Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/sports/libra_libra/cricketer-david-warner-new-instagram-video-on-mahesh-babu-trailera9fd97d3-1cb8-4b84-9525-7a9706858d9d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/sports/libra_libra/cricketer-david-warner-new-instagram-video-on-mahesh-babu-trailera9fd97d3-1cb8-4b84-9525-7a9706858d9d-415x250-IndiaHerald.jpgమరికొద్దిగంటల్లో ఈ ఏడాది ముగియనుండటంతో ఆస్ట్రేలియా ఓపెనర్‌, సన్ రైజర్స్ జట్టు సారథి డేవిడ్‌ వార్నర్‌ మరో వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటించిన 'మహర్షి' సినిమా టీజర్‌ను ఎడిట్‌ చేసి.. మహేష్ ఫేస్ ను తన ఫేస్ తో మార్ఫింగ్ చేసేశాడు. అంతే టీజర్ మొత్తం మహేష్ బదులు వార్నర్ కనిపిస్తాడు. ఈ మార్ఫింగ్ వీడియోను..david warner;mahesh;maharshi;vennela;cricket;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;australia;indiaherald group;tollywood;cinema;bahubali;media;maharshi 1;2020;tik tok;blockbuster hit;instagram;letter;magadheera;fidaa'మహర్షి'గా మారిన వార్నర్.. ఇరగదీస్తున్నాడుగా...'మహర్షి'గా మారిన వార్నర్.. ఇరగదీస్తున్నాడుగా...david warner;mahesh;maharshi;vennela;cricket;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;australia;indiaherald group;tollywood;cinema;bahubali;media;maharshi 1;2020;tik tok;blockbuster hit;instagram;letter;magadheera;fidaaFri, 01 Jan 2021 09:20:00 GMTఇంటర్నెట్ డెస్క్: కొత్త సంవత్సరానికి సరికొత్తగా వీడ్కోలు పలికాడు ఆసీస్ క్రికెటర్ వార్నర్. మరికొద్దిగంటల్లో 2020 ముగుస్తుందనగా ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ గురువారం ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన అభిమానులు ప్రస్తుతం నోరెళ్ళబెడుతున్నారు. ఎందుకంటే ఈ వీడియోలో మహేష్ బాబు క్యారెక్టర్ చేసేశాడు వార్నర్.. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటించిన 'మహర్షి' సినిమా టీజర్‌ను ఎడిట్‌ చేసి.. మహేష్ ఫేస్ ను తన ఫేస్ తో మార్ఫింగ్ చేశాడు. అంతే టీజర్ మొత్తం మహేష్ బదులు వార్నర్ కనిపిస్తాడు. ఈ మార్ఫింగ్ వీడియోను చూసిన క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు మహేష్ అభిమానులు కూడా తెగ సంతోష పడిపోతున్నారు. స్కూటర్‌పై మహేశ్‌, వెన్నెల కిషోర్‌తో వెళ్లే సీన్‌తో పాటు డైలాగులు, ఫైటింగ్‌లు.. ఇలా టీజర్ మొత్తం వార్నర్ దంచేశాడు.


2020 ఏడాది మొత్తం వార్నర్ అభిమానులను ఎంతగా అలరించాడో అందరికీ తెలిసిందే. కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్ ను వార్నర్ అద్బుతంగా ఉపయోగించుకున్నాడు. టిక్‌టాక్‌, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్.. ఇలా అన్నీ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో వార్నర్ అభిమానులకు చాలా దగ్గరగా ఉన్నాడు. అంతేకాదు గత ఏడాదంతా బాహుబలి, మగధీర, సరిలేరు నీకెవ్వరూ వంటి బ్లాక్ బస్టర్ టాలివుడ్ చిత్రాలలోని డైలాగ్ లు, పెర్ఫార్మన్స్ లతో అదరగొట్టాడు. ఇక ఇప్పుడు ఆఖర్లో మహర్షిగా మారి టాలీవుడ్ ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 


 

ఇదిలా ఉంటే వార్నర్ షేర్ చేస్తున్న వీడియోలకు ఫ్యాన్స్ తెగ ఫిదా అవుతున్నారు. అతడి వీడియోలకు టాలీవుడ్ అభిమానులు విపరీతంగా లైకులు కొడుతున్నారు. ఈ వీడియో చూస్తే వార్నర్ కు తెలుగు సినిమాలంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. మహేశ్ అభిమానులైతే వార్నర్ ను ఓ రేంజ్ లో పొగడ్తలతో ముంచేస్తున్నారు. గతంతో కూడా వార్నర్ సరిలేరూ నీకెవ్వరూ సినిమాలోని మైండ్ బ్లాక్ సాంగ్ కు స్టేప్పులేసి తెలుగు ఫాన్స్ ను అలరించాడు. అయితే గతేడాది అంతగా అలరించిన వార్నర్ మరి ఈ ఏడాది ఇంకెంతలా అలరిస్తాడో చూడాలి.

">




2020లో వైసీపీ సూప‌ర్ హిట్టే... ఎన్నెన్ని సంచ‌ల‌నాలో...!

కొత్త ఏడాదిలో వకీల్ సాబ్ సరికొత్త ట్రీట్.. అదిరిపోయింది..

మెగా డాటర్‌కూ కరోనా టెస్ట్.. ఆమె భర్తకు కూడా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించని న్యూఇయర్ గిఫ్ట్.. అదిరిపోయింది...

మూడో టెస్టు ముందు టీమిండియాకు మరో దెబ్బ.. కీలక పేసర్ అవుట్

టిక్‌టాక్ దుర్గారావుకు బంపర్ ఆఫర్.. ఏకంగా స్టార్ హీరో సినిమాలోనే...

ట్రైన్ టికెట్ ఇక సరికొత్తగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>