Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/india-vs-australiac986cac6-4bd1-43b2-93b2-ad43ece0c9ee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/india-vs-australiac986cac6-4bd1-43b2-93b2-ad43ece0c9ee-415x250-IndiaHerald.jpgటీమిండియా బౌలింగ్ ఆడాలంటే ఆసీస్ బ్యాట్స్‌మెన్ కంగారెత్తిపోతున్నారట. ‘వామ్మో వాళ్ల బౌలింగ్ ఆడలేకపోతున్నాం’ అంటూ వాపోతున్నారట. అంతేకాదు భారత లెగ్ సైడ్ ఫీల్డింగ్‌ని సైతం వారు ఎదుర్కోలేకపోతున్నారట. దీనిపై ఆసీస్ బ్యాట్స్‌మెన్ లబుషేన్ స్వయంగా మాట్లాడాడు. భారత లెగ్ సైడ్ వ్యూహాన్ని ఛేదించాల్సిన అవసరం..india vs australia;view;rohit;rohit sharma;india;yuva;paruguఅమ్మో భారత్ బౌలింగ్ ఆడలేకుకపోతున్నాం.. విలవిల్లాడుతున్న ఆసీస్అమ్మో భారత్ బౌలింగ్ ఆడలేకుకపోతున్నాం.. విలవిల్లాడుతున్న ఆసీస్india vs australia;view;rohit;rohit sharma;india;yuva;paruguFri, 01 Jan 2021 21:24:00 GMTఇంటర్నెట్‌ డెస్క్‌: టీమిండియా బౌలింగ్ ఆడాలంటే ఆసీస్ బ్యాట్స్‌మెన్ కంగారెత్తిపోతున్నారట. ‘వామ్మో వాళ్ల బౌలింగ్ ఆడలేకపోతున్నాం’ అంటూ వాపోతున్నారట. అంతేకాదు భారత లెగ్ సైడ్ ఫీల్డింగ్‌ని సైతం వారు ఎదుర్కోలేకపోతున్నారట. దీనిపై ఆసీస్ బ్యాట్స్‌మెన్ లబుషేన్ స్వయంగా మాట్లాడాడు. భారత లెగ్ సైడ్ వ్యూహాన్ని ఛేదించాల్సిన అవసరం ఉందని, లేదంటే పరుగులు రాబట్టడం కష్టమని అన్నాడు. ‘బౌండరీలు బాదడం పక్కబెట్టండి.. కనీసం బంతులు ఎదుర్కోవడం కూడా కష్టంగా ఉంటోంది’ అంటూ వాపోయాడు. కచ్చితంగా దీనికి ప్రతి వ్యూహం కనిపెట్టాలని, తమ జట్టు అదే పనిలో ఉందని లబుషేన్ చెప్పుకొచ్చాడు.

బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా ఆసీస్‌కు చుక్కలు చూపెడుతోంది. తొలి మ్యాచ్ డే అండ్ నైట్ టెస్టు నుంచే కంగారూలను కంగారెత్తిస్తోంది. ఆ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో దారుణంగా 36 పరుగులకే ఆలౌక్ కాకపోయి ఉంటే.. భారత్ ఆ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి ఉండేది. ఇక రెండో టెస్టులోనూ అనూహ్యమైన లెగ్ సైడ్ ఫీల్డింగ్‌తో ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తోంది. మూడు ఇన్నింగ్సుల్లో ఒక్కసారి కూడా ఆసీస్ 200 పరుగులు చేయలేకపోయిందంటే.. భారత బౌలింగ్ కానీ, ఫీల్డింగ్ కానీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

విచిత్రమైన స్టాన్స్‌తో పరుగులు చేసే స్టీవ్‌స్మిత్‌, నిలకడకు మారుపేరైన లబుషేన్‌ వంటి ఆటగాళ్లను వలపన్ని మరీ ఔట్‌ చేశారు. షార్ట్‌ పిచ్, స్ట్రెయిట్‌ లైన్‌ బంతులు విసిరినప్పుడు‌ లెగ్‌స్లిప్‌, షార్ట్‌ లెగ్‌, లెగ్‌ గల్లీ, స్క్వేర్‌ లెగ్‌, మిడ్‌ వికెట్‌, మిడాన్‌, డీప్‌ ఫైన్‌లెగ్‌లో ఫీల్డర్లను మోహరించారు. ఆఫ్‌సైడ్‌ ఆడకుండా కేవలం లెగ్‌సైడ్‌ ఆడేలా బంతులు వేశారు. డిఫెన్స్‌కూ తావులేకుండా కట్టడి చేసి వికెట్లు రాబట్టారు. దీంతో ఆసీస్ జట్టు తలలు పట్టుకుంటోంది. భారత వ్యూహాలను ఎలా తిప్పి కొట్టాలో అర్థం కాక మల్లగుల్లాలు పడుతోంది.

ఇదిలా ఉంటే మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న మూడో టెస్టులోనూ  సత్తా చాటి విజయం సాధించాలని భారత్ కసిగా ఉంది. జట్టులోకి కొత్తగా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, యార్కర్ స్పెషలిస్ట్, యువ పేసర్ నటరాజన్ జట్టులోకి రావడంతో టీమిండియా బలం మరింత పెరిగినట్లైంది.


సమంతకు మరో లక్కీ ఛాన్స్.. శాకుంతలంలో ఆమె ఫిక్స్..!

రంగ్‌దే రిలీజ్ డేట్ ఫిక్స్.. కీర్తి అందాన్ని చూడడానికి రెడీగా ఉండండి...

మూడో టెస్టులో రోహిత్, నట్టూ... ఇక ఆసీస్‌కు చుక్కలే...

సంక్రాంతికి ఆ రెండూ క్రేజీ మూవీస్ ?

హరీష్ రావుని స్పెషల్ గా ఫోకస్ చేసిన బిజెపి... సోషల్ మీడియాలో ఏం చేస్తారు...?

జగన్ రెడ్డీ.. అప్పన్న సన్నిధికి రా.. తేల్చుకుందాం: నారా లోకేష్

బుల్లిపిట్ట: చంద్రుడిపై స్థలం కొన్న తరువాత.. ఏం జరుగుతుందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>