PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/supreme-court-jagan-as-babde-highcourt-rakeshkumarb9e5ff4e-7b54-4d08-bb1b-7dfb83dc98f5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/supreme-court-jagan-as-babde-highcourt-rakeshkumarb9e5ff4e-7b54-4d08-bb1b-7dfb83dc98f5-415x250-IndiaHerald.jpgన్యూఇయ‌ర్‌కు అనుమ‌తులెలా ఇచ్చారంటూ తెలంగాణ ప్ర‌భుత్వాన్ని హైకోర్టు సూటిగా ప్ర‌శ్నించింది. హైకోర్టులో గురువారం కరోనా సంబంధిత వ్యాజ్యాలపై విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌ను ర‌ద్దు చేయ‌కుండా కేవ‌లం ఆంక్ష‌ల మాటున అనుమ‌తులివ్వ‌డంపై రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కొత్త కరోనా వైరస్ ప్రమాదకరమని ఓ వైపు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న వేడుకలను ఎలా అనుమతిస్తారని ప్ర‌శ్నించింది. విచ్చలవిడిగా వైన్ షాపులు, బార్లు తెరవడం ద్వారా ఏం చేయాలనుకుంటున్నారని మండిప‌డింది. ప్రభుత్వhighcourt;telangana;high court;government;january;court;lawyer;central government;coronavirusప్ర‌జ‌ల బాగోగులు ప‌ట్ట‌వా..? ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్ర‌హం...ఎందుకో తెలుసా..?ప్ర‌జ‌ల బాగోగులు ప‌ట్ట‌వా..? ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్ర‌హం...ఎందుకో తెలుసా..?highcourt;telangana;high court;government;january;court;lawyer;central government;coronavirusThu, 31 Dec 2020 15:48:01 GMTతెలంగాణ ప్ర‌భుత్వాన్ని హైకోర్టు సూటిగా ప్ర‌శ్నించింది. హైకోర్టులో గురువారం కరోనా సంబంధిత వ్యాజ్యాలపై విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌ను ర‌ద్దు చేయ‌కుండా కేవ‌లం ఆంక్ష‌ల మాటున అనుమ‌తులివ్వ‌డంపై రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కొత్త కరోనా వైరస్ ప్రమాదకరమని ఓ వైపు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న వేడుకలను ఎలా అనుమతిస్తారని ప్ర‌శ్నించింది. విచ్చలవిడిగా వైన్ షాపులు, బార్లు తెరవడం ద్వారా ఏం చేయాలనుకుంటున్నారని మండిప‌డింది.  ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది.


న్యూఇయర్‌ వేడుకలకు పబ్‌లు, బార్లు విచ్చలవిడిగా ఓపెన్‌ చేసి ఏం చేయాలనుకుంటున్నారంటూ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించింది.  ఇప్పటికే రాజస్థాన్‌, మహారాష్ట్రలో వేడుకలు బ్యాన్‌ చేశారని తెలిపింది. ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా దృష్ట్యా వేడుకలు జరుపుకోవద్దని ప్రజలకు సూచించామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలపగా ఈరోజు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. భౌతికదూరం, మాస్క్‌లు తప్పకుండా వినియోగించాలని స్పష్టం చేసింది. వేడుకలకు సంబంధించి పూర్తి నివేదికను జనవరి 7న సమర్పించాలని స్పష్టం చేసింది.


ఇదిలా ఉండ‌గా ఎక్సైజ్ శాఖ తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కొత్త ఏడాది వేడుకల నేపథ్యంలో రాత్రి 12 గంటల వరకు దుకాణాలు తెరుచుకునే అవకాశం క‌ల్పిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్రంలోని బార్లు, క్లబ్బులు, టూరిజం హోటళ్లలో రాత్రి ఒంటి గంట వరకు మద్యాన్ని అందించవచ్చని ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపారు.ఓ వైపు కేంద్రం, పోలీస్‌ శాఖ హెచ్చరిస్తుండగా.. మరోవైపు ‘సాధారణ రోజుల్లో కంటే మరికొంత ఎక్కువ సమయం దుకాణాలు తెరిచి ఉంచుకోవచ్చు’ అంటూ ఆబ్కారీ శాఖ ఆదేశాలు ఇవ్వ‌డంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  వాస్తవానికి జీహెచ్‌ఎంసీ పరిధిలో రాత్రి 11, జిల్లాల్లో రాత్రి 10 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఉంది. త్వ‌ర‌గా మూయించాల్సింది పోయి స‌మ‌యం పెంచ‌డంపై కొంత‌మంది మండిప‌డుతున్నారు.


బాలయ్య ఆమెను ఆలా చేశాడట..!

జగన్ కు ధన్యవాదాలు చెప్పిన కీలక అధికారి

2020 హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ : ఈ ఏడాది క్రికెట్ లో ఆట తక్కువ..వివాదాలు ఎక్కువ !!

ముంబై తర్వాత ఏపీనే... జగన్ వల్లే: డీజీపీ ప్రసంశలు

కేసిఆర్ గారు.. రాత్రికి రాత్రి బంగారు తెలంగాణ తెచ్చేలా ఉన్నారే.. రాములమ్మ సెటైర్..?

పార్టీ పెట్టనని చెప్పిన రజినీకాంత్.. మాస్టర్ ప్లాన్ వేసిన బీజేపీ!

మెగాస్టార్ దృష్టిలో పడేందుకు.. మెహబూబ్, సోహెల్ ఏం చేశారో చూడండి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>