BeautyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/jiddu667f8799-e987-488d-b362-db8097c70506-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/jiddu667f8799-e987-488d-b362-db8097c70506-415x250-IndiaHerald.jpgప్రస్తుత ప్రపంచంలో ప్రతి అమ్మాయికి నలుగురిలో అందరికంటే అందంగా కనిపించాలనే తపన ఉంటుంది. అందుకోసం మార్కెట్లో దొరికే ఎన్నో రకాలైన ఉత్పత్తులను వాడుతుంటారు. కొంతమందికి ఆయిల్ స్కిన్ ఉంటే, మరి కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ తమ చర్మానికి తగ్గట్టు కాస్మెటిక్స్, క్రీమ్స్ అంటూ వాడుతుంటారు. అయితే కొంతమందికి ఎంత వాడినా ముఖం జిడ్డు కారుతూనే ఉంటుంది. ఇలాంటి వారు ఎన్ని క్రీమ్స్ తెచ్చి వాడినా ఫలితముండదు. పైగా అందవిహీనంగా కనిపిస్తారు.jiddu;car;oilజిడ్డు చర్మంతో బాధపడుతున్నారా? అయితే ఇది మీ కోసమే!జిడ్డు చర్మంతో బాధపడుతున్నారా? అయితే ఇది మీ కోసమే!jiddu;car;oilThu, 31 Dec 2020 16:31:11 GMTప్రస్తుత ప్రపంచంలో ప్రతి అమ్మాయికి నలుగురిలో అందరికంటే అందంగా కనిపించాలనే తపన ఉంటుంది. అందుకోసం మార్కెట్లో దొరికే ఎన్నో రకాలైన ఉత్పత్తులను వాడుతుంటారు. కొంతమందికి ఆయిల్ స్కిన్ ఉంటే, మరి కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ తమ చర్మానికి తగ్గట్టు కాస్మెటిక్స్, క్రీమ్స్ అంటూ వాడుతుంటారు. అయితే కొంతమందికి ఎంత వాడినా ముఖం జిడ్డు కారుతూనే ఉంటుంది. ఇలాంటి వారు ఎన్ని క్రీమ్స్ తెచ్చి వాడినా ఫలితముండదు. పైగా అందవిహీనంగా కనిపిస్తారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలు పాటించి, జిడ్డు ముఖాన్ని తగ్గించుకునే  ప్రయత్నం చేద్దాం.ఆ చిట్కాలు ఏంటో మన ముఖం మీద కారుతున్న జిడ్డు ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

ఆయిల్ స్కిన్ కలిగినవారు బంగాళాదుంప రసాన్ని తీసి, ఆ రసం లో కాటన్ బాల్ అద్ది ముఖం అంతా మర్దన చేసుకోవాలి. అరగంట పాటు ఆరనిచ్చి, చన్నీటితో కడిగేసుకోవాలి.ఇలా చేయడం వల్ల చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది.

టొమాటో ముక్కలను చక్కెరతో కలిపి స్క్రబ్  చేయడంవల్ల ముఖం మీద రంద్రాలు పూడుకుపోయి,  జిడ్డు తత్వాన్ని తగ్గిస్తాయి.

ఐస్ క్యూబ్స్ ను తీసుకొని రాత్రి పడుకునే అరగంట ముందు బాగా ముఖం మీద వృత్తాకారంలో మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా ముఖం జిడ్డు కారకుండా ఉంటుంది.

రాత్రివేళ ప్రతిరోజు పాలమీగడ,పసుపు కలిపిముఖానికి మర్దనా చేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత కడుక్కోవాలి.ఇలా చేయడం వల్ల యాంటీ ఫంగల్,యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జిడ్డు తత్వాన్ని తగ్గిస్తాయి.

స్నానానికి వెళ్లే 15 నిమిషాల ముందు ఆపిల్ను స్లైస్ గా కట్ చేసి ముఖం మీద పెట్టుకోవాలి. ఆ తరువాత కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అలోవెరా జ్యూస్ ను ప్రతిరోజు వాడడం వల్ల జిడ్డు  త్వరగా తగ్గిపోతుంది.

రోజ్ వాటర్ తో తరుచూ పట్టిస్తూ ఉండడంవల్ల ఆయిల్ స్కిన్ కాస్త నార్మల్ స్కిన్ కు వచ్చే అవకాశం ఎక్కువ.

రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు, వన్ టేబుల్ స్పూన్ పెరుగు కలిపి మిశ్రమంలా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం అంతా మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం మీద జిడ్డు తొలగిపోయి,ముఖం ప్రకాశవంతంగా తయారవుతుంది.

నిమ్మరసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి, ఆ మిశ్రమంలో కాటన్ బాల్ ను అద్ది ముఖానికి మర్దన చేసుకోవాలి.  ఇలా చేయడం వల్ల ముఖం ప్రకాశవంతంగా అవుతుంది.

సబ్బును ఎక్కువగా వాడకూడదు. తరచూ నార్మల్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.పైన పేర్కొన్న చిట్కాలను పాటించి, ముఖం నుంచి జిడ్డు కారేతత్వాన్ని తగ్గించుకోవచ్చు.




నిమ్మ తొక్కతో బయటపడ్డ నమ్మలేని నిజాలు!

ముంబై తర్వాత ఏపీనే... జగన్ వల్లే: డీజీపీ ప్రసంశలు

కేసిఆర్ గారు.. రాత్రికి రాత్రి బంగారు తెలంగాణ తెచ్చేలా ఉన్నారే.. రాములమ్మ సెటైర్..?

పార్టీ పెట్టనని చెప్పిన రజినీకాంత్.. మాస్టర్ ప్లాన్ వేసిన బీజేపీ!

మెగాస్టార్ దృష్టిలో పడేందుకు.. మెహబూబ్, సోహెల్ ఏం చేశారో చూడండి

2020వ సంవత్సరం సూర్యాకు బాగా కలిసొచ్చిందా?

సీఎం కేసీఆర్ లోని మార్పుకు ఆ ఇద్దరే కారణమా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>