PoliticsSiva Prasadeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-there-is-a-conspiracy-behind-the-destruction-of-the-statuea1b7e063-db0d-436b-9afd-244bd99ce408-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-there-is-a-conspiracy-behind-the-destruction-of-the-statuea1b7e063-db0d-436b-9afd-244bd99ce408-415x250-IndiaHerald.jpgపవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం ఆలయంలోని కోదండ రాముడి విగ్రహం ధ్వంసంపై రాజకీయాల్లో రగడ చెలరేగింది. వైసీపీ, టీడీపీపై ఒకరినొకరు నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఆలయంలో విగ్రహ ధ్వంసం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆరోపించారు. రామతీర్థంలోని రాముని విగ్రహం ధ్వంసం వెనుక కుట్ర దాగి ఉందని ఆయన పేర్కొన్నారు. అందులో చంద్రబాబు నాయుడు పాత్ర కచ్చితంగా ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.viajyasai reddy;deva;ramu;jagan;v vijayasai reddy;rajya sabha;district;police;chief minister;air;chinna jeeyar swamy ji;tdp;ycp;rama tirtha;reddyకోదండ రాముడి విగ్రహ ధ్వంసం చంద్రబాబు కుట్రే: విజయ సాయిరెడ్డికోదండ రాముడి విగ్రహ ధ్వంసం చంద్రబాబు కుట్రే: విజయ సాయిరెడ్డిviajyasai reddy;deva;ramu;jagan;v vijayasai reddy;rajya sabha;district;police;chief minister;air;chinna jeeyar swamy ji;tdp;ycp;rama tirtha;reddyFri, 01 Jan 2021 17:33:55 GMTవైసీపీ, టీడీపీపై ఒకరినొకరు నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఆలయంలో విగ్రహ ధ్వంసం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆరోపించారు. రామతీర్థంలోని రాముని విగ్రహం ధ్వంసం వెనుక కుట్ర దాగి ఉందని ఆయన పేర్కొన్నారు. అందులో చంద్రబాబు నాయుడు పాత్ర కచ్చితంగా ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఆ రోజు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో ప్రజల దృష్టి మరల్చేందుకే టీడీపీ నాయకులు ఈ కుట్ర పన్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. సీఎం జగన్ కు ప్రజల్లో వస్తున్న మంచి పేరును సహించలేక చంద్రబాబు ఇటువంటి పన్నాగాలు పన్నుతున్నారని విజయసాయిరెడ్డి ఆందోళన వ్య్తక్తం చేశారు. చంద్రబాబు కుయుక్తులు ప్రజలు గమనించాలని విజయ సాయిరెడ్డి సూచించారు.
                                          విజయనగరం జిల్లా రామతీర్థంలోని కోదండరామాలయంపై దుండగుల దాడి కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. అర్ధరాత్రి ఆలయంలో ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అయితే శ్రీరాముని విగ్రహానికి సంబంధించిన శిరస్సు భాగాన్ని ఆలయంలోని రామకొలనులో గుర్తించారు. అనంతరం జై శ్రీరాం నినాదాల మధ్య శిరస్సును ఆలయానికి చేర్చారు. చినజీయర్ స్వామి ఆశ్రమం ప్రతినిథులతో శిరస్సు పునఃప్రతిష్టకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు శ్రీరాముడి విగ్రహ ధ్వంసంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దేవుడి విగ్రహాలు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశాల పట్ల సీరియస్ గా వ్యవహరిస్తామని వైసీపీ ప్రభుత్వం కచ్చితంగా చెబుతుంది.


బుల్లిపిట్ట: చంద్రుడిపై స్థలం కొన్న తరువాత.. ఏం జరుగుతుందో తెలుసా?

సీఎం జగన్ హిందువు కాదు కాబట్టే ఇలా జరుగుతోంది.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బండి సంజయ్ ఫైర్స్ ఆన్ కెసిఆర్ ...?

గర్భం దాల్చిన పది రోజుల తర్వాత మళ్లీ గర్భం.. అసలు ఏం జరిగిందంటే..

క్రాక్ ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది.. ఈ సారి కేకే!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva Prasad]]>