PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcpbd09255d-621d-4012-9a7f-cffbe2996845-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcpbd09255d-621d-4012-9a7f-cffbe2996845-415x250-IndiaHerald.jpgక‌రోనా కేసుల‌ను కూడాఎప్ప‌టిక‌ప్పుడు అందించిన తొలిరాష్ట్రంగా కూడా ఏపీ రికార్డు సృష్టించింది. ఇక‌, కీల‌క ప‌థ‌కాల అమ‌లు తీరు కూడా పుంజుకుంది. అనేక ప‌థ‌కాల‌ను ఈ ఏడాది ప్రారంభించి అమ‌లు చేశారు. చేయూత‌, జ‌గ‌న‌న్న విద్యాదీవెన‌, వ‌స‌తి దీవెన వంటి కీల‌క ప‌థ‌కాల‌కు ఈ ఏడాది వేదిక‌గా నిలిచింది. ఇక‌, రాజ‌కీయంగా చూసుకుంటే.. చిన్న‌పాటి విరుపులు త‌ప్ప‌.. పెద్ద‌గా ఇబ్బంది క‌లిగించిన ప‌రిణామాలు లేవు. అయితే.. హైకోర్టు జోక్యంతో ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు రంగుల విష‌యంలో వెన‌క్కి త‌గ్గాల్సి వ‌చ్చింది. ysrcp;kcr;andhra pradesh;high court;2020;polavaram project;letter;central government;ycp;josh;party2020లో వైసీపీ సూప‌ర్ హిట్టే... ఎన్నెన్ని సంచ‌ల‌నాలో...!2020లో వైసీపీ సూప‌ర్ హిట్టే... ఎన్నెన్ని సంచ‌ల‌నాలో...!ysrcp;kcr;andhra pradesh;high court;2020;polavaram project;letter;central government;ycp;josh;partyFri, 01 Jan 2021 12:12:01 GMTపార్టీ వైసీపీకి 2020 కొన్ని మైలు రాళ్ల‌ను మోసుకొచ్చింది. ఇటు పార్టీలోను, అటు ప్ర‌భుత్వంలోను మంచి జోష్ నింపిన సంవ‌త్స‌రంగా 2020 నిలిచింద‌న‌డంలో సందేహం లేదు. వాస్త‌వానికి 2020 దేశ‌వ్యాప్తంగా ఏ రంగానికి, ఏ రాజ‌కీయాల‌కు కూడా క‌లిసి రాలేద‌నే చెప్పాలి. కానీ, ఏపీలో మాత్రం భిన్న‌మైన వాతావ‌ర‌ణం క‌నిపించింది. ఉత్త‌మ పాల‌న అందిస్తున్న ముఖ్య‌మంత్రుల్లో సీఎం జ‌గ‌న్ నాలుగో స్థానంలో నిలిచారు. ఇక‌, రాష్ట్రంలో పోలీసింగ్ కు కేంద్రం నుంచి భారీ ఎత్తున అవార్డులు ల‌భించాయి. అదేస‌మ యంలో దేశంలో క‌రోనా విజృంభ‌ణ స‌మ‌యంలో అత్యుత్త‌మంగా వ్య‌వ‌హ‌రించిన రాష్ట్రంగా కూడా ఏపీ పేరు తెచ్చుకుంది.

క‌రోనా ప‌రీక్ష‌లు అత్య‌ధికం నిర్వ‌హించ‌డంతోపాటు.. క‌రోనా కేసుల‌ను కూడాఎప్ప‌టిక‌ప్పుడు అందించిన తొలిరాష్ట్రంగా కూడా ఏపీ రికార్డు సృష్టించింది. ఇక‌, కీల‌క ప‌థ‌కాల అమ‌లు తీరు కూడా పుంజుకుంది. అనేక ప‌థ‌కాల‌ను ఈ ఏడాది ప్రారంభించి అమ‌లు చేశారు. చేయూత‌, జ‌గ‌న‌న్న విద్యాదీవెన‌, వ‌స‌తి దీవెన వంటి కీల‌క ప‌థ‌కాల‌కు ఈ ఏడాది వేదిక‌గా నిలిచింది. ఇక‌, రాజ‌కీయంగా చూసుకుంటే.. చిన్న‌పాటి విరుపులు త‌ప్ప‌.. పెద్ద‌గా ఇబ్బంది క‌లిగించిన ప‌రిణామాలు లేవు. అయితే.. హైకోర్టు జోక్యంతో ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు రంగుల విష‌యంలో వెన‌క్కి త‌గ్గాల్సి వ‌చ్చింది.

ఇక‌, రాష్ట్రంలో స్తానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంలో రాజీ లేని విధంగా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌భుత్వం.. అటు త‌న ప‌ట్టు నిలుపుకొంది. కేంద్రంతో సంబంధాల‌ను బ‌లోపేతం చేసుకునే విష‌యంలో 2020 జ‌గ‌న్‌కు క‌లిసి వ‌చ్చింద‌నే చెప్పాలి. మూడు రాజ‌ధానుల విష‌యంలో త‌మ ప్ర‌మేయం ఉండ‌ద‌ని.. కేంద్రం నేరుగా హైకోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. అదేస‌మ‌యంలో కీల‌క‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టుకు 55 వేల కోట్ల అంచ‌నా వ్య‌యం ఇచ్చేందుకు కూడా సిద్ధ‌మైంది. ఇక‌, మ‌రో ముఖ్య‌మైన విష‌యం.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో పొరుగు రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో అయినా.. ఢీ అంటే ఢీ అనేందుకు వెనుకాడేది లేద‌ని జ‌గ‌న్ చెప్ప‌క‌నే చెప్పారు.

రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని అడ్డుకునేందుకు కేసీఆర్ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తున్న వైనాన్ని జ‌గ‌న్ కేంద్రం దృష్టికి తీసుకువెళ్ల‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యారు. ఎత్తిపోత‌ల ఆపాల‌న్న కేసీఆర్‌కు దీటుగా బ‌దులు చెప్పారు. ఇక‌, పార్టీలోనూ నేత‌లు క‌ట్టుత‌ప్ప‌కుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చిన్న‌పాటి ఘ‌ట‌న‌లు మిన‌హా పెద్ద‌గా పార్టీలో దారిత‌ప్పిపోయిన ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ కుండా జ‌గ‌న్ జాగ్ర‌త్త ప‌డ్డారు. ముఖ్యంగా పేద‌ల‌కు ఇళ్ల పంపిణీ.. రాష్ట్ర చ‌రిత్ర‌లోనే 2020 సంవ‌త్స‌రాన్నిసువ‌ర్ణాధ్యాయంగా నిలిపింద‌న‌డంలో సందేహం లేదు. ఇది కూడా వైసీపీ ఖాతాలోకే ప‌డుతుంది. మొత్తంగా చూస్తే.. 2020 వైసీపీకి క‌ల‌సి వ‌చ్చింద‌నే చెప్పాలి.




2020 జ‌న‌సేన‌కు ప‌వ‌న్ యూట‌ర్న్‌లే మిగిలాయా..!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

టిక్‌టాక్ దుర్గారావుకు బంపర్ ఆఫర్.. ఏకంగా స్టార్ హీరో సినిమాలోనే...

ట్రైన్ టికెట్ ఇక సరికొత్తగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>