందరినీ తమ వైపు తిప్పుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ లో పిసిసి అధ్యక్షుడు ఎంపికపైనా పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతున్న క్రమంలో ఇప్పటి కే కాంగ్రెస్ పరిస్థితి నివురుగప్పిన నిప్revanth reddy pcc president komatireddy rajagopal;view;revanth;tiru;venkat;bharatiya janata party;telangana rashtra samithi trs;komatireddy rajgopal reddy;telangana;congress;tirupati;mla;fire;reddyకాంగ్రెస్ తో కోమటిరెడ్డి కటీఫ్ ! మరి రేవంత్ ..?కాంగ్రెస్ తో కోమటిరెడ్డి కటీఫ్ ! మరి రేవంత్ ..?revanth reddy pcc president komatireddy rajagopal;view;revanth;tiru;venkat;bharatiya janata party;telangana rashtra samithi trs;komatireddy rajgopal reddy;telangana;congress;tirupati;mla;fire;reddyFri, 01 Jan 2021 22:00:00 GMTఇప్పటి వరకు పడిన కష్టాలు చాలవన్నట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త కష్టాలు మొదలయ్యాయి. అది కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో ఈ సంవత్సరం అంతగా కాంగ్రెస్ కు కలిసి వచ్చేలా కనిపించడం లేదు. ఇప్పటికే తెలంగాణలో బలమైన రాజకీయ పార్టీగా ముద్ర వేయించుకుంటూ వస్తున్న బిజెపి ఇప్పుడు కాంగ్రెస్ లోని కీలక నాయకులు అందరినీ తమ వైపు తిప్పుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ లో పిసిసి అధ్యక్షుడు ఎంపికపైనా పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతున్న క్రమంలో ఇప్పటి కే కాంగ్రెస్ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇదే సమయంలో అకస్మాత్తుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుమల శ్రీవారి సన్నిధికి వచ్చిన సందర్భంగా తాను బీజేపీలో చేరబోతున్నాను అంటూ ప్రకటించడం సంచలనంగా మారింది.



 ఆయన తో పాటు ఎవరెవరు బిజెపి లోకి వెళ్తున్నారు అనే ఆసక్తి సర్వత్రా మొదలైంది. ప్రస్తుతం పిసిసి అధ్యక్ష పదవి కోసం రేవంత్ రెడ్డితో పాటు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకట్ రెడ్డి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలోనే అకస్మాత్తుగా వెంకట్ రెడ్డి ఈ ప్రకటన చేయడం సంచలనం సృష్టిస్తోంది. కోమటిరెడ్డి బాటలోనే మరికొందరు కాంగ్రెస్ సీనియర్లు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.



అలాగే రేవంత్ కోసం బిజెపి గట్టిగానే ప్రయత్నాలు చేసినా, ఆయన కాంగ్రెస్ లోనే ఉండేందుకు ఎక్కువగా మొగ్గు చూపించడం, వంటి కారణంతో కాంగ్రెస్ లో ఉన్న రేవంత్ వ్యతిరేక వర్గం అందరిని బిజెపి వైపు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అలాగే రేవంత్ కూడా బిజెపి బాట పట్టించేందుకు తెరవెనుక గట్టిగానే ప్రయత్నాలు సాగుతున్నాయని, ఒకవేళ ఆయన రాకపోయినా, కాంగ్రెస్ లో కీలక నాయకులందరినీ బిజెపి వైపు కు తిప్పుకుని టీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలకు దెబ్బకొట్టి బలమైన శక్తిగా తెలంగాణలో అవతరించాలి అనేది బిజెపి పెద్దల రాజకీయ వ్యూహం గా కనిపిస్తోంది.


మహేశ్ బాబు బిహేవియర్ ఇదా..?

తండ్రయిన టీమిండియా పేసర్.. సరిగ్గా న్యూఇయర్ రోజు...

అమ్మో భారత్ బౌలింగ్ ఆడలేకుకపోతున్నాం.. విలవిల్లాడుతున్న ఆసీస్

రంగ్‌దే రిలీజ్ డేట్ ఫిక్స్.. కీర్తి అందాన్ని చూడడానికి రెడీగా ఉండండి...

మూడో టెస్టులో రోహిత్, నట్టూ... ఇక ఆసీస్‌కు చుక్కలే...

సంక్రాంతికి ఆ రెండూ క్రేజీ మూవీస్ ?

హరీష్ రావుని స్పెషల్ గా ఫోకస్ చేసిన బిజెపి... సోషల్ మీడియాలో ఏం చేస్తారు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>