MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/did-you-remember-who-cuts-ten-heads-fifty-hands-eighty-legs-punya-murthyc2475891-ff35-41f5-8b09-41f1efef9adf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/did-you-remember-who-cuts-ten-heads-fifty-hands-eighty-legs-punya-murthyc2475891-ff35-41f5-8b09-41f1efef9adf-415x250-IndiaHerald.jpgసినిమా పరిశ్రమకి ఎప్పటికప్పుడు కొత్త నటులు వస్తూ ఉంటారు వారిలో కొందరు సక్సెస్ అయి మంచి పేరు దక్కించుకుని ముందు కొనసాగితే మరికొందరు మాత్రం ఆశించిన స్థాయి సక్సెస్ లేక అలాగే ఉండి పోతుంటారు. ఇక మంచి పేరు దక్కించుకున్న వారిలో ఇంకొందరు మాత్రం ప్రేక్షకాభిమానుల మనసుల్లో గొప్ప పేరు ప్రఖ్యాతులు దక్కించుకొని స్థిరమైన ముద్రని వేస్తారు. ఆ విధంగా తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసుల్లో యాక్షన్ మరియు విలన్ పాత్రలకు పెట్టింది పేరైన నటుడు పొన్నాంబళం మంచి పేరు దక్కించుకున్నారు. ponnambalam;chiranjeevi;kamal hassan;rajinikanth;rambha;soundarya;rajani;sundar;cinema;telugu;bigboss;rajani kanth;kollywood;media;tamil;heroine;successపది తలలు .... యాభై చేతులు... ఎనభై కాళ్లు నరికిన పుణ్యమూర్తి మీకు గుర్తున్నాడా .....??పది తలలు .... యాభై చేతులు... ఎనభై కాళ్లు నరికిన పుణ్యమూర్తి మీకు గుర్తున్నాడా .....??ponnambalam;chiranjeevi;kamal hassan;rajinikanth;rambha;soundarya;rajani;sundar;cinema;telugu;bigboss;rajani kanth;kollywood;media;tamil;heroine;successThu, 31 Dec 2020 01:00:00 GMTసినిమా పరిశ్రమకి ఎప్పటికప్పుడు కొత్త నటులు వస్తూ ఉంటారు వారిలో కొందరు సక్సెస్ అయి మంచి పేరు దక్కించుకుని ముందు కొనసాగితే మరికొందరు మాత్రం ఆశించిన స్థాయి సక్సెస్ లేక అలాగే ఉండి పోతుంటారు. ఇక మంచి పేరు దక్కించుకున్న వారిలో ఇంకొందరు మాత్రం  ప్రేక్షకాభిమానుల మనసుల్లో గొప్ప పేరు ప్రఖ్యాతులు దక్కించుకొని స్థిరమైన ముద్రని వేస్తారు. ఆ విధంగా తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసుల్లో యాక్షన్ మరియు విలన్ పాత్రలకు పెట్టింది పేరైన నటుడు పొన్నాంబళం మంచి పేరు దక్కించుకున్నారు.

మొదట తమిళ సినిమా కలియుగం ద్వారా కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు నటుడిగా ఎంట్రీ ఇచ్చిన పొన్నాంబళం ఆ తరువాత వరుసగా అక్కడ నుండి అవకాశాలతో కొనసాగారు. ఆపై మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఘరానా మొగుడు సినిమా ద్వారా తెలుగు చలన చిత్రసీమలోకి అడుగుపెట్టిన పొన్నాంబళం ఆ సినిమా భారీ విజయం అనంతరం ఇటు తెలుగులోనూ ఎన్నో సినిమాల్లో నటించారు. అలానే హిందీలో కూడా పలు సినిమాల్లో నటించి మంచి పేరు దక్కించుకున్న పొన్నాంబళం రజనీకాంత్ హీరోగా సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కిన అరుణాచలం అనే సినిమాలో పుణ్యమూర్తి పాత్ర పోషించడం జరిగింది. సౌందర్య, రంభ హీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో అతి పెద్ద విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో పుణ్యమూర్తి పాత్రలో నటించిన పొన్నాంబళం  చెప్పే ఒక డైలాగ్ ని ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు.

సినిమాలో రజినీకాంత్ కి బావగా ఒకానొక సంఘటన అనంతరం ఎంతో వైల్డ్ గా ఎంట్రీ ఇచ్చే పొన్నాంబళం, పది తలలు యాభై చేతులు ఎనభై కాళ్ళు నరికిన అదే పుణ్యమూర్తిని బావ, చిన్నప్పుడు కలిసి తిరిగిన నేను నీకు గుర్తు లేనా అంటూ ఆయన చెప్పే డైలాగ్ ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇక ఇటు తెలుగులోనూ దాదాపుగా అందరు స్టార్ హీరోలతో నటించిన  పొన్నాంబళం ఇటీవల తమిళ్ లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్2 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా కొనసాగుతున్న పొన్నాంబళం ఇటీవల కిడ్నీ వ్యాధితో బాధపడుతుండడంతో ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఆయనకి ఆర్థికంగా సహాయం చేశారు. ఆ విధంగా అటు తెలుగు, ఇటు తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా నటుడిగా ప్రేక్షకుల మనసుల్లో మంచి పేరు దక్కించుకున్న పొన్నాంబళం రాబోయే  రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా కోలుకుని మరిన్ని సినిమాలు చేయాలని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతూ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్ చేస్తున్నారు.....!!


కొడాలి అడ్డాలో పవన్ ఫార్ములా వర్కౌట్ కాదా?

మరో కేంద్ర చట్టానికి కేసీఆర్ జై!

భూకంపాన్ని ఎప్పుడైనా లైవ్‌లో చూశారా..? అయితే ఇప్పుడు చూడండి..

కొడాలి నానీని చంద్రబాబే టార్గెట్ చేయించారా...?

తెలంగాణ‌లో నేరాలు త‌గ్గాయి... ఇక మా ల‌క్ష్యం అదే.. డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి

2020 టాలీవుడ్ బెస్ట్ మూవీస్.. టాప్ ప్లేస్ ఎవరిదంటే!

బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన తెలుగు హీరోయిన్స్.. సక్సెస్ కొట్టేస్తారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>