PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus9955ab6d-f9aa-464a-8d6b-f7421e703607-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus9955ab6d-f9aa-464a-8d6b-f7421e703607-415x250-IndiaHerald.jpgకరోనా రాక ముందు వరకు ప్రపంచ మానవాళిని అత్యంత భయానికి గురిచేసింది కేవలం రెండో ప్రపంచ యుద్దం మాత్రమే. మళ్లీ దాదాపు 80 తర్వాత ఇప్పుడు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా మహమ్మారి సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడి 17 లక్షల 80 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.coronavirus;koti;hyderabad;india;central government;coronavirusకరోనా వైరస్ ఆడదా? ఈ లెక్కలు చూస్తే అదే అనిపిస్తోంది!కరోనా వైరస్ ఆడదా? ఈ లెక్కలు చూస్తే అదే అనిపిస్తోంది!coronavirus;koti;hyderabad;india;central government;coronavirusThu, 31 Dec 2020 12:14:14 GMTకరోనా వైరస్ బారినపడి 17 లక్షల 80 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 8 కోట్ల 17 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. మరోపక్క ఇప్పటి వరకు 46 లక్షల 20 వేల మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇదిలా ఉంటే.. వైరస్ గురించి కాకుండా.. ఇప్పుడు వైరస్ జెండర్ గురించి చర్చ మొదలైంది. కరోనా వైరస్ మగ లేక ఆడనా? అనే డౌట్ మొదలైంది.

ఇక కరోనా బారిన పడి ఎక్కువగా మరణించింది మగవారేనన్న విషయం మీకు తెలుసా? అంతేకాదు కరోనా బారిన పడిన వారిలో ఆడవారి శాతం కంటే మగవారి శాతమే ఎక్కువ ఉందట. మన దేశం విషయానికే వద్దాం.. భారత దేశంలో ఇప్పటివరకు మొత్తం కోటి 2 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. కరోనా బారిన పడి లక్షా 47 వేల మంది మరణించారు. మొత్తంగా నమోదైన కేసుల సంఖ్య చూసుకుంటే.. భారత్‌లో మహిళలకంటే పురుషులకే ఎక్కువగా ఈ వైరస్ సోకినట్టు రిపోర్టులు చెబుతున్నాయి. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ లెక్కలు కూడా ఇలానే ఉన్నాయి.

కరోనా మహమ్మారి కారణంగా మన దేశంలో లక్షా 47 వేల మంది చనిపోగా.. అందులో 70 శాతం మంది మృతులు పురుషులేనని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. మరోపక్క పురుషుల్లో కరోనాతో మృతి చెందిన వారిలో 60 ఏళ్ల లోపువారు 45 శాతం మందిగా ఉన్నట్టు లెక్కలు వెల్లడించాయి. కరోనా కేసుల విషయం చూసుకున్నా కరోనా కేసుల్లో 63 శాతం కేసులు పురుషులవే ఉన్నాయి. వారిలో 52 శాతం మంది పురుషులు 18 నుంచి 44 ఏళ్ల వయసు లోపువారేనని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. దీనిబట్టి కరోనా వైరస్ జెండర్ కచ్చితంగా ఫిమేల్ అయి ఉంటుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


కొత్త సంవత్సరం రోజున కేంద్రం గుడ్ న్యూస్ చెప్తుందా...?

త్రివిక్రమ్‌కు నో చెప్పిన జూనియర్ ఎన్టీఆర్?

ఏపీలో ఎన్ఐఏ దర్యాప్తు చెయ్యాల్సిందే..!

ఒక్క యూట్యూబ్ చానల్ ద్వారా ఈ మహిళ ఎంత సంపాదిస్తుందో తెలుసా?

కే‌సి‌ఆర్ కీలక నిర్ణయం..మరో ముఖ్య పథకం అమలు !!

మరో కేంద్ర చట్టానికి కేసీఆర్ జై!

భూకంపాన్ని ఎప్పుడైనా లైవ్‌లో చూశారా..? అయితే ఇప్పుడు చూడండి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>