PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjp-leader-vishnu-targets-jagan-d031073a-125e-45e4-b872-2c65debbd362-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjp-leader-vishnu-targets-jagan-d031073a-125e-45e4-b872-2c65debbd362-415x250-IndiaHerald.jpgఏపీలో జగన్ అంటే చాలామంది నేతలకు పగ ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన సీఎం అయిన దగ్గర నుంచి వరుస పెట్టి విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుని ముందుకెళుతున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ నేతలైతే డైలీ జగన్‌పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ బీజేపీ నేతలు ఎక్కువగా జగన్‌ని టార్గెట్ చేసి విమర్శలు చేసిన సందర్భాలు తక్కువ. bjp;kumaar;vishnu;bharatiya janata party;jagan;andhra pradesh;2019;vishakapatnam;media;king;mla;tdp;ycp;dookudu;partyఆ బీజేపీ నేత జగన్ మీద పగ పెంచుకోవడానికి కారణం అదేనా?ఆ బీజేపీ నేత జగన్ మీద పగ పెంచుకోవడానికి కారణం అదేనా?bjp;kumaar;vishnu;bharatiya janata party;jagan;andhra pradesh;2019;vishakapatnam;media;king;mla;tdp;ycp;dookudu;partyFri, 01 Jan 2021 03:00:00 GMTజగన్ అంటే చాలామంది నేతలకు పగ ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన సీఎం అయిన దగ్గర నుంచి వరుస పెట్టి విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుని ముందుకెళుతున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ నేతలైతే డైలీ జగన్‌పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ బీజేపీ నేతలు ఎక్కువగా జగన్‌ని టార్గెట్ చేసి విమర్శలు చేసిన సందర్భాలు తక్కువ.

సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయ్యాక, కాస్త బీజేపీ నేతలు జగన్‌పై దూకుడుగా వెళుతున్నట్లు కనిపించడం లేదు. కానీ ఒక బీజేపీ నేత మాత్రం మొదటి నుంచి జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. జగన్ అంటే ఒంటికాలి మీద వెళ్లిపోతున్నారు. అసలు జగన్ అంటే బాగా పగతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అలా జగన్ అంటే పగ పెంచుకున్న బీజేపీ నేత ఎవరో కాదు...మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.

రాజుగారు 2014 ఎన్నికల్లో టీడీపీలో పొత్తులో భాగంగా బీజేపీ నుంచి పోటీ చేసి, విశాఖ నార్త్ నుంచి పోటీచేసి గెలిచారు. ఇక 2019 ఎన్నికల ముందు రాజుగారు కొన్ని స్టెప్‌లు వేశారు. రాజుగారు టీడీపీ లేదా వైసీపీలోకి వెళ్తారని వార్తలు వచ్చాయి. ఒకానొక సందర్భంలో జగన్‌ని కూడా కలిశారు. కానీ ఆయన బీజేపీ వీడకుండా, ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీతో పొత్తు కూడా లేకపోవడంతో రాజుగారు ఘోరంగా ఓడిపోయారు.

ఓడిపోయిన దగ్గర నుంచి రాజుగారు, జగన్‌పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. జగన్ జైలుకు వెళ్తారని, ఏపీకి కొత్త సీఎం వస్తారని, వైసీపీ ప్రభుత్వం హిందూ దేవాలయాలపై దాడులు చేస్తుందని, జగన్ హిందూ ద్రోహి అని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే ఈ రకంగా విష్ణు విమర్శించడానికి కారణాలు మాత్రం, జగన్ పార్టీలోకి రానివ్వకుండా చేయడం వల్లే అని తెలుస్తోంది. వైసీపీలోకి తీసుకోకపోవడం వల్లే విష్ణు ఈ రకమైన విమర్శలు చేస్తున్నారని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఇప్పుడు విష్ణు, చంద్రబాబు రూట్‌లో ఉన్నారని అందుకే ఇలా జగన్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అంటున్నారు.




ఈ సారి మహేష్ 'మహర్షి'లో ఆ క్రికెటర్.. ఇరగదీస్తున్నాడుగా...

ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్రం కన్నెర్ర.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్!

రజనీ డెడ్లీ డెసిషన్ తో వారికి ఇనుప తెర ?

ధరణి పోర్టల్... స్లాట్ రద్దు చేసుకుంటే డబ్బులు వాపస్

'బండి'కి ఢిల్లీ పిలుపు ? బీజేపీ పెద్ద ల నిర్ణయం ఏంటో ?

బడ్జెట్ విషయంలో వెనక్కు తగ్గని డైరెక్టర్.. టెన్షన్‌లో బాలయ్య నిర్మాత!

2020లో తెలంగాణలో బీజేపీ హవా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>