PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajani9b547d78-a9f2-4ce5-a868-9ea8251431b7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajani9b547d78-a9f2-4ce5-a868-9ea8251431b7-415x250-IndiaHerald.jpgరజనీకాంత్ నో పాలిటిక్స్ అనేశారు. కోట్లాది మంది ఫ్యాన్స్ నికి ఆయన నిరాశను కలిగించారు. ఏ హీరోను అయితే తలైవా అంటూ నెత్తికెక్కించుకుని పూజలు చేశారో ఆ అభిమానులే ఇపుడు ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు వస్తాయని ప్రకటించిన మూడు వారాలు తిరగకముందే రజనీకాంత్ సడెన్ గా డ్రాప్ అవడం పైన పెద్ద ఎత్తున చర్చ కూడా ఇప్పటికీ సాగడం విశేషం. rajani;health;chiranjeevi;rajinikanth;editor mohan;mithra;hyderabad;singapore;american samoa;king;job;aqua;king 1;butter;nijamరజనీ నో పాలిటిక్స్ వెనక ఆ ఇద్దరు తెలుగు స్టార్స్ ?రజనీ నో పాలిటిక్స్ వెనక ఆ ఇద్దరు తెలుగు స్టార్స్ ?rajani;health;chiranjeevi;rajinikanth;editor mohan;mithra;hyderabad;singapore;american samoa;king;job;aqua;king 1;butter;nijamThu, 31 Dec 2020 10:00:00 GMTరజనీకాంత్ నో పాలిటిక్స్ అనేశారు. కోట్లాది మంది ఫ్యాన్స్ నికి ఆయన నిరాశను కలిగించారు. ఏ హీరోను అయితే తలైవా అంటూ నెత్తికెక్కించుకుని పూజలు చేశారో ఆ అభిమానులే ఇపుడు ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు  వస్తాయని ప్రకటించిన మూడు వారాలు తిరగకముందే రజనీకాంత్ సడెన్ గా  డ్రాప్ అవడం పైన పెద్ద ఎత్తున చర్చ కూడా ఇప్పటికీ సాగడం విశేషం.

అయితే రజనీకాంత్ రాజకీయాల నుంచి వెనక్కు మళ్ళడానికి ఆరోగ్య సమస్యలే కాదు, ఇతర అనేక కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు. రజనీకాంత్ కి నిజంగానే ఆరోగ్య పరమైన సమస్యలు తీవ్రంగానే ఉన్నాయి. ఆయన సింగపూర్ అమెరికా వంటి చోట్ల నెలల తరబడి గతంలో చికిత్స చేయించుకున్నారు. ఇక ఆయనకు ఇప్పటికీ చాలా హెల్త్  సమస్యలు వెన్నంటే ఉన్నాయి. మరో వైపు చూస్తే రాజకీయాలు టఫ్ జాబ్. మానసిక, శారీరకపరమైన టెన్షన్ వత్తిడి అక్కడ ఉంటాయి. దాన్ని డెబ్బయ్యేళ్ళ వయసులో రజనీకాంత్ అసలు తట్టుకోలేరు అని అన్నది సన్నిహితుల మాట.

ఇదిలా ఉంటే హైదరాబాద్ లో రజనీకాంత్ అన్నాతే షూటింగ్ సందర్భంగా ఆయన చిరకాల మిత్రులు అయిన ఇద్దరు తెలుగు స్టార్స్ ఇచ్చిన సలహా సూచనలనతోనే రజనీ రాజకీయాల నుంచి విరమించుకున్నారని అంటున్నారు. రజనీ షూటింగ్ జరిగిన రామోజీ ఫిల్మ్ సిటీకి ఈ మధ్యన మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వెళ్లి రజనీతో ముచ్చట్లు పెట్టారని అంటున్నారు. ఈ సందర్భంగా రజనీ వారిని తన రాజ‌కీయ ప్రవేశం గురించి చెప్పి సలహా అడిగినపుడు వారిద్దరూ అసలు ఆ జోలికే పోవద్దు అని ఖరాఖండీగా చెప్పారని ప్రచారం సాగుతోంది.

అదే సమయంలో చిరంజీవి తన స్వీయ అనుభవాలను కూడా రజనీకి చెప్పి మరీ రాజకీయాలు వద్దే వద్దు అని గట్టిగానే చెప్పారట. ఆ తరువాత రజనీ ఆసుపత్రి పాలు కావడం, ఇంటికి వచ్చి నో పాలిటిక్స్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగాయి. మొత్తానికి రజనీ నో పాలిటిక్స్ వెనక ఇద్దరు తెలుగు స్టార్స్ ఉన్నారని మాత్రం ప్రచారం అయితే గట్టిగానే ఉంది. ఇందులో నిజమెంతో తెలియాలి.




మహేష్ బాబు కూతురుకు కరోనా టెస్ట్..!?

కే‌సి‌ఆర్ కీలక నిర్ణయం..మరో ముఖ్య పథకం అమలు !!

మరో కేంద్ర చట్టానికి కేసీఆర్ జై!

భూకంపాన్ని ఎప్పుడైనా లైవ్‌లో చూశారా..? అయితే ఇప్పుడు చూడండి..

కొడాలి నానీని చంద్రబాబే టార్గెట్ చేయించారా...?

తెలంగాణ‌లో నేరాలు త‌గ్గాయి... ఇక మా ల‌క్ష్యం అదే.. డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి

2020 టాలీవుడ్ బెస్ట్ మూవీస్.. టాప్ ప్లేస్ ఎవరిదంటే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>