PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycpded29608-1611-4369-adc2-233a2000017b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycpded29608-1611-4369-adc2-233a2000017b-415x250-IndiaHerald.jpgఏపీలో జగన్ ఒక వైపే చూస్తున్నారు అన్న విమర్శలు అయితే ఇప్పటికే ఉన్నాయి. ఆయన ఎంతసేపూ సంక్షేమం మీదనే దృష్టి సారిస్తూ అభివృద్ధిని పడకేయిస్తున్నారు అని ఓ వైపు గట్టిగానే అంటున్నారు. దానికి తోడు అన్నట్లుగా కొత్త సమస్యలు కూడా ఏపీ సర్కార్ ని చుట్టుముడుతున్నాయి. రాజకీయాల్లో ఎపుడు ఏది హైలెట్ అవుతుందో ఎవరికీ తెలియదు. అందునా కొన్ని విషయాలు ఉంటాయి. ycp;jagan;andhra pradesh;history;christian;traffic police;ycp;bhadradriవైసీపీ సర్కార్ కి అతి పెద్ద ముప్పు అదేనా ...?వైసీపీ సర్కార్ కి అతి పెద్ద ముప్పు అదేనా ...?ycp;jagan;andhra pradesh;history;christian;traffic police;ycp;bhadradriFri, 01 Jan 2021 22:00:00 GMTజగన్ ఒక వైపే చూస్తున్నారు అన్న విమర్శలు అయితే ఇప్పటికే  ఉన్నాయి. ఆయన ఎంతసేపూ సంక్షేమం మీదనే దృష్టి సారిస్తూ అభివృద్ధిని పడకేయిస్తున్నారు అని ఓ వైపు గట్టిగానే  అంటున్నారు. దానికి తోడు అన్నట్లుగా కొత్త సమస్యలు కూడా ఏపీ సర్కార్ ని చుట్టుముడుతున్నాయి. రాజకీయాల్లో ఎపుడు ఏది హైలెట్ అవుతుందో ఎవరికీ తెలియదు. అందునా కొన్ని విషయాలు  ఉంటాయి.

అవి చాలా సున్నితమైనవి. ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్నావి. వాటి విషయంలో వెంటనే అలెర్ట్ కాకపోతే అదే దావానలంగా చుట్టు ముడుతుంది. ఉత్తరాంధ్ర్రాలోని  రామతీర్ధాలు  సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం. నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం, ఉత్తరాంధ్రా భద్రాద్రి అని ప్రసిద్ధి కెక్కిన ఈ ఆలయంలో మొత్తం మానవాళికే ఆదర్శ పురుషుడు అయిన శ్రీరాముడి విగ్రాహాన్ని ఖండించడం అంటే దారుణాతి దారుణం.

ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉందని చెబుతున్నా మరో వైపు మరో చోట సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఆయన రెండు చేతులూ ఖండించారు అన్న వార్త వచ్చింది. ఇలా వరసగా హిందూ దేవతా మూర్తుల మీద దాడులు జరుగుతూంటే జగన్ సర్కార్ మీద ఒక వర్గం ప్రజలల్లో ఆగ్రహం కలుగుతుంది అంటే అందులో అతిశయోక్తి లేదు. మతం ఒక మత్తు మందు అంటారు. కానీ అంతకు మించి అది ఒక ప్రగాఢమైన విశ్వాసం. దానికి కనుక భంగం కలిగితే అది ఏ వైపుకైనా దారితీయవచ్చు.

ఇక ఏపీలో వరసగా జరుగుతున్న‌ ఈ ఘటనలు జగన్ సర్కార్ కి మాయని మచ్చలాగానే మిగిలిపోతాయి అని అంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున పోలీస్ యంత్రాంగ ఉంది. ఇంటెలిజెన్స్ విభాగం ఉంది. మరి ఎవరూ కూడా ఈ ఘటనలను  ఆపలేకపోతున్నారు అంటే అది చివరికి వైసీపీ సర్కార్ మెడకే చుట్టుకుంటుంది అంటున్నారు. ఇక జగన్ క్రిస్టియన్ కావడం వల్ల కూడా దీన్ని మరింత పెంచి పెద్ద చేసి వివాదంగా చేయడానికి విపక్షాలు సిధ్ధంగా ఉంటాయని అంటున్నారు. మొత్తానికి జగన్ సర్కార్ ఇకనైనా పూర్తి సీరియస్ గా వీటి మీద ఉండాలి. లేకపోతే ముంచుకొస్తున్న ముప్పుతో భారీ మూల్యమే చెల్లించుకున్నా ఆశ్చర్యం లేదు అని విశ్లేషణలు అయితే ఉన్నాయి.




మహేశ్ బాబు బిహేవియర్ ఇదా..?

తండ్రయిన టీమిండియా పేసర్.. సరిగ్గా న్యూఇయర్ రోజు...

అమ్మో భారత్ బౌలింగ్ ఆడలేకుకపోతున్నాం.. విలవిల్లాడుతున్న ఆసీస్

రంగ్‌దే రిలీజ్ డేట్ ఫిక్స్.. కీర్తి అందాన్ని చూడడానికి రెడీగా ఉండండి...

మూడో టెస్టులో రోహిత్, నట్టూ... ఇక ఆసీస్‌కు చుక్కలే...

సంక్రాంతికి ఆ రెండూ క్రేజీ మూవీస్ ?

హరీష్ రావుని స్పెషల్ గా ఫోకస్ చేసిన బిజెపి... సోషల్ మీడియాలో ఏం చేస్తారు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>