PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrb6f77ece-2884-45b2-99ed-64996cf3ae3c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrb6f77ece-2884-45b2-99ed-64996cf3ae3c-415x250-IndiaHerald.jpgగత కొన్ని రోజులుగా వరుసగా వీస్తున్న వ్యతిరేక గాలుల ప్రభావమో ఏమో కానీ కేసీఆర్ లో చాల మార్పు వచ్చిందని అంటున్నారు. ఊహించని విధంగా వస్తున్న ఈ మార్పు పై చాలామంది సంతోష వ్యక్తం చేస్తున్న ఓటమి భయంతోనే ప్రజలకు వరాలు ప్రకటిస్తున్నారని మాత్రం అంటున్నారు.. కేసీఆర్ కి ఇప్పుడు తెలంగాణ లో పరిస్థితులు అనుకూలంగా లేవు.. దుబ్బాక ఎలక్షన్స్ నుంచి అన్ని చేదు అనుభవాలే మిగులుతున్నాయి. క్రమక్రమంగా పార్టీ బలం తగ్గుతుందని స్పష్టంగా తెలుస్తుంది.. ఈ నేపథ్యంలో కేసీఆర్ పార్టీ ని మరింత వీక్ కాకుండా చూసుకోవాలి కానీ అయన కొన్నిkcr;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;rtc;strike;election;partyకేసీఆర్ ని మళ్ళీ ప్రజలు నమ్ముతున్నారా..అందుకే మార్పు..?కేసీఆర్ ని మళ్ళీ ప్రజలు నమ్ముతున్నారా..అందుకే మార్పు..?kcr;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;rtc;strike;election;partyWed, 30 Dec 2020 09:11:35 GMTకేసీఆర్ లో చాల మార్పు వచ్చిందని అంటున్నారు. ఊహించని విధంగా వస్తున్న ఈ మార్పు పై చాలామంది సంతోష వ్యక్తం చేస్తున్న ఓటమి భయంతోనే ప్రజలకు వరాలు ప్రకటిస్తున్నారని మాత్రం అంటున్నారు.. కేసీఆర్ కి ఇప్పుడు తెలంగాణ లో పరిస్థితులు అనుకూలంగా లేవు.. దుబ్బాక ఎలక్షన్స్ నుంచి అన్ని చేదు అనుభవాలే మిగులుతున్నాయి. క్రమక్రమంగా పార్టీ బలం తగ్గుతుందని స్పష్టంగా తెలుస్తుంది.. ఈ నేపథ్యంలో కేసీఆర్ పార్టీ ని మరింత వీక్ కాకుండా చూసుకోవాలి కానీ అయన కొన్ని చర్యల ద్వారాప్రజల్లో నమ్మకం కోసం చూస్తునారు..

ఇప్పటికే బీజేపీ బలం పుంజుకుంది. బీజేపీ పుంజుకుంది అంటే తెరాస పార్టీ పెంచేలా చేసింది అనాలి..  దాన్ని అడ్డుకుని తెరాస పార్టీ బలపడాలంటే మాత్రం తప్పకుండా ప్రజలకు, కొన్ని సంఘాలకు వారలు ప్రకటించాలి అందుకు తగ్గట్లే ఉద్యోగులకు జీతాలు పెంచి వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు కొద్ది రోజుల నుంచి కేసీఆర్ వివిధ వర్గాలు ఉబ్బిపోయే ప్రకటనలు చేస్తున్నారు. ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా చూస్తున్న పీఆర్పీ విషయాన్ని కూడా వెలుగులోకి తెచ్చారు. మామూలుగా అయితే.. కరోనా కాలంలో ఎలాంటి పీఆర్సీ ఇచ్చే పరిస్థితి లేదని.. సంకేతాలు గతంలో ఇచ్చారు. కానీ ఇప్పుడు ఉద్యోగుల వేతనాలు పెంచాలని నిర్ణయించేశారు.

అంతటితో ఆగలేదు.. ఉద్యోగ విరమణ వయస్సును కూడా పెంచారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు… వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు వారికీ వరాలు ప్రకటిస్తున్నారు. ఆర్టీసీలో కూడా వేతనాలను పెంచి..ఆ భారాన్ని ఆర్టీసీ కాకుండా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించారు. కేసీఆర్ అనూహ్య నిర్ణయాలపై ప్రజల్లో అనుమానాలున్నాయి. అవి అమలవుతాయా లేదా అన్న సందేహాలున్నాయి. ఎందుకంటే.. కేసీఆర్ ఏ నిర్ణయమైనా కారణం లేకుండా తీసుకోరు. ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉపఎన్నికల నేపధ్యంలో… దిగజారిపోయిన తన రాజకీయ పరిస్థితిని మెరుగుపర్చుకోవడానికి ఈ పాచికలన్నీ వేస్తున్నారన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇవన్నీ కార్యరూపం దాల్చిన తర్వాతే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది. స్వయంగా ఈ పరిస్థితిని కేసీఆరే కల్పించుకున్నారు. 


రేవంత్ రెడ్డి కోసం రంగంలోకి దిగింది ఎవరు...?

కమలానికి కలిసొచ్చిన కరోనా కాలం!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాడి దింపేసిన తలైవా..కూతుర్ల ఫిట్టింగ్ ?

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్

బాక్సింగ్ డే టెస్టు విజయం టీమిండియాకు ప్రత్యేకం

ఇక నుంచి కార్లలో అవి తప్పనిసరి.. త్వరలో కేంద్రం ఆదేశాలు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>