PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/babuf07e075a-7dfc-4be3-81d2-dd3e562f8cc0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/babuf07e075a-7dfc-4be3-81d2-dd3e562f8cc0-415x250-IndiaHerald.jpgచంద్రబాబు నాయుడు వంటి రాజకీయ దిగ్గజాన్ని 2020 ఎంతో ఇబ్బంది పెట్టేసింది. కరోనా వైరస్ యావత్తు ప్రపంచాన్ని వణికించిన నేపధ్యంలో తొమ్మిది నెలల పాటు బాబు కేవలం హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. ఆయన గుంటూరు విజయవాడ టూర్లు కూడా చాలా పరిమితంగా చేశారు. ఇక కొత్త ఏడాది రావడంతోనే బాబులో సరి కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. babu;cbn;ramu;hyderabad;telugu desam party;vijayawada;telugu;vishakapatnam;pond;2020;february;local language;ycp;party;coronavirusఏడాది తరువాత అక్కడికి బాబు...పొలిటికల్ మంటలేనా..?ఏడాది తరువాత అక్కడికి బాబు...పొలిటికల్ మంటలేనా..?babu;cbn;ramu;hyderabad;telugu desam party;vijayawada;telugu;vishakapatnam;pond;2020;february;local language;ycp;party;coronavirusFri, 01 Jan 2021 19:00:00 GMT2020 ఎంతో ఇబ్బంది పెట్టేసింది. కరోనా వైరస్ యావత్తు ప్రపంచాన్ని వణికించిన నేపధ్యంలో తొమ్మిది నెలల పాటు బాబు కేవలం హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. ఆయన గుంటూరు విజయవాడ టూర్లు కూడా చాలా పరిమితంగా చేశారు. ఇక కొత్త ఏడాది రావడంతోనే బాబులో సరి కొత్త  ఉత్సాహం కనిపిస్తోంది.

మునుపటి మాదిరిగానే చంద్రబాబు టూర్లకు సిద్ధమవుతున్నారు. దాంతో దాదాపు ఏడాది సుదీర్ఘ కాలం తరువాత చంద్రబాబు ఉత్తరాంధ్రా టూర్ పెట్టుకున్నారు. ఆయన రేపు విశాఖకు వస్తున్నారు. విజయనగరం జిల్లాలోని రామతీర్ధాలుకు చంద్రబాబు వెళ్తారు. ఈ మధ్యనే అక్కడ రాముల వారి విగ్రహం శిరస్సుని కొందరు దుండగులు ఖండించి సమీపంలోని చెరువులో పడవేశారు.

ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ ఘటన మీద అన్ని పార్టీలు ఆందోళన చేపట్టాయి. తెలుగుదేశం పార్టీ అయితే సీరియస్ గానే తీసుకుంది. ఉత్తరాంధ్రా జిల్లాలకు రెండవ భద్రాద్రిగా పేరు తెచ్చుకున్న రామతీర్ధాలులో ఇటువంటి దారుణం జరగడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో చంద్రబాబు ప్రత్యేకించి టూర్ పెట్టుకున్నారని అంటున్నారు.

ఆయన రామతీర్ధాలుకు రేపు చేరుకుని అక్కడి పరిస్థితులను స్వయంగా చూస్తారని, స్థానికులను అడిగి అన్ని విషయాలు తెలుసుకుంటారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు సరిగ్గా గత ఏడాది ఫిబ్రవరి 25న విశాఖ వచ్చారు. ఆయన అప్పట్లో మూడు రాజధానులకు వ్యతిరేకంగా టూర్ వేశారు. అయితే గో బ్యాక్ బాబూ అంటూ విశాఖ ఎయిర్ పోర్టులోనే ఆయన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దాంతో బాబు అటునుంచి అటే హైదరాబాద్ వెళ్లిపోవాల్సివచ్చింది. ఇక ఆ తరువాత కోరోనా వైరస్ నపధ్యంలో బాబు ఎక్కడికీ పర్యటనలు పెట్టుకోలేదు. ఇపుడు ఆయన మళ్లీ రావడం అంటే సరిగ్గా ఏడాదికి దగ్గరలో వస్తున్నట్లే లెక్క మరి. బాబు టూర్ లో ఏ విధంగా రాజకీయాలు సాగుతాయో చూడాలి .అంటున్నారు.






ఎన్నారైలకు షాక్ ఇచ్చిన ట్రంప్...ట్రంప్ కి షాక్ ఇచ్చిన బిడెన్..!!

రంగ్‌దే రిలీజ్ డేట్ ఫిక్స్.. కీర్తి అందాన్ని చూడడానికి రెడీగా ఉండండి...

మూడో టెస్టులో రోహిత్, నట్టూ... ఇక ఆసీస్‌కు చుక్కలే...

సంక్రాంతికి ఆ రెండూ క్రేజీ మూవీస్ ?

హరీష్ రావుని స్పెషల్ గా ఫోకస్ చేసిన బిజెపి... సోషల్ మీడియాలో ఏం చేస్తారు...?

జగన్ రెడ్డీ.. అప్పన్న సన్నిధికి రా.. తేల్చుకుందాం: నారా లోకేష్

బుల్లిపిట్ట: చంద్రుడిపై స్థలం కొన్న తరువాత.. ఏం జరుగుతుందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>