PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-vaccine-updatescb5c9ece-41ec-4650-9a19-fa9d9357676a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-vaccine-updatescb5c9ece-41ec-4650-9a19-fa9d9357676a-415x250-IndiaHerald.jpgవ్యాక్సిన్ వస్తే కానీ ఈ సమస్యకు పూర్తి పరిష్కారం లభించేలా లేదు... ఇలాంటి తరుణంలో న్యూ ఇయర్ సందర్భంగా... దేశ ప్రజల ఆనందాలు, స్వేచ్ఛ తిరిగి లభించేలా కేంద్రం నుండి శుభవార్త వస్తుందేమో అని అందరు ఎదురుచూస్తున్నారు. carona vaccine updates;india;january;good news;central government;nijam;good newwzకొత్త సంవత్సరం రోజున కేంద్రం గుడ్ న్యూస్ చెప్తుందా...?కొత్త సంవత్సరం రోజున కేంద్రం గుడ్ న్యూస్ చెప్తుందా...?carona vaccine updates;india;january;good news;central government;nijam;good newwzThu, 31 Dec 2020 12:00:00 GMT
వ్యాక్సిన్ వస్తే కానీ ఈ సమస్యకు పూర్తి పరిష్కారం లభించేలా లేదు... ఇలాంటి తరుణంలో న్యూ ఇయర్ సందర్భంగా... దేశ ప్రజల ఆనందాలు, స్వేచ్ఛ తిరిగి లభించేలా కేంద్రం నుండి శుభవార్త వస్తుందేమో అని అందరు ఎదురుచూస్తున్నారు. జనవరి నుండి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ ఎప్పటినుండో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి... అయితే ఇప్పుడు కొత్త సంవత్సరం సందర్భంగా నిజంగా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి రాబోతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన వ్యాక్సిన్ కు యూకే ఆమోదం పొందింది. ఈరోజు ఎక్స్ పర్ట్ కమిటీ సమావేశం నిర్వహించి ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కు అనుమతులు  ఇవ్వనుందని సమాచారం.

ఇటు భారత్ బయోటెక్, ఫైజర్ సంస్థలు కూడా కేంద్రం నుండి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ మూడు వ్యాక్సిన్లపై ఎక్స్ పర్ట్ కమిటీ కొత్త సంవత్సరం రోజున ఓ నిర్ణయానికి వస్తుందా అన్న ఆసక్తి నెలకొంది. కమిటీ నిర్ణయాన్ని బట్టి కేంద్ర ఆరోగ్యశాఖ వ్యాక్సిన్లపై క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ఒక్కదానికే అనుమతి ఇస్తారా లేదంటే మూడు వ్యాక్సిన్లకు అనుమతులు ఇస్తారా? అన్న విషయం చర్చనీయాంశమైంది. న్యూ ఇయర్ నాడు.... వ్యాక్సిన్ పై శుభవార్త చెప్పి, కరోనా భయాన్ని పూర్తిగా పాత సంవత్సరంతో పారద్రోలుతుందని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.


సమంత విలనిజం.. ఫ్యాన్స్ షాక్ అవడం పక్కా..!

త్రివిక్రమ్‌కు నో చెప్పిన జూనియర్ ఎన్టీఆర్?

ఏపీలో ఎన్ఐఏ దర్యాప్తు చెయ్యాల్సిందే..!

ఒక్క యూట్యూబ్ చానల్ ద్వారా ఈ మహిళ ఎంత సంపాదిస్తుందో తెలుసా?

కే‌సి‌ఆర్ కీలక నిర్ణయం..మరో ముఖ్య పథకం అమలు !!

మరో కేంద్ర చట్టానికి కేసీఆర్ జై!

భూకంపాన్ని ఎప్పుడైనా లైవ్‌లో చూశారా..? అయితే ఇప్పుడు చూడండి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>