PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandra-babu7120a5d0-b479-47b3-8949-5bc8a3b5dcd3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandra-babu7120a5d0-b479-47b3-8949-5bc8a3b5dcd3-415x250-IndiaHerald.jpgవిజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం విష‌యాన్ని తీసుకుంటే.. ఇక్క‌డ పార్టీకి బ‌ల‌మైన కార్య‌వ‌ర్గం ఉంది. విజ‌యవాడ సిటీ టీడీ పీ అధ్యక్షుడు బుద్దా వెంక‌న్న ఈ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నాయ‌కుడే. అదేవిధంగా పార్టీలో కీల‌కంగా ఉన్న నాగుల్ మీరా స‌హా చాలా మంది నా య‌కులు కూడా ఇక్క‌డ టీడీపీ త‌ర‌ఫున ఉన్నారు. పైగా బుద్దా వెంక‌న్న దేవినేని వ‌ర్గంగా.. నాగుల్ మీరా.. త‌దిత‌రులు కేశినేని నాని వ‌ర్గం చ‌లా మ‌ణి అవుతున్నారు. దీంతో ఎవ‌రిలోనూ క‌లివిడి లేకుండా పోయింది. ఇక‌, గ‌త ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలోకి వ‌చ్చి న ప‌శ్చిమ chandra babu;nani;meera;naga;devineni avinash;naga aswin;kesineni nani;mla;letter;service;tdp;buddha venkanna;nagul meera;partyబాబు నిర్లక్ష్యం.. త‌మ్ముళ్ల అవ‌కాశ వాదం.. ఆ నియోజ‌క‌వ‌ర్గానికి శాపమా..?బాబు నిర్లక్ష్యం.. త‌మ్ముళ్ల అవ‌కాశ వాదం.. ఆ నియోజ‌క‌వ‌ర్గానికి శాపమా..?chandra babu;nani;meera;naga;devineni avinash;naga aswin;kesineni nani;mla;letter;service;tdp;buddha venkanna;nagul meera;partyWed, 30 Dec 2020 12:55:48 GMTటీడీపీ అధినేత‌గా చంద్ర‌బాబు ఇటీవ‌ల కాలంలో తీసుకుంటున్న కీల‌క నిర్ణ‌యాలు పార్టీని న‌డిపిస్తాయ‌ని.. ప‌రుగులు పెట్టిస్తాయ ని అంద‌రూ అనుకుంటున్నారు. చంద్ర‌బాబు సైతం అదే భావిస్తున్నారు. పార్టీ దూసుకుపోయే క్ర‌తువులో ఏం చేయాలో అదే చేస్తున్నారు. ప‌ద‌వులు ఇచ్చారు. అంద‌రికీ అన్నీ.. అనే ధోర‌ణిలో పార్టీలో ప‌దువులు పందేరం చేశారు. దీంతో పార్టీలో నూత‌నో త్తేజం వ‌స్తుంద‌ని అనుకున్నారు. స‌రే.. ఈ విష‌యంలో బాబు అనుకున్న ల‌క్ష్యం నెరవేర్చుకున్నారా?  లేదా? అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల విష‌యంలో చేస్తున్న మితిమీరిన నిర్ల‌క్ష్యం మాత్రం పార్టీని తీవ్ర‌స్థా యిలో బ‌ల‌హీన ప‌రుస్తోంద‌ని అంటున్నారు టీడీపీ సానుభూతిప‌రులు.

విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం విష‌యాన్ని తీసుకుంటే.. ఇక్క‌డ పార్టీకి బ‌ల‌మైన కార్య‌వ‌ర్గం ఉంది. విజ‌యవాడ సిటీ టీడీ పీ అధ్యక్షుడు బుద్దా వెంక‌న్న ఈ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నాయ‌కుడే. అదేవిధంగా పార్టీలో కీల‌కంగా ఉన్న నాగుల్ మీరా స‌హా చాలా మంది నా య‌కులు కూడా ఇక్క‌డ టీడీపీ త‌ర‌ఫున ఉన్నారు. కానీ, నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం పార్టీ వాయిస్ వినిపించే వా రు ఒక్క‌రంటే ఒక్కరు కూడా క‌నిపించ‌డం లేదు. గ‌తంలో చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు.. నాగుల్ మీరా పోలీసు హౌసింగ్ సొసైటీ చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించారు. అదేవిధంగా బుద్దా వెంక‌న్న ఎమ్మెల్సీగా అవ‌కాశం అందిపుచ్చుకున్నారు. మ‌రికొంద‌రు కూడా ఇలానే చిన్నిపాటి ప‌ద‌వులు సొంతం చేసుకున్నారు.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రిస్థితి ఏంటి? త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని నిల‌బెట్టేందుకు వీరు చేస్తు న్న ప్ర‌య‌త్నాలు ఏమీ క‌నిపించ‌డం లేదు. పైగా బుద్దా వెంక‌న్న దేవినేని వ‌ర్గంగా.. నాగుల్ మీరా.. త‌దిత‌రులు కేశినేని నాని వ‌ర్గం చ‌లా మ‌ణి అవుతున్నారు. దీంతో ఎవ‌రిలోనూ క‌లివిడి లేకుండా పోయింది. ఇక‌, గ‌త ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలోకి వ‌చ్చి న ప‌శ్చిమ మాజీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ప‌ట్టుబ‌ట్టి టికెట్ తెచ్చుకుని కుమార్తెను రంగంలోకి దింపారు.

అయితే.. ఆమె ఓడిపోయారు. నిజానికి తాను ఓడిపోయినా.. ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు ఇక్క‌డ ఉంటాన‌ని చెప్పిన ఖ‌తూన్‌.. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన రాత్రే అమెరికాకు వెళ్లిపోయార‌ని టాక్‌. ఇక‌, జ‌లీల్ త‌న అనారోగ్య స‌మ‌స్య‌తో రాజ‌కీయంగా దూరంగా ఉన్నారు. దీంతో ప‌శ్చిమ‌లో నాయ‌కులు ఉన్నా.. ఎవ‌రి స్వార్థం వారిదే.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌, నాయ‌కులు ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నా.. చంద్ర‌బాబు ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేకుండా పోవ‌డం ఆయ‌న నిర్ల‌క్ష్యంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.




"వెల్లుల్లి పొట్టు "తో తెల్లని జుట్టు మటుమాయం!

'తెలుసా మనసా' ను అసలు ఇదేం పాట అంటూ రిజెక్ట్ చేసింది ఎవరో తెలుసా..?

ఘోర ఓటమి తో పాటు.. ఆస్ట్రేలియాకు మరో రెండు ఎదురు దెబ్బలు..?

తెలుగు రాష్ట్రాలలోకి వచ్చేసిన కొత్త కరోనా... గోదావరి జిల్లాలో చుక్కలు

నేడు రణ్‌బీర్‌తో అలియా భట్ నిశ్చితార్థం?

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

కుక్క తోక వంకరే.. గత 18 ఏళ్లలో పాకిస్తాన్ మొదటి సారి ఇలా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>