PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/two-terrorist-deadin-an-encounterca6ca2de-d676-4565-9d87-8da5f839eb6c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/two-terrorist-deadin-an-encounterca6ca2de-d676-4565-9d87-8da5f839eb6c-415x250-IndiaHerald.jpgఉత్తర భారతదేశంలోని జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్‌ శివారు పరింపొరా ప్రాంతంలో ఇటీవలే జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు పోలీసులు బుధవారం వెల్లడించిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం భద్రతా దళాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. అయితే, ఉగ్రవాదుల కుటుంబాలు మాత్రం తమ పిల్లలు అమాయకులని వారికి ఏ పాపం తెలియదని అంటున్నారు.soldiers;srinagar;india;pakistan;police;army;traffic police;fatherశ్రీనగర్ ఎన్ కౌంటర్ లో మృతి చెందినవారు అమాయకులు - మృతులకుటుంబాలుశ్రీనగర్ ఎన్ కౌంటర్ లో మృతి చెందినవారు అమాయకులు - మృతులకుటుంబాలుsoldiers;srinagar;india;pakistan;police;army;traffic police;fatherThu, 31 Dec 2020 13:05:00 GMTఉత్తర భారతదేశంలోని జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్‌ శివారు పరింపొరా ప్రాంతంలో ఇటీవలే జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు పోలీసులు బుధవారం వెల్లడించిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం భద్రతా దళాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. అయితే, ఉగ్రవాదుల కుటుంబాలు మాత్రం తమ పిల్లలు అమాయకులని వారికి ఏ పాపం తెలియదని అంటున్నారు. వీరిలో పోలీస్ అధికారి కుమారుడు కూడా ఉన్నాడని, ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని మండిపడుతున్నారు. భద్రతా దళాల కాల్పుల్లో చనిపోయిన వారిలో ఒకరు ఇంటర్ చదువుతున్నట్టు తెలిపారు. జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టాయి. మంగళవారం సాయంత్రం ప్రారంభమైన ఈ ఎన్‌కౌంటర్ ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. కానీ, పోలీస్ రికార్డుల్లోని ఉగ్రవాదుల జాబితాలో వీరి పేర్లు లేవని తెలిపింది. తమ వద్ద ఉన్న ఉగ్రవాదుల జాబితాలో ఈ పేర్లు లేవని, వీరంతా ఉగ్రవాదులకు సానుభూతిపరులని (ఓడబ్ల్యూజీ) పేర్కొంది.




బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో పుల్వామాకు చెందిన అజాజ్ మక్బూల్ గనీ, అథీర్ ముస్తాఖా, సోఫియాన్‌కు చెందిన జుబైర్ లోనేగా గుర్తించారు. అయితే, వీరిలో అజాజ్ మక్బూల్ తండ్రి గండేర్బల్ జిల్లాలో ఓ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడని అతడి బంధువులు వెల్లడించారు. పాకిస్థాన్ ఉగ్రవాదులు సోఫియాన్‌లో ఓ ఆర్మీ అధికారి, ముగ్గురు పౌరులను హత్యచేసిన ఘటనపై పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన నాలుగు రోజుల్లోనే ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. అమాయకులను కాల్చి చంపారనే ఆరోపణలు రావడంతో సైన్యాన్ని ఆర్మీ విచారించగా.. వారి వద్ద ఆయుధాలు లభించాయని చెప్పారు. కానీ, మూడు మృతదేహాల వద్ద ఆయుధాలను సైన్యం ఉంచినట్టు దర్యాప్తులో తెలింది. బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో రెండు తుపాకులు, ఓ రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. అలాగే, వారు కుటుంబాలు చేస్తున్న ఆరోపణలును ఖండించారు. సాధారణంగా తల్లిదండ్రులకు ఈ కార్యకలాపాల గురించి తెలియదని, కొంతమంది ఓడబ్ల్యూజీలు కుటుంబంతోనే కలిసి ఉంటూ గ్రానెడ్లు విసరడం, కాల్పులకు పాల్పడటం వంటి ఉగ్రవాద తరహా నేరాలకు పాల్పడతారని పేర్కొన్నాయి.




పటిష్టంగా మారిన ఆస్ట్రేలియా జట్టు.. ఎందుకో తెలుసా..?

సీఎం కేసీఆర్ లోని మార్పుకు ఆ ఇద్దరే కారణమా ?

న్యాయం జరిగే వరకు ప్రొద్దుటూరులో దీక్ష చేస్తా: నారా లోకేశ్

కరోనా వైరస్ ఆడదా? ఈ లెక్కలు చూస్తే అదే అనిపిస్తోంది!

వ్యాక్సిన్ కి మేము రెడీ... కేంద్రానికి ఏపీ నివేదిక

కొత్త సంవత్సరం రోజున కేంద్రం గుడ్ న్యూస్ చెప్తుందా...?

త్రివిక్రమ్‌కు నో చెప్పిన జూనియర్ ఎన్టీఆర్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>