MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ranbirkapoora25f2900-8258-4623-888c-26eb46c321b3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ranbirkapoora25f2900-8258-4623-888c-26eb46c321b3-415x250-IndiaHerald.jpgబాలీవుడ్‌ నటులు రణ్‌బీర్ కపూర్, అలియా భట్ మధ్య ప్రేమాయణం సంగతి కొత్త విషయమేమి కాదు. కరోనా మహమ్మారి లేకుంటే వీరిద్దరి పెళ్లి కూడా ఈ పాటికే అయిపోయి ఉండేది. అయితే కరోనా మహమ్మారి కారణంగా వీరి వివాహం వాయిదా పడుతూ వస్తోంది. కానీ.. ఇప్పుడు మాత్రం వీరిద్దరూ పెళ్లికి సిద్దమైపోయినట్టు తెలుస్తోందిranbirkapoor;mahesh;aadar jain;alia bhatt;ayan mukerji;karan johar;mahesh bhatt;neetu singh;ranbir kapoor;ranveer singh;mumbai;bollywood;media;marriage;director;pink;allu ayaan;jaipurనేడు రణ్‌బీర్‌తో అలియా భట్ నిశ్చితార్థం?నేడు రణ్‌బీర్‌తో అలియా భట్ నిశ్చితార్థం?ranbirkapoor;mahesh;aadar jain;alia bhatt;ayan mukerji;karan johar;mahesh bhatt;neetu singh;ranbir kapoor;ranveer singh;mumbai;bollywood;media;marriage;director;pink;allu ayaan;jaipurWed, 30 Dec 2020 11:33:06 GMTఅలియా భట్ మధ్య ప్రేమాయణం సంగతి కొత్త విషయమేమి కాదు. కరోనా మహమ్మారి లేకుంటే వీరిద్దరి పెళ్లి కూడా ఈ పాటికే అయిపోయి ఉండేది. అయితే కరోనా మహమ్మారి కారణంగా వీరి వివాహం వాయిదా పడుతూ వస్తోంది. కానీ.. ఇప్పుడు మాత్రం వీరిద్దరూ పెళ్లికి సిద్దమైపోయినట్టు తెలుస్తోంది. అలియా భట్ తన ప్రియుడు రణబీర్‌ను పెళ్లాడేందుకు సిద్దమైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నేడే వీరి నిశ్చితార్థం కూడా జరగనున్నట్టు తెలుస్తోంది. ప్రియుడు రణబీర్ కపూర్‌తో అలియా భట్ నిశ్చితార్థం జైపూర్‌లోని రణతంబోర్‌లో జరగనుందని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ నిశ్చితార్థానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని వార్తలు వస్తున్నాయి.

దీనికి మరింత బలం చేకూరేలా రణబీర్ కపూర్, అలియా భట్ మంగళవారం ఉదయం ముంబై విమానాశ్రయంలో కనిపించారు. వీరితో పాటు రణబీర్ తల్లి నీతు సింగ్ కూడా కనిపించారు. వీరంతా కలిసి ముంబై నుంచి జైపూర్ బయలుదేరారు. వీరు వెళ్లిన వెంటనే ముంబై నుంచి జైపూర్‌‌కు రణవీర్ సింగ్ -దీపికా పదుకొనే జంట కూడా వెళ్లడం ఆశ్చర్యం. ఈ జంట కూడా వెళ్లడంతో వారి నిశ్చితార్థం పక్కా అని చెప్పుకుంటున్నారు. ఇక వీరు మాత్రమే కాదు.. `బ్రహ్మాస్త్ర` డైరెక్టర్ అయాన్ ముఖర్జీ కూడా జైపూర్‌లోనే ఉన్నారు. బ్రహ్మాస్త్ర చిత్రీకరణ కోసం పింక్ సిటీకి ఆయన వెళ్లుంటారని మొదట అందరూ అనుకున్నారు.

కానీ.. ఆయన వెళ్లింది రణ్‌బీర్, అలియా నిశ్చితార్థానికని ప్రచారం సాగుతోంది. ఇక మహేష్ భట్,  రిద్దిమా కపూర్, ఆదర్ జైన్, కరణ్ జోహార్ వంటి ప్రముఖులు కూడా జైపూర్‌కు బయలుదేరనున్నట్టు తెలుస్తోంది. ఇంతమంది జైపూర్‌లో ప్రత్యక్షమవుతోంటే నిశ్చితార్థం కాకపోతే మరేంటంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మరోపక్క వీరంతా న్యూ ఇయర్ హాలిడేకు వెళ్తున్నారంటూ కూడా ప్రచారం సాగుతోంది. అయితే అలియా, రణ్‌బీర్ దగ్గర చుట్టాలు, స్నేహితులు కూడా జైపూర్ వెళ్తుండటంతో ఇది న్యూ ఇయర్ వేడుక కోసం కాదు నిశ్చితార్థం కోసమేనని అర్థమవుతోంది. 


ఈ పాపం నిన్ను ఊరికే వదలదు: నారా లోకేష్

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

కుక్క తోక వంకరే.. గత 18 ఏళ్లలో పాకిస్తాన్ మొదటి సారి ఇలా..?

కరోనా వ్యాక్సిన్.. ఇలా చేస్తే ఖాతా ఖాళీ.?

తమిళనాట కొత్త సీఎం ఆయనే ?

అమెరికా అమ్మాయి.. మలయాళం పాఠాలు నేర్పుతోంది

ఐటీఆర్ దాఖలుకు రేపే ఆఖరు.... దాటితే భారీ జరిమానా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>