MoviesSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/singer-sunita-visited-tirumala-along-with-would-be4ffb7bc8-5bbb-41d5-89de-e703320e0d1c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/73/singer-sunita-visited-tirumala-along-with-would-be4ffb7bc8-5bbb-41d5-89de-e703320e0d1c-415x250-IndiaHerald.jpgసింగర్ సునీత.. పెళ్లికి ముందు తన కాబోయే భర్తతో పాటుగా తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు.దాదాపు 10 నెలల అనంతరం స్వామి వారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, జ‌న‌వ‌రి 9న త‌మ వివాహం జ‌ర‌గ‌నుంద‌ని సునీత పేర్కొన్నారు. త‌న‌కు మంచి జీవితాన్ని అందించాల‌ని స్వామి వారిని కోరుకున్నట్లు చెప్పారు.sunita;ram pothineni;tiru;tollywood;telugu;tirupati;media;marriage;december;air;instagram;play back;shadow;santoshamకాబోయే భర్తతో కలిసి తిరుమల వెంకన్నను దర్శించుకున్న సింగర్ సునీతకాబోయే భర్తతో కలిసి తిరుమల వెంకన్నను దర్శించుకున్న సింగర్ సునీతsunita;ram pothineni;tiru;tollywood;telugu;tirupati;media;marriage;december;air;instagram;play back;shadow;santoshamThu, 31 Dec 2020 13:30:00 GMT




టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ సునీత రెండో వివాహానికి సిద్దమైన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తూ తన నిశ్చితార్థపు ఫొటోలు కూడా షేర్ చేశారు సునీత. డిజిట‌ల్ మీడియా ప‌ర్స‌న్ రామ్ వీర‌ప‌నేనిని త‌ను వివాహం చేసుకోబోతున్నాన‌ని సోష‌ల్ మీడియా ద్వారా స్వయంగా పేర్కొన్నారు. దీంతో సునీత రెండో వివాహం తాలూకు విషయాలు నెట్టింట ట్రెండింగ్‌గా మారాయి. అలాగే గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన గాలి వార్తలకు బ్రేక్ పడినట్లు అయింది. అయితే త్వరలో తన పెళ్లి జరుగనున్న నేపథ్యంలోనే పెళ్లి తేదీ కన్ఫర్మ్ చేసిన సునీత.. పెళ్లికి ముందు తన కాబోయే భర్తతో పాటుగా తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు.




దాదాపు 10 నెలల అనంతరం స్వామి వారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, జ‌న‌వ‌రి 9న త‌మ వివాహం జ‌ర‌గ‌నుంద‌ని సునీత పేర్కొన్నారు. త‌న‌కు మంచి జీవితాన్ని అందించాల‌ని స్వామి వారిని కోరుకున్నట్లు చెప్పారు. ఇక ఇప్పటికే ఇప్పటికే సునీత నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్ పార్టీలు ఘనంగా జరిగాయి. శనివారం (డిసెంబర్ 26) సాయంత్రం జరిగిన సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీకి పలువురు సెలబ్రిటీలు హాజరై ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. నిజానికి డిసెంబ‌ర్‌లో పెళ్లి చేసుకోవాల‌ని ఈ జంట భావించిన‌ప్ప‌టికీ ఇద్ద‌రి జాత‌కాల ప్ర‌కారం స‌రైన ముహూర్తాలు లేక‌పోవ‌డంతో జ‌న‌వ‌రి 9వ తేదీన ఈ మూడు మూళ్ళ బంధానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. సునీత గతానికి వస్తే... 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుని, కొన్నేళ్ల తర్వాత భర్తతో విడాకులు చేసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరు పిల్లల బాధ్యతను మోస్తూ ఒంటరిగానే ఉంటున్న ఆమె.. ఇన్నేళ్ల తర్వాత మరో కొత్త ప్రయాణం మొదలు పెడుతుండటం విశేషం. కరోనా నిబంధనలు పాటిస్తూ జరగనున్న సునీత పెళ్లి వేడుకలో కేవలం ఆమె కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొనబోతున్నారని సమాచారం.

">




పటిష్టంగా మారిన ఆస్ట్రేలియా జట్టు.. ఎందుకో తెలుసా..?

సీఎం కేసీఆర్ లోని మార్పుకు ఆ ఇద్దరే కారణమా ?

న్యాయం జరిగే వరకు ప్రొద్దుటూరులో దీక్ష చేస్తా: నారా లోకేశ్

కరోనా వైరస్ ఆడదా? ఈ లెక్కలు చూస్తే అదే అనిపిస్తోంది!

వ్యాక్సిన్ కి మేము రెడీ... కేంద్రానికి ఏపీ నివేదిక

కొత్త సంవత్సరం రోజున కేంద్రం గుడ్ న్యూస్ చెప్తుందా...?

త్రివిక్రమ్‌కు నో చెప్పిన జూనియర్ ఎన్టీఆర్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>