MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanyace1b86a6-ce76-4745-a7c5-9f824ca4347a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanyace1b86a6-ce76-4745-a7c5-9f824ca4347a-415x250-IndiaHerald.jpgసినిమాల్లో హీరోయిన్స్ ను ఎంపిక చేసేది డైరెక్టర్లే అయినా ఫైనల్ చేసేది మాత్రం హీరోలే. ఇది అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్స్ ని పరిచయం చేయడంలో విక్టరీ వెంకటేష్ మొదటి స్థానంలో ఉంటారు. నాగ చైతన్య తన భార్య సమంతతో పాటు టాలీవుడ్ కు పరిచయం చేసిన హీరోయిన్లు వీళ్లే...!naga chaitanya;venkatesh;naga chaitanya;nagarjuna akkineni;nidhhi agerwal;pooja hegde;ram gopal varma;amala paul anaka;divyansha kaushik;editor mohan;kaushik;madonna sebastian;manjima mohan;maya;naga;nageshwara rao akkineni;nidhi;samantha;surya sivakumar;tollywood;cinema;naga aswin;tamil;majili;blockbuster hit;wife;heroine;father;premam;chaitanya 1;josh;savyasachiనాగ చైతన్య తన భార్య సమంతతో పాటు టాలీవుడ్ కు పరిచయం చేసిన హీరోయిన్లు వీళ్లే...!నాగ చైతన్య తన భార్య సమంతతో పాటు టాలీవుడ్ కు పరిచయం చేసిన హీరోయిన్లు వీళ్లే...!naga chaitanya;venkatesh;naga chaitanya;nagarjuna akkineni;nidhhi agerwal;pooja hegde;ram gopal varma;amala paul anaka;divyansha kaushik;editor mohan;kaushik;madonna sebastian;manjima mohan;maya;naga;nageshwara rao akkineni;nidhi;samantha;surya sivakumar;tollywood;cinema;naga aswin;tamil;majili;blockbuster hit;wife;heroine;father;premam;chaitanya 1;josh;savyasachiThu, 31 Dec 2020 13:00:00 GMTహీరోయిన్స్ ను ఎంపిక చేసేది డైరెక్టర్లే అయినా ఫైనల్ చేసేది మాత్రం హీరోలే. ఇది అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్స్ ని పరిచయం చేయడంలో విక్టరీ వెంకటేష్ మొదటి స్థానంలో ఉంటారు. ఆ తర్వాత అక్కినేని నాగార్జున. ఈ ఇద్దరూ అప్పట్లో ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ ని పరిచయం చేశారు.

తండ్రి నాగార్జున, మేనమామ వెంకటేష్ లానే నాగచైతన్య తెలుగు సినిమాకి సమంత, పూజా హెగ్డే వంటి హీరోయిన్స్ ని పరిచయం చేశారు. నాగచైతన్య మొదటి సినిమా జోష్. ఈ సినిమాలో ఒకప్పటి హీరోయిన్ రాధ కూతురు కార్తీక హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా తర్వాత చైతూ చేసిన సినిమా "ఏ మాయ చేసావే". ఈ సినిమాతో సమంతను హీరోయిన్ గా పరిచయం చేయడమే కాకుండా, భార్యగా కూడా పరిచయం చేశారు. వీళ్ళిద్దరూ కలిసి మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ సినిమాల్లో నటించారు. పెళ్ళికి ముందు అంటే వీళ్ళ ప్రేమకి పునాది పడినప్పుడు కలిసి నటించిన మొదటి సినిమా "ఏ మాయా చేసావే". పెళ్లయ్యాక వీళ్ళిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా మజిలీ. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇక వర్మ నిర్మాణ సారధ్యంలో వచ్చిన బెజవాడ సినిమాతో అమలాపాల్ ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయగా, ఒక లైలా కోసం సినిమాతో పూజా హెగ్డేను పరిచయం చేశారు. అమలాపాల్ ప్రస్తుతం తమిళ సినిమాల్లో బిజీగా ఉండగా, పూజా హెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ప్రేమమ్ మూవీతో మడోన్నా సెబాస్టియన్ ను, సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో మంజిమా మోహన్ ను, సవ్యసాచి సినిమాతో నిధి అగర్వాల్ ను, మజిలీ సినిమాతో దివ్యాంశ కౌశిక్ ను ఇలా కొత్త అమ్మాయిలను టాలీవుడ్ కు పరిచయం చేశారు చైతూ.

ఇలా టాలీవుడ్ కి చాలా మంది హీరోయిన్స్ పరిచయం చేసిన ఘనత చైతూది. అయితే వీరిలో సమంతతో తప్ప ఇంకే హీరోయిన్ తోనూ రెండోసారి జతకట్టలేదు. నిధి అగర్వాల్ తో కలిసి రెండోసారి జతకడుతున్నారు. ఏది ఏమైనా గాని తండ్రి, మేనమామ బాటలోనే ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్స్ ను పరిచయం చేస్తూ రికార్డ్ సెట్ చేస్తున్నారు.

 


పటిష్టంగా మారిన ఆస్ట్రేలియా జట్టు.. ఎందుకో తెలుసా..?

సీఎం కేసీఆర్ లోని మార్పుకు ఆ ఇద్దరే కారణమా ?

న్యాయం జరిగే వరకు ప్రొద్దుటూరులో దీక్ష చేస్తా: నారా లోకేశ్

కరోనా వైరస్ ఆడదా? ఈ లెక్కలు చూస్తే అదే అనిపిస్తోంది!

వ్యాక్సిన్ కి మేము రెడీ... కేంద్రానికి ఏపీ నివేదిక

కొత్త సంవత్సరం రోజున కేంద్రం గుడ్ న్యూస్ చెప్తుందా...?

త్రివిక్రమ్‌కు నో చెప్పిన జూనియర్ ఎన్టీఆర్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>