HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/meku-eakuvaga-juttu-raluthonda-eaythy-e-7-chitkalu-patisthy-sarie1f59ab2-c4db-46bf-8bdc-651edb305ca2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/meku-eakuvaga-juttu-raluthonda-eaythy-e-7-chitkalu-patisthy-sarie1f59ab2-c4db-46bf-8bdc-651edb305ca2-415x250-IndiaHerald.jpgజుట్టు రాలే సమస్య ప్రతి ఒక్క అమ్మాయిలోనూ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఎంతోమంది మగువల మనసును కూడా కలవరపెడుతోంది. మార్కెట్లో దొరికే ఎన్నో ప్రొడక్ట్స్ వల్ల జుట్టు రాలడం మారకపోగా ఇంకా ఎక్కువ జుట్టు రాలిపోతుంది. పైగా చుండ్రు కూడా మొదలవుతుంది. ఇలాంటి కారణాల అన్నింటికీ ఇప్పుడు చెక్ పెట్టబోతున్నాం. మనకు ఎప్పుడూ అందుబాటులో ఉండే వంటింటి చిట్కాల ద్వారా జుట్టు రాలే సమస్యను దూరం చేసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ వంటింటి చిట్కాలు ఏంటో? వాటి ద్వారా మన జుట్టు రాలే సమస్యను ఎలా తగ్గించుకోవచ్చో? ఇప్పుడు ఇక్కgreentea,allovera,pasupu,soyabeans,ullipaya,gumad;gummadi;onion;turmeric;sugar;cheque;oil;green tea;manam;shaktiమీకు ఎక్కువగా జుట్టు రాలుతోందా ?అయితే ఈ 7 చిట్కాలు పాటిస్తే సరిపోద్దీ !మీకు ఎక్కువగా జుట్టు రాలుతోందా ?అయితే ఈ 7 చిట్కాలు పాటిస్తే సరిపోద్దీ !greentea,allovera,pasupu,soyabeans,ullipaya,gumad;gummadi;onion;turmeric;sugar;cheque;oil;green tea;manam;shaktiFri, 01 Jan 2021 15:07:00 GMTచెక్ పెట్టబోతున్నాం. మనకు ఎప్పుడూ అందుబాటులో ఉండే వంటింటి చిట్కాల ద్వారా జుట్టు రాలే సమస్యను దూరం చేసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆ వంటింటి చిట్కాలు ఏంటో? వాటి ద్వారా మన జుట్టు రాలే సమస్యను ఎలా తగ్గించుకోవచ్చో? ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

 గ్రీన్ టీ:
గ్రీన్ టీ ని సాధారణంగా బరువు తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుందని మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు సరికొత్తగా జుట్టురాలే సమస్యను కూడా అరికడుతుందట.గ్రీన్ టీని కొద్దికొద్దిగా మాడుకు పట్టించి, సుతిమెత్తగా మర్దనా చేయాలి.ఇందువల్ల కుదుళ్ళలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. గ్రీన్ టీలో ఉండే ఈసీజీసీ  గుణాలు జుట్టు రాలడాన్ని అరికడుతుంది.

కొబ్బరి నూనె:
కొబ్బరి నూనెను రోజు సరైన పద్ధతిలో వాడితే జుట్టు రాలడమే కాకుండా పొడిబారకుండా ఉంటుంది. మనలో చాలామందికి రోజూ తలస్నానం చేసే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల జుట్టుకు కొబ్బరి నూనె సరిగా పెట్టరు. కొబ్బరి నూనెలో ఉండే లూరిక్  యాసిడ్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.  గోరువెచ్చని నూనెలు జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి అని మనందరికీ తెలుసు. కాబట్టి సరైన పద్ధతిలో కొబ్బరి నూనె జుట్టుకు అందించడం ద్వారా జుట్టు రాలే సమస్య నుండి బయటపడవచ్చు.

ఉల్లిపాయ:
ఉల్లిపాయ జుట్టు రాలే సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఉల్లిపాయ రసాన్ని కుదుళ్ళలో పట్టించి బాగా మర్దన చేయాలి. 30 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకుంటే,జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ పద్ధతిని వారానికి ఒకసారి పాటించడం వల్ల ఫలితం తొందరగా లభిస్తుంది.

కలబంద:
కలబంద గుజ్జును కుదుళ్ళలో పట్టించి, తలంటు పోసుకోవాలి.ఇలా చేయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా చుండ్రుని కూడా నివారించగలిగే శక్తి కలబందకు ఉంది.

పసుపు:
పసుపు ముఖ్యంగా యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంది. రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలలో చిటికెడు పసుపు కలిపి త్రాగడం వల్ల మంచి నిద్రతో పాటు, ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.పసుపులో ఉండే కర్కుమిన్ అనే రసాయనం జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది.

గుమ్మడి విత్తనాలు:
గుమ్మడి విత్తనాలు కూడా డ్రైఫ్రూట్స్ కోవకు చెందినవే.గొప్ప ఎంజైమ్లతో కూడిన గుమ్మడి విత్తనాలు తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు.

సోయా చిక్కుళ్ళు:
సోయా చిక్కుళ్ల ను ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలతో పాటు సమస్యలను కూడా దూరం చేస్తుంది. డయాబెటిస్  రోగులకు సోయా చిక్కుళ్ళు మంచి ఔషధంగా పనిచేస్తాయి.


లోకేష్ జోష్ మామూలుగా లేదుగా.. టీడీపీలో కొత్త ఉత్సాహం..!

గర్భం దాల్చిన పది రోజుల తర్వాత మళ్లీ గర్భం.. అసలు ఏం జరిగిందంటే..

క్రాక్ ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది.. ఈ సారి కేకే!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>