EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/jagan25a1f251-bc55-4a54-a912-4162bfcd55ea-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/jagan25a1f251-bc55-4a54-a912-4162bfcd55ea-415x250-IndiaHerald.jpgఎలాగైనా జగన్ ను దెబ్బ కొట్టాలి.. ఇది ఏపీలో విపక్షాల ఆలోచన.. అందులో ఎలాంటి తప్పు లేదు.. రాజకీయాల్లో ఇవి సహజం.. అయితే జగన్ ను ఎలా దెబ్బ కొట్టాలి.. జగన్‌ పరిపాలనకు కొత్తే అయినా.. మొదట్లో కాస్త తడబడినా.. ముక్కుసూటిగా ముందుకు వెళ్తున్నాడు.. తాను ఏం చేస్తానన్నాడో ప్రజలకు ఏం హామీలు ఇచ్చాడో వాటిని నెరవేరుస్తున్నాడు.. ఎన్నికల మేనిఫెస్టోను పక్కాగా అమలు చేస్తున్నాడు. సమాజంలోని అన్ని వర్గాలకూ ఎంతో కొంత మేలు చేసే పథకాలు అమలు చేస్తున్నాడు. మరి ఇలాగైతే జగన్ ను దెబ్బ కొట్టడం ఎలా.. ఏదో ఒక సమస్యను హైలెట్ చేస్తూjagan;amala akkineni;bharatiya janata party;jagan;government;hindus;tirumala tirupathi devasthanamజగన్ ను దెబ్బ కొట్టాలంటే.. ఇక అదొక్కటే మార్గమా..?జగన్ ను దెబ్బ కొట్టాలంటే.. ఇక అదొక్కటే మార్గమా..?jagan;amala akkineni;bharatiya janata party;jagan;government;hindus;tirumala tirupathi devasthanamFri, 01 Jan 2021 00:00:00 GMTజగన్ ను దెబ్బ కొట్టాలి.. ఇది ఏపీలో విపక్షాల ఆలోచన.. అందులో ఎలాంటి తప్పు లేదు.. రాజకీయాల్లో ఇవి సహజం.. అయితే జగన్ ను ఎలా దెబ్బ కొట్టాలి.. జగన్‌ పరిపాలనకు కొత్తే అయినా.. మొదట్లో కాస్త తడబడినా.. ముక్కుసూటిగా ముందుకు వెళ్తున్నాడు.. తాను ఏం చేస్తానన్నాడో ప్రజలకు ఏం హామీలు ఇచ్చాడో వాటిని నెరవేరుస్తున్నాడు.. ఎన్నికల మేనిఫెస్టోను పక్కాగా అమలు చేస్తున్నాడు. సమాజంలోని అన్ని వర్గాలకూ ఎంతో కొంత మేలు చేసే పథకాలు అమలు చేస్తున్నాడు.

మరి ఇలాగైతే జగన్ ను దెబ్బ కొట్టడం ఎలా.. ఏదో ఒక సమస్యను హైలెట్ చేస్తూ ఉద్యమాలు చేయకపోతే ప్రభుత్వంపై వ్యతిరేకత ఎలా వస్తుంది.. అయితే జగన్‌ను ఎదుర్కొనేందుకు సరైన ఆయుధాలు విపక్షాలకు దొరకడం లేదు. అందుకే ఇప్పుడు జగన్ ను వ్యతిరేకించే వారికి ఒకే ఒక్క మార్గం కనిపిస్తోంది. అదే మతం.. ఏపీలో మెజారిటీ మతం హిందువులు.. కానీ పాలకుడైన జగన్ క్రైస్తవుడు. జగన్ పేరుకు క్రైస్తవుడే అయినా.. ఆ పక్షపాతం ఎక్కడా ఆయన పాలనలో కనిపించడం లేదు.

కానీ.. విపక్షాలు వదిలేస్తాయా.. అందుకే రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న మతపరమైన ఘటన జరిగినా దాన్ని బూతద్దంలో చూపుతూ జగన్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయి. చిన్న విషయాలను పెద్దగా చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే జగన్ క్రైస్తవుడు కదా. అలా జగన్‌ను టార్గెట్ చేసేందుకు విపక్షాలు నానా తిప్పలు పడుతున్నాయి. అందులోనూ పొరుగున ఉన్న తెలంగాణలో బీజేపీ ఈ ఎజెండాతో మొన్నటి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో లాభపడిందన్నది వారి ఆలోచన.

మరి ఈ ఆలోచన వర్కవుట్ అవుతుందా.. మతం అంశంతో జనాన్ని విపక్షాలు రెచ్చగొట్టగలుగుతాయా.. ఆ విషయంలో ఎంత వరకూ సక్సస్ అవుతాయో చూడాలి. అందుకే విపక్షాలు వీలైనంత వరకూ మతపరంగా సున్నితమైన టీటీడీ అంశంపైనా దృష్టి సారిస్తున్నాయి. అక్కడ ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని జగన్‌కు వ్యతిరేకంగా చిత్రీకరిస్తున్నాయి.




ఈ సారి మహేష్ 'మహర్షి'లో ఆ క్రికెటర్.. ఇరగదీస్తున్నాడుగా...

ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్రం కన్నెర్ర.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్!

రజనీ డెడ్లీ డెసిషన్ తో వారికి ఇనుప తెర ?

ధరణి పోర్టల్... స్లాట్ రద్దు చేసుకుంటే డబ్బులు వాపస్

'బండి'కి ఢిల్లీ పిలుపు ? బీజేపీ పెద్ద ల నిర్ణయం ఏంటో ?

బడ్జెట్ విషయంలో వెనక్కు తగ్గని డైరెక్టర్.. టెన్షన్‌లో బాలయ్య నిర్మాత!

2020లో తెలంగాణలో బీజేపీ హవా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>