Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/yasaswi3f591ada-6c37-42cc-9c0a-f0032df8680c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/yasaswi3f591ada-6c37-42cc-9c0a-f0032df8680c-415x250-IndiaHerald.jpgసరిగమప ఫేమ్ యశస్వి పాడిన తొలి సినిమా సాంగ్ ఈ రోజు విడుదలైంది. ‘మైల్స్ ఆఫ్ లవ్ చిత్రంలోని ‘గగనము దాటే’ అనే ఈ సాంగ్ అద్భుతంగా ఉందని దిల్ రాజు అన్నారు. యశస్విని మెచ్చుకున్నారు. ఈ చిత్రానికి ఆర్ ఆర్ ధ్రువన్ సంగీతం అందించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాట మార్కెట్లో..yasaswi;view;watch;adhithya;dil raju;geetha;ram pothineni;ramya;ramya krishnan;ravi anchor;venu;cinema;sangeetha;hushaaru;youtube;producer;king;love;director;turmeric;producer1;success;v;yashasvi jaiswal;dil;venu thottempudi;anandam;chitramయశస్వి పాడిన తొలి సినిమా పాట.. దిల్ రాజు చేతుల మీదుగా...యశస్వి పాడిన తొలి సినిమా పాట.. దిల్ రాజు చేతుల మీదుగా...yasaswi;view;watch;adhithya;dil raju;geetha;ram pothineni;ramya;ramya krishnan;ravi anchor;venu;cinema;sangeetha;hushaaru;youtube;producer;king;love;director;turmeric;producer1;success;v;yashasvi jaiswal;dil;venu thottempudi;anandam;chitramWed, 30 Dec 2020 20:36:21 GMTఇంటర్నెట్ డెస్క్: సరిగమప ఫేమ్ యశస్వి పాడిన తొలి సినిమా సాంగ్ ఈ రోజు విడుదలైంది. ‘మైల్స్ ఆఫ్ లవ్ చిత్రంలోని ‘గగనము దాటే’ అనే ఈ సాంగ్ అద్భుతంగా ఉందని దిల్ రాజు అన్నారు. యశస్విని మెచ్చుకున్నారు. ఈ చిత్రానికి ఆర్ ఆర్ ధ్రువన్ సంగీతం అందించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాట మార్కెట్లో విడుదల చేశారు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి నందన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రాజిరెడ్డి నిర్మించగా.. ‘హుషారు’ ఫేం అభినవ్ మేడిశెట్టి హీరోగా నటించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రమ్య పసుపులేటి నటిస్తోంది.

పాట విడుదల చేసిన తరువాత నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ''హుషారులో చక్కటి నటనతో ఆకట్టుకున్న అభినవ్, రమ్య కాంబినేషన్‌లో కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లో ఈ చిత్రం రావడం, అది కూడా మా రాజిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం ఆనందంగా ఉంది. ‘మైల్స్ ఆఫ్ లవ్’ చిత్రంలో ఫస్ట్ సాంగ్ 'గగనము దాటే' సాంగ్ లాంచ్ చేశాను. యశస్వి ఫెంటాస్టిక్‌ సింగర్. అద్భుతంగా పాడాడు. విజువల్స్ అమోఘంగా ఉన్నాయి. డైరెక్టర్ నందన్ సాంగ్ పిక్చరైజేషన్ మెచ్చుకోదగినది. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అలాగే మా రాజిరెడ్డి మరిన్ని మంచి చిత్రాలు తీయాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.." అన్నారు.

దర్శక,నిర్మాతలు కూడా ఈ చిత్రంపై, తొలి పాటపై పాడారు. ప్రెజెంట్ యూత్‌కి నచ్చే ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో రామ్ కామ్ బ్యాక్‌డ్రాప్‌లో 'మైల్స్ ఆఫ్‌ లవ్' చిత్రాన్ని రూపొందించాం. అభినవ్, రమ్య పెయిర్ చాలా బాగా కుదిరింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కోపరేట్ చేసి సినిమా బాగా రావడానికి హెల్ప్ చేశారు. ఆల్ రెడీ డైరెక్ట్ గా రిలీజ్ చేసిన ప్రోమోకి రెండు మిలియన్స్ వ్యూస్ వచ్చాయి.. ధ్రువన్ ఎక్సలెంట్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ దిల్ రాజు గారు లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.

దిల్ రాజుగారు, బెక్కం వేణుగోపాల్‌గారు మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. రవి మణి కే నాయుడు అందించిన విజువల్స్ చాలా బాగుంటాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జనవరిలో టీజర్ విడుదల చేస్తాం. దానితో పాటే ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తాం. ఫిబ్రవరిలో సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుందనే గట్టి నమ్మకం మాకుంది. మీరు కూడా మా సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాం'' అని అన్నారు.

" style="height: 370px;">




ఫైజర్ టీకా ఫెయిల్?.. వ్యాక్సిన్ తీసుకున్న నర్సుకు కరోనా!

జగన్ పై ప్రజల్లో కోపం ఎందుకు పెరుగుతుంది...?

షాకింగ్: కోదండ రాంతో కేసీఆర్ స్నేహం

కరోనా నుంచి కోలుకోవాలని నీళ్లు తాగాడు.. ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు...

రామ మందిర నిర్మాణంపై ఆసక్తికర విషయం..!

యూకే వైరస్ తో జర భద్రం పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి

జనవరి 8న కేజీఎఫ్-2 ట్రైలర్.. ఆ డేట్ ఎందుకంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>