PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/its-something-that-gives-a-full-kick-but1e79bf00-5645-4dab-ad02-93482f1d0c30-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/its-something-that-gives-a-full-kick-but1e79bf00-5645-4dab-ad02-93482f1d0c30-415x250-IndiaHerald.jpgన్యూ ఇయర్‌ వేళ.. మందు బాబులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం‌. మద్యం దుకాణాలను తెరిచి ఉంచే సమయాన్ని పెంచింది. కరోనా నిబంధనల నుంచి కాస్త సడలింపునిచ్చింది. దీంతో నూతన సంవత్సర సంబరాల్లో లిక్కర్‌ ఏరులై పారనుంది. మందుబాబులకు ఫుల్‌ కిక్కునిచ్చే విషయమిది. ఇప్పటికే కొత్త ఏడాది వేడుకలను గ్రాండ్‌ జరుపుకొనేందుకు ప్లాన్‌ చేసుకుంటున్న వారికి.. గుడ్‌న్యూస్‌ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ సందర్భంగా... మద్యం దుకాణాలకు మినహాయింపునిచ్చింది. డిసెంబర్‌ 31 అర్ధరాత్రి 12 గంటల వరకు its something that gives a full kick but;cbn;amala akkineni;hyderabad;telangana;government;police;january;traffic police;lie;kickఫుల్ కిక్ ఇచ్చే విషయమే.. కానీ..!ఫుల్ కిక్ ఇచ్చే విషయమే.. కానీ..!its something that gives a full kick but;cbn;amala akkineni;hyderabad;telangana;government;police;january;traffic police;lie;kickThu, 31 Dec 2020 17:00:00 GMTతెలంగాణ ప్రభుత్వం‌. మద్యం దుకాణాలను తెరిచి ఉంచే సమయాన్ని పెంచింది. కరోనా నిబంధనల నుంచి కాస్త సడలింపునిచ్చింది. దీంతో నూతన సంవత్సర సంబరాల్లో లిక్కర్‌ ఏరులై పారనుంది.

మందుబాబులకు ఫుల్‌ కిక్కునిచ్చే విషయమిది. ఇప్పటికే కొత్త ఏడాది వేడుకలను గ్రాండ్‌ జరుపుకొనేందుకు ప్లాన్‌ చేసుకుంటున్న వారికి.. గుడ్‌న్యూస్‌ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.  న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ సందర్భంగా... మద్యం దుకాణాలకు మినహాయింపునిచ్చింది. డిసెంబర్‌ 31 అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలను తెరిచి ఉంచేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్త సంవత్సరం వేడుకల దృష్ట్యా బార్లు, క్లబ్బుల‌కు కూడా వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. డిసెంబర్‌ 31, జనవరి 1వ తేదీల్లో.. బార్లు, క్లబ్బులు  రాత్రి ఒంటిగంట వరకు తెరిచేందుకు అనుమతిచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో  న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌కు కిక్కు వచ్చినట్టయ్యింది. అయితే, కోవిడ్‌ నిబంధనల్ని అనుసరిస్తూనే.. కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొనాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

మరోవైపు నూతన సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు  అర్ధ రాత్రి హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలు విధించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం దుకాణాలు, బార్ల వేళలను ప్రభుత్వం ఒంటిగంట వరకూ పొడిగించిన కారణంగా పోలీస్ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నగరంలో ఈవెంట్లు, సామూహిక వేడుకలపై నిషేధం విధించినప్పటికీ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు ఇవ్వొద్దన్న నిర్ణయానికొచ్చేశారు.

మద్యం దుకాణాలను రాత్రి 12 గంటలదాకా తెరిచి ఉంచేందుకు అనుమతించింది. కొవిడ్‌ నిబంధనలకు లోబడి ఈ అనుమతులు వర్తిస్తాయని వెల్లడించింది. ఇక తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల పర్మిట్‌ రూమ్‌లను తెరిచేందుకు కూడా ప్రభుత్వం అనుమతినిచ్చింది. నగరంలో బార్లు, పబ్బులు, రిసార్టులు, బహిరంగ ప్రదేశాలు, హోటళ్లలో వేడుకలపై ప్రభుత్వం నిషేధం విధించింది







దారుణం.. మూడేళ్ల చిన్నారిపై లైంఘిక దాడి.. ఆపై హత్య

2020 హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ : ఈ ఏడాది క్రికెట్ లో ఆట తక్కువ..వివాదాలు ఎక్కువ !!

ముంబై తర్వాత ఏపీనే... జగన్ వల్లే: డీజీపీ ప్రసంశలు

కేసిఆర్ గారు.. రాత్రికి రాత్రి బంగారు తెలంగాణ తెచ్చేలా ఉన్నారే.. రాములమ్మ సెటైర్..?

పార్టీ పెట్టనని చెప్పిన రజినీకాంత్.. మాస్టర్ ప్లాన్ వేసిన బీజేపీ!

మెగాస్టార్ దృష్టిలో పడేందుకు.. మెహబూబ్, సోహెల్ ఏం చేశారో చూడండి

2020వ సంవత్సరం సూర్యాకు బాగా కలిసొచ్చిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>