PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-politics625dc2f5-2172-427c-833c-ba7f54f9fd61-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-politics625dc2f5-2172-427c-833c-ba7f54f9fd61-415x250-IndiaHerald.jpgజూబిలీహిల్స్ హోసింగ్ సొసైటీ ఓట్ల నమోదు ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ మరో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన హై కోర్ట్ ఈ పిటిషన్ పై చివరి తీర్పు వచ్చే వరకు కార్యవర్గం ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీచేయరాదని, ఎన్నికలు నిర్వహించరాదని రాష్ట్ర కోఆపరేటివ్‌ ఎన్నికల అధికారిని ఆదేశించింది.telangana politics;ganga;kumaar;ram pothineni;revanth;shyam;ganges;uttam kumar reddy nalamada;telangana;revanth reddy;congress;రాజీనామా;district;court;tpcc;aqua;ranga reddy;reddy;ranarangamఎన్నికల నోటిఫికేషన్‌ జారీచేయొద్దు: హైకోర్టు.. !ఎన్నికల నోటిఫికేషన్‌ జారీచేయొద్దు: హైకోర్టు.. !telangana politics;ganga;kumaar;ram pothineni;revanth;shyam;ganges;uttam kumar reddy nalamada;telangana;revanth reddy;congress;రాజీనామా;district;court;tpcc;aqua;ranga reddy;reddy;ranarangamThu, 31 Dec 2020 14:00:00 GMTతెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు పూట పూటకు జోరందుకుంటున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికతో మొదలైన ఈ సమరం...మొన్ననే ముగిసిన గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో ముగిసింది. అయినా రాజకీయ నాయకులు వాడి వేడి మాటలతో రాజకీయాన్ని రణరంగంగా మారుస్తున్నారు. ఇది ఇలా ఉంటే గ్రేటర్ ఎన్నికలలో ఓటమి చెందడంతో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనితో తరువాత టీపీసీసీ అధ్యక్షుడు ఎవరనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానంలో కీలక చర్చలు జరుగుతున్నాయి. ఈ అధ్యక్ష పదవికి ముందు వరుసలో ఉన్న రేవంత్ రెడ్డి ఇటీవల హై కోర్టులో  డీ ఎల్ ఎఫ్ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు పిటిషన్ వేశారు.

 దీనిపై హై కోర్ట్ నిన్న ప్రతివాదులను కౌంటర్ వేయాలంటూ ఆదేశించింది. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో ఏపీఐఐసీకి చెందిన ఐటీ పార్కులో డీ ఎల్ ఎఫ్ సంస్థ 31.35 ఎక రాలను రూ.580 కోట్లకు కొనుగోలు చేసినట్లు కోర్టులో కేసు వేశారు. ఇందులో ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శులతోపాటు టీఎస్‌ఐఐసీ, ఎస్‌బీఐ, డీఎల్‌ఎఫ్, మై హోం కన్‌స్ట్రక్షన్స్, ఆర్‌ఎంజడ్‌ కార్ప్‌ సంస్థలను ఈ పిటిషన్లో చేర్చారు. దీనికి స్పందించిన ఆక్వా స్పేస్ డెవలపర్స్ తరపున జె శ్యామ్ రామ్ తన కౌంటర్లో నిబంధనల ప్రకారమే మేము ఈ భూమి కొనుగోలు ప్రక్రియను చేశామని, ఎటువంటి అవినీతి జరగలేదని పేర్కొన్నారు.

అయితే ఇందులో మరో విషయం ఏమిటంటే ఏపీఐఐసీ 2013 లోనే డీఎల్ఎఫ్ కు ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయించింది. దాని తరువాత దీనిని ఆక్వా స్పేస్ పేరుతో బదలాయించడంతో, ఇది చట్ట విరుద్ధమని...భవన నిర్మాణాల కోసం జిహెచ్ఎంసి ఇచ్చిన అనుమతిని తక్షణమే రద్దు చేయాలని రేవంత్ రెడ్డి కోరడమైనది. ఇది ఇలా ఉండగా, జూబిలీహిల్స్ హోసింగ్ సొసైటీ ఓట్ల నమోదు ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ మరో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన హై కోర్ట్ ఈ పిటిషన్ పై చివరి తీర్పు వచ్చే వరకు  కార్యవర్గం ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీచేయరాదని, ఎన్నికలు నిర్వహించరాదని రాష్ట్ర కోఆపరేటివ్‌ ఎన్నికల అధికారిని ఆదేశించింది.


2020వ సంవత్సరం సూర్యాకు బాగా కలిసొచ్చిందా?

సీఎం కేసీఆర్ లోని మార్పుకు ఆ ఇద్దరే కారణమా ?

న్యాయం జరిగే వరకు ప్రొద్దుటూరులో దీక్ష చేస్తా: నారా లోకేశ్

కరోనా వైరస్ ఆడదా? ఈ లెక్కలు చూస్తే అదే అనిపిస్తోంది!

వ్యాక్సిన్ కి మేము రెడీ... కేంద్రానికి ఏపీ నివేదిక

కొత్త సంవత్సరం రోజున కేంద్రం గుడ్ న్యూస్ చెప్తుందా...?

త్రివిక్రమ్‌కు నో చెప్పిన జూనియర్ ఎన్టీఆర్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>