PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-mind-game-in-ap-politics-ff5e396c-72c5-4417-8708-1e2b84230f21-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-mind-game-in-ap-politics-ff5e396c-72c5-4417-8708-1e2b84230f21-415x250-IndiaHerald.jpgపవన్ కల్యాణ్ పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేస్తున్నారా? సడన్‌గా వచ్చి జగన్‌ని తిట్టి, తన పార్ట్‌నర్‌కు సాయం చేస్తున్నారా? అంటే వైసీపీ వర్షన్ బట్టి చూస్తే అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కల్యాణ్ ఇప్పటివరకు రాజకీయం చూస్తే అలాగే ఉంటుంది. జనసేన పార్టీ పెట్టి పవన్ 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ-టీడీపీలకు మద్ధతు ఇచ్చి, ఏపీలో అధికారంలోకి రావడానికి కృషి చేశారు. pawan kalyan;pawan;cbn;nani;nithya new;pawan kalyan;tara;bharatiya janata party;krishna river;jagan;geum;janasena;2019;cinema;government;perni nani;tdp;ycp;janasena party;party;mantraబాబోయ్: పవన్ మైండ్ గేమ్ మామూలుగా లేదుగా!బాబోయ్: పవన్ మైండ్ గేమ్ మామూలుగా లేదుగా!pawan kalyan;pawan;cbn;nani;nithya new;pawan kalyan;tara;bharatiya janata party;krishna river;jagan;geum;janasena;2019;cinema;government;perni nani;tdp;ycp;janasena party;party;mantraFri, 01 Jan 2021 04:00:00 GMTపవన్ కల్యాణ్ పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేస్తున్నారా? సడన్‌గా వచ్చి జగన్‌ని తిట్టి, తన పార్ట్‌నర్‌కు సాయం చేస్తున్నారా? అంటే వైసీపీ వర్షన్ బట్టి చూస్తే అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కల్యాణ్ ఇప్పటివరకు రాజకీయం చూస్తే అలాగే ఉంటుంది. జనసేన పార్టీ పెట్టి పవన్ 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ-టీడీపీలకు మద్ధతు ఇచ్చి, ఏపీలో అధికారంలోకి రావడానికి కృషి చేశారు.

ఆ కూటమి అధికారంలోకి వచ్చాక కూడా పవన్ ఫుల్ టైమ్ పాలిటిక్స్ చేయలేదు. అప్పుడప్పుడు ఎంట్రీ ఇచ్చి, చంద్రబాబు ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఇక 2017లో ఏ పార్టీతో పొత్తు లేదని చెప్పి బయటకొచ్చి, బీజేపీ, టీడీపీలని తెగ తిట్టారు. మళ్ళీ 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులు, బి‌ఎస్‌పిలతో కలిసి పోటీ చేసి, అప్పటి టీడీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని చీల్చి వైసీపీని దెబ్బ కొట్టి, మళ్ళీ చంద్రబాబుకు లబ్ది చేద్దామని చూశారు. కానీ అది వర్కౌట్ కాలేదు. జగన్‌ భారీగా సీట్లు తెచ్చుకుని అధికారంలోకి వచ్చారు.

జగన్ అధికారంలోకి వచ్చాక, చంద్రబాబు నిత్యం వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక పవన్ సైతం మునుపటిలానే అప్పుడప్పుడు బయటకొచ్చి జగన్ ప్రభుత్వాన్ని తిడుతూ చంద్రబాబుకు లబ్ది చేకూరేలా నడుచుకుంటున్నట్లు కనిపిస్తోంది. బీజేపీతో పొత్తులో ఉంటూనే, టీడీపీకి ఫేవర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా తాజాగా కృష్ణా జిల్లాలో పవన్, నారా లోకేష్‌లు ఒక్కసారే పర్యటించి, జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారంటేనే అర్ధం చేసుకోవచ్చు.

పైగా పవన్ అప్పటివరకూ సినిమా షూటింగుల్లో ఉండి, ఒక్కసారిగా వచ్చి జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలు టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఇద్దరు మంత్రులు చంద్రబాబుపై ఎప్పుడు ఫైర్ అవుతారు. కానీ పవన్‌పై పెద్దగా విమర్శలు చేయలేదు. అయితే వీరినే పవన్ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేశారు. అంటే దీని బట్టి చూసుకుంటే పవన్ మైండ్ గేమ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. బాబుని సేవ్ చేయడానికే పవన్ ఉన్నారని ఫైర్ అవుతున్నారు.




ఈ సారి మహేష్ 'మహర్షి'లో ఆ క్రికెటర్.. ఇరగదీస్తున్నాడుగా...

ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్రం కన్నెర్ర.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్!

రజనీ డెడ్లీ డెసిషన్ తో వారికి ఇనుప తెర ?

ధరణి పోర్టల్... స్లాట్ రద్దు చేసుకుంటే డబ్బులు వాపస్

'బండి'కి ఢిల్లీ పిలుపు ? బీజేపీ పెద్ద ల నిర్ణయం ఏంటో ?

బడ్జెట్ విషయంలో వెనక్కు తగ్గని డైరెక్టర్.. టెన్షన్‌లో బాలయ్య నిర్మాత!

2020లో తెలంగాణలో బీజేపీ హవా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>