PoliticsSiva Prasadeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nara-lokesh3e93210a-9f93-4a20-b7f6-e7e811c0f540-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nara-lokesh3e93210a-9f93-4a20-b7f6-e7e811c0f540-415x250-IndiaHerald.jpgప్రొద్దుటూరులో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత సుబ్బయ్య అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి. సుబ్బయ్య అంత్యక్రియల్లో టీడీపీ నేత నారా లోకేష్ పాల్గొన్నారు. రాత్రి ఆయన అక్కడే బస చేశారు. అంత్యక్రియల నేపథ్యంలో ప్రొద్దుటూరులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఇక సుబ్బయ్య హత్యను నిరసిస్తూ లోకేష్ దీక్ష చేపట్టారు.nara lokesh;cbn;lokesh;cricket;nara lokesh;district;kadapa;police;gold;december;mla;wife;proddatur;arrest;murder.;tdp;local language;ycp;lokesh kanagaraj;reddy;partyన్యాయం జరిగే వరకు ప్రొద్దుటూరులో దీక్ష చేస్తా: నారా లోకేశ్న్యాయం జరిగే వరకు ప్రొద్దుటూరులో దీక్ష చేస్తా: నారా లోకేశ్nara lokesh;cbn;lokesh;cricket;nara lokesh;district;kadapa;police;gold;december;mla;wife;proddatur;arrest;murder.;tdp;local language;ycp;lokesh kanagaraj;reddy;partyThu, 31 Dec 2020 12:28:07 GMTటీడీపీ నేత సుబ్బయ్య అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి. సుబ్బయ్య అంత్యక్రియల్లో టీడీపీ నేత నారా లోకేష్ పాల్గొన్నారు. రాత్రి ఆయన అక్కడే బస చేశారు. అంత్యక్రియల నేపథ్యంలో ప్రొద్దుటూరులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఇక సుబ్బయ్య హత్యను నిరసిస్తూ లోకేష్ దీక్ష చేపట్టారు. సుబ్బయ్య భార్య అపరాజితకు న్యాయం జరిగే వరకు తన దీక్ష కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఐతే ఈ హత్య వెనక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన బామమరిది బంగారిరెడ్డిల హస్తముందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన భర్తని చంపిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది బంగారురెడ్డిలను అరెస్ట్ చేయాలని ఆందోళన చేస్తున్న అపరాజితకి న్యాయం జరిగే వరకూ ప్రొద్దుటూరులోనే తన దీక్ష కొనసాగుతుందని లోకేశ్ చెప్పారు.
                                                          డిసెంబర్ 29న కడప జిల్లా జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన విషయం తెలిసిందే. పేదలకు ఇళ్ల స్థలాల కింద ఎంపిక చేసిన ప్లాట్లలోనే సుబ్బయ్యను కత్తులతో నరికి చంపారు. ప్రస్తుతం నందం సుబ్బయ్య టీడీపీ జిల్లా అధికార ప్రతినిథిగా ఉన్నారు. రాజకీయ కక్షలతోనే ప్రత్యర్థులు సుబ్బయ్యను హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హంతకులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఐతే అధికార పార్టీ నేతలే సుబ్బయ్యను హత్య చేయించారని టీడీపీ నేతలు వాపోతున్నారు.
                                  సుబ్బయ్య హత్యను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. వైసీపీ అక్రమాలను ప్రశ్నించినందుకే సుబ్బయ్యను హత్య చేశారని ఆరోపించారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అవినీతిని బట్టబయలు చేశాడన్న అక్కసుతోనే నందం సుబ్బయ్యను కిరాతకంగా హత్య చేశారన్నారు. ఇసుక అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగ్ లో ఎమ్మెల్యే పాత్రను, ఆయన బావమరిది పాత్రను బహిర్గతం చేసినందునే ఈ కిరాతకానికి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వద్దకు వెళ్లిన టిడిపి నాయకుడి హత్య సిఎం జగన్మోహన్ రెడ్డికి సిగ్గుచేటు అన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఏపీలో రాజకీయ దుమారం రేగుతోంది.


కరోనా వైరస్ ఆడదా? ఈ లెక్కలు చూస్తే అదే అనిపిస్తోంది!

వ్యాక్సిన్ కి మేము రెడీ... కేంద్రానికి ఏపీ నివేదిక

కొత్త సంవత్సరం రోజున కేంద్రం గుడ్ న్యూస్ చెప్తుందా...?

త్రివిక్రమ్‌కు నో చెప్పిన జూనియర్ ఎన్టీఆర్?

ఏపీలో ఎన్ఐఏ దర్యాప్తు చెయ్యాల్సిందే..!

ఒక్క యూట్యూబ్ చానల్ ద్వారా ఈ మహిళ ఎంత సంపాదిస్తుందో తెలుసా?

కే‌సి‌ఆర్ కీలక నిర్ణయం..మరో ముఖ్య పథకం అమలు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva Prasad]]>