PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajanee4fb3a827-ea3f-47ce-8655-a8a5417f0963-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajanee4fb3a827-ea3f-47ce-8655-a8a5417f0963-415x250-IndiaHerald.jpgసౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన ఎక్కని ఎత్తులు లేవు. చేరుకోని శిఖరాలు లేవు. గత నాలుగున్నర దశాబ్దాలుగా రజనీ మానియా భారతీయ సినిమాను కమ్ముకుంది. ఆయన స్టైల్ కి ఫిదా కాని వారు లేరు. నటనలో ఎన్నో అంచులు చూసిన రజకీకాంత్ అంటే ఫ్యాన్స్ కి పూనకాలే వస్తాయి. తమిళనాడు ప్రజలకు ఆయన్ ఎమ్జీయార్ తరువాత అంతటి ఆరాధ్యుడు. rajanee;chiranjeevi;amitabh bachchan;rajinikanth;tiru;india;kamma;congress;ram madhav;cinema;telugu;rajani kanth;chief minister;silver;silver screen;allahabad;research and analysis wing;party;fidaaరజనీ డెడ్లీ డెసిషన్ తో వారికి ఇనుప తెర ?రజనీ డెడ్లీ డెసిషన్ తో వారికి ఇనుప తెర ?rajanee;chiranjeevi;amitabh bachchan;rajinikanth;tiru;india;kamma;congress;ram madhav;cinema;telugu;rajani kanth;chief minister;silver;silver screen;allahabad;research and analysis wing;party;fidaaThu, 31 Dec 2020 20:00:00 GMTఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన ఎక్కని ఎత్తులు లేవు. చేరుకోని శిఖరాలు లేవు. గత నాలుగున్నర దశాబ్దాలుగా రజనీ మానియా భారతీయ సినిమాను కమ్ముకుంది. ఆయన స్టైల్ కి ఫిదా కాని వారు లేరు. నటనలో ఎన్నో అంచులు చూసిన రజకీకాంత్ అంటే ఫ్యాన్స్ కి పూనకాలే వస్తాయి. తమిళనాడు ప్రజలకు ఆయన్ ఎమ్జీయార్ తరువాత అంతటి ఆరాధ్యుడు.

రజనీకాంత్ పార్టీ పెట్టాలి కానీ ముఖ్యమంత్రి అయిపోవడం ఖాయమని గత పాతికేళ్ళుగా వినిపిస్తూ వస్తున్న మాట. నిజానికి రజనీకాంత్ కి ఆ స్టామినా ఉంది. ఆయన అభిమానులే కోట్లలో ఉంటారు. వారు చైతన్యమైతే కచ్చితంగా ఒక్కసారి అయినా ఆయనకు సీఎం సీటు దాసోహం అనక తప్పదు, కానీ రజనీకాంత్ రాంగ్ టైం లో డెసిషన్ తీసుకున్నారో మరేమో కానీ ఆయన మాత్రం 70 ఏళ్ళ వయసులో రాజకీయాల్లోకి వస్తాను అని ప్రకటించారు. ఆ వార్త అలా ప్రచారంలో ఉండగానే ఆయన మూడు వారాలు తిరగక ముందే నో పాలిటిక్స్ అంటూ డెడ్లీ డెసిషన్ ని ప్రకటించారు.

ఆ విధంగా రజనీకాంత్ తనకు రాజకీయాలు బహుదూరమని చెప్పడమే కాదు, ఏకంగా సినిమా నటులకు, ఔత్సాహీకులకు కూడా పెద్ద  ఇనుప తెర వేసేశారు. రాజకీయాల్లో రావడానికీ అభిమాన జనం ఒక్కటి ఉంటే ఏ మాత్రం సరిపోదని గ్రహించడం వల్లనే రజనీ తన పాలిటిక్స్ కి స్వస్తి వాచకం పలికేశారు. రజనీకాంత్ కంటే ముందు భారతీయ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఒక సారి అలహాబాద్ నుంచి ఎంపీగా కాంగ్రెస్ తరఫున నెగ్గి ఆ తరువాత రాజకీయాలకు ఒక నమస్కారం పెట్టేశారు.

అలాగే తెలుగునాట మెగాస్టార్ రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి కూడా ఈ రాజకీయం తనకు అచ్చిరాదని చెప్పేసారు. వీరంతా టాప్ స్టార్లు, వెండి తెరను ఏకచత్రధిపత్యంగా ఏలిన వేలుపులు. వీరిని మించిన వారు భారతీయ సినిమా జగత్తుకు వస్తారు అన్నది అత్యాశే. అటువంటి వీరే రాజకీయాలకు నమస్కారం పెట్టేశాక మరెంతటి వారు వచ్చినా ఇక్కడ నిలదొక్కుకోవడం కష్టమే అన్న మాట అయితే ఉంది.

ఒక విధంగా సినీ జీవులకు రజనీకాంత్ డెసిషన్ తో పాలిటిక్స్ మీద ఆశలు పూర్తిగా లేకుండా పోయాయని చెప్పకతప్పదు. ఇప్పటికే రాజకీయ పార్టీలు పెట్టి తిరుగుతున్న వారు కూడా రేపో మాపో రజనీ ఫిలాసఫీని వంటబట్టించుకోకతప్పదని కూడా అంటున్నారు. రజనీ నో పాలిటిస్క్ డెసిషన్ తమిళనాట తెలుగు నాట కూడా జనాల్లో కొత్త ఆలోచనలు కలిగిస్తుంది అన్న దాంట్లో సందేహం లేదు. దాంతో వెండి తెర వేలుపులకు పాలిటిక్స్ లో ఇక పూర్తిగా  ఇనుప తెర పడిపోయినట్లే.





పెంపుడు కుక్కకు ఆస్తి రాసిచ్చిన రైతు

ఈ-కామర్స్ కంపెనీలపై కేంద్రం కన్నెర్ర.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాక్!

ధరణి పోర్టల్... స్లాట్ రద్దు చేసుకుంటే డబ్బులు వాపస్

'బండి'కి ఢిల్లీ పిలుపు ? బీజేపీ పెద్ద ల నిర్ణయం ఏంటో ?

బడ్జెట్ విషయంలో వెనక్కు తగ్గని డైరెక్టర్.. టెన్షన్‌లో బాలయ్య నిర్మాత!

2020లో తెలంగాణలో బీజేపీ హవా

జగన్ కు ధన్యవాదాలు చెప్పిన కీలక అధికారి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>