PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/kcr-decision-impact-on-tsrtc6cb43947-37a6-49a9-8952-a24162b765d7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/kcr-decision-impact-on-tsrtc6cb43947-37a6-49a9-8952-a24162b765d7-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. ఇటీవలే ముగుసిన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అప్పటి నుంచే కేసీఆర్ వైఖరిలో మార్పు కనిపిస్తోందన్న భావనను జనం వ్యక్తం చేస్తున్నారు.kcr;amit shah;kcr;amala akkineni;kumaar;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;india;telangana;narendra modi;agri;telugu;prime minister;chief minister;assembly;minister;heart;news;central government;arogyasri;reddy;mantraసీఎం కేసీఆర్ లోని మార్పుకు ఆ ఇద్దరే కారణమా ?సీఎం కేసీఆర్ లోని మార్పుకు ఆ ఇద్దరే కారణమా ?kcr;amit shah;kcr;amala akkineni;kumaar;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;india;telangana;narendra modi;agri;telugu;prime minister;chief minister;assembly;minister;heart;news;central government;arogyasri;reddy;mantraThu, 31 Dec 2020 13:00:00 GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. ఇప్పుడు తాజాగా సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్‌ను రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీతో అనుసంధానించాలని నిర్ణయించారు. ప్రధాని మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. మొన్నటి వరకూ ఆయుష్మాన్ భారత్ కంటే తెలంగాణలో అమలవుతోన్న ఆరోగ్యశ్రీ పథకమే ఎన్నో రెట్లు మెరుగైందని బలంగా చెప్పిన కేసీఆర్.. కేంద్ర పథకానికి జై కొట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేసుకున్నారు. కానీ ఫలితాలు మాత్రం టీఆర్ఎస్‌కు రుచించలేదు. దుబ్బాక ఎన్నికలో ఓటమి చవిచూడగా, గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు అయినది. అయితే ఇటీవలే ముగుసిన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అప్పటి నుంచే కేసీఆర్ వైఖరిలో మార్పు కనిపిస్తోందన్న భావనను జనం వ్యక్తం చేస్తున్నారు.
 


రైతు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలకు తొలుత టీఆర్ఎస్ మద్దతు పలికింది. భారత్ బంద్ సందర్భంగా మంత్రులు సైతం రోడ్లెక్కారు. కానీ కేసీఆర్ ఢిల్లీ టూర్ తర్వాత.. సీన్ మారింది. నియంత్రిత సాగును ఎత్తేయడంతోపాటు.. అగ్రి చట్టాలకు అనుకూలంగా స్వరం మారింది. రైతులు తమ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని.. కనీస ధర అనేది ఉండదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడం లేదని బీజేపీ నేతలు పదే పదే కేసీఆర్‌ సర్కారును ప్రశ్నించేవారు. ఆయుష్మాన్ భారత్ అమలు చేయకపోవడం వల్ల పేదలు కరోనాకు ఉచిత చికిత్స పొందలేకపోతున్నారని.. గుండె చికిత్సలు సైతం జరగడం లేదని కమలనాథులు గతంలో ఆరోపించారు. గులాబీ నేతలు మాత్రం ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ ఎంతో మెరుగైందని వాదించేవారు. అలాంటిది ఉన్నట్టుండి ఇలా ఆయుష్మాన్ భారత్‌లో చేరుతున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఇప్పుడు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కారణంగా.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు హైదరాబాద్‌లో ఆయుష్మాన్ భారత్ కింద చికిత్సలు చేయించుకునే అవకాశం ఉంది.


పటిష్టంగా మారిన ఆస్ట్రేలియా జట్టు.. ఎందుకో తెలుసా..?

న్యాయం జరిగే వరకు ప్రొద్దుటూరులో దీక్ష చేస్తా: నారా లోకేశ్

కరోనా వైరస్ ఆడదా? ఈ లెక్కలు చూస్తే అదే అనిపిస్తోంది!

వ్యాక్సిన్ కి మేము రెడీ... కేంద్రానికి ఏపీ నివేదిక

కొత్త సంవత్సరం రోజున కేంద్రం గుడ్ న్యూస్ చెప్తుందా...?

త్రివిక్రమ్‌కు నో చెప్పిన జూనియర్ ఎన్టీఆర్?

ఏపీలో ఎన్ఐఏ దర్యాప్తు చెయ్యాల్సిందే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>