SportsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/umesh-yadav02e8ae29-8744-45cd-bf73-b033dfb413ed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/umesh-yadav02e8ae29-8744-45cd-bf73-b033dfb413ed-415x250-IndiaHerald.jpgమొదటి టెస్ట్ లో అవమానకర రీతిలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన టీం ఇండియా, రెండవ టెస్ట్ లో మాత్రం జూలు విదిల్చింది. 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై భారీ ఘన విజయం సాధించిన ఇండియాకు ఇంతలోనే ఎదురుదెబ్బ తగిలింది, ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియా టూర్ నుంచి టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ గాయం కారణంగా తప్పుకున్నాడు. మెల్‌బోర్న్ వేదికగా గత మంగళవారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తుండగా.. ఉమేశ్ యాదవ్ మోకాలికి గాయమైంది.umesh yadav;auto;audi;india;australia;england;telugu;january;bcci;adelaide;mohammed shamiఆస్ట్రేలియా పర్యటన నుండి గాయంతో వైదొలిగిన మరో క్రికెటర్ఆస్ట్రేలియా పర్యటన నుండి గాయంతో వైదొలిగిన మరో క్రికెటర్umesh yadav;auto;audi;india;australia;england;telugu;january;bcci;adelaide;mohammed shamiThu, 31 Dec 2020 14:00:00 GMTఆస్ట్రేలియా టూర్ లో ఉన్న టీం ఇండియా, ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడుతుంది. అయితే మొదటి టెస్ట్ లో అవమానకర రీతిలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన టీం ఇండియా, రెండవ టెస్ట్ లో మాత్రం జూలు విదిల్చింది. 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై భారీ ఘన విజయం సాధించిన ఇండియాకు ఇంతలోనే ఎదురుదెబ్బ తగిలింది, ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియా టూర్ నుంచి టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ గాయం కారణంగా తప్పుకున్నాడు. మెల్‌బోర్న్ వేదికగా గత మంగళవారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తుండగా.. ఉమేశ్ యాదవ్ మోకాలికి గాయమైంది. దాంతో.. ఓవర్ మధ్యలోనే మైదానం వీడిన ఉమేశ్ యాదవ్‌ని స్కానింగ్ కోసం బీసీసీఐ మెడికల్ టీమ్ తీసుకెళ్లింది. ఆ తర్వాత మళ్లీ అతను గ్రౌండ్‌లోకి అడుగుపెట్టలేదు.
 
 
 
 
 భారత్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ టీమ్ పర్యటించనుండగా.. సుదీర్ఘ సిరీస్‌ని టీమిండియా ఆడబోతోంది. ఈ నేపథ్యంలో.. ఉమేశ్ యాదవ్ గాయంతో సాహసం చేయకూడదని భావించిన టీమిండియా మేనేజ్‌మెంట్ అతడ్ని సిరీస్ నుంచి తప్పించి.. భారత్‌కి పంపించేస్తోంది. ఇప్పటికే మోచేతి గాయంతో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ సిరీస్ నుంచి తప్పుకుని భారత్‌కి వచ్చేసిన విషయం తెలిసిందే. షమీ స్థానంలో మహ్మద్ సిరాజ్‌ని మెల్‌బోర్న్ టెస్టులో టీమిండియా ఆడించగా.. ఉమేశ్ యాదవ్ స్థానంలో టి. నటరాజన్‌ని జనవరి 7 నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్టులో భారత్ ఆడించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో నాలుగు వికెట్లు పడగొట్టిన ఉమేశ్ యాదవ్.. మెల్‌బోర్న్ టెస్టులోనూ ఒక వికెట్ పడగొట్టి మంచి లయతో బౌలింగ్ చేస్తూ కనిపించాడు. కానీ.. గాయం కారణంగా ఓవర్ మధ్యలోనే వైదొలిగిన ఉమేశ్ యాదవ్.. ఎన్నివారాలు ఆటకి దూరంగా ఉండాలి..? అనే దానిపై బీసీసీఐ క్లారిటీ ఇవ్వలేదు.


2020వ సంవత్సరం సూర్యాకు బాగా కలిసొచ్చిందా?

సీఎం కేసీఆర్ లోని మార్పుకు ఆ ఇద్దరే కారణమా ?

న్యాయం జరిగే వరకు ప్రొద్దుటూరులో దీక్ష చేస్తా: నారా లోకేశ్

కరోనా వైరస్ ఆడదా? ఈ లెక్కలు చూస్తే అదే అనిపిస్తోంది!

వ్యాక్సిన్ కి మేము రెడీ... కేంద్రానికి ఏపీ నివేదిక

కొత్త సంవత్సరం రోజున కేంద్రం గుడ్ న్యూస్ చెప్తుందా...?

త్రివిక్రమ్‌కు నో చెప్పిన జూనియర్ ఎన్టీఆర్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>