PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/karanam-balaram-mark-on-chirala-constituency-85cfe1e2-eb52-4b54-a7e6-ae9ba7f7fbfe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/karanam-balaram-mark-on-chirala-constituency-85cfe1e2-eb52-4b54-a7e6-ae9ba7f7fbfe-415x250-IndiaHerald.jpgప్ర‌కాశం జిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌ని .. స్థానికులు గ‌గ్గోలు పెడుతున్నారు. తామెన్నో ఆశ‌లు పెట్టుకుని.. సీనియ‌ర్ నాయ‌కుడైన క‌ర‌ణం బ‌ల‌రాంను గెలిపించామ‌ని.. ఆయ‌న అద్దంకి నుంచి వ‌చ్చి.. ఇక్క‌డ పోటీ చేసినా.. క‌డుపులో పెట్టుకుని చూస్తార‌నే ఆశ‌తో ఆయ‌న‌కు ఓట్లు వేశామ‌ని.. ఇక్క‌డి ప్ర‌జ‌లు చెబుతున్నారు. అయితే.. గ‌డిచిన ఏడాదిన్న‌ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క త‌ట్టెడు మ‌ట్టి కూడా నియోజ‌క‌వ‌ర్గంలో వేయ‌లేద‌ని, గ‌తంలో ప్రారంభించి, ఎన్నిక‌ల కోడ్‌తో నిలిపివేసిన కార్య‌క్ర‌మాలు కkaranam balarm;district;media;tdp;local language;chirala;ycp;addankiనియోజ‌క‌వ‌ర్గంపై క‌ర‌ణం మార్కు రాజ‌కీయం.. అందుకే అభివృద్ధికి దూర‌మా..?నియోజ‌క‌వ‌ర్గంపై క‌ర‌ణం మార్కు రాజ‌కీయం.. అందుకే అభివృద్ధికి దూర‌మా..?karanam balarm;district;media;tdp;local language;chirala;ycp;addankiWed, 30 Dec 2020 04:00:00 GMTజిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌ని .. స్థానికులు గ‌గ్గోలు పెడుతున్నారు. తామెన్నో ఆశ‌లు పెట్టుకుని.. సీనియ‌ర్ నాయ‌కుడైన క‌ర‌ణం బ‌ల‌రాంను గెలిపించామ‌ని.. ఆయ‌న అద్దంకి నుంచి వ‌చ్చి.. ఇక్క‌డ పోటీ చేసినా.. క‌డుపులో పెట్టుకుని చూస్తార‌నే ఆశ‌తో ఆయ‌న‌కు ఓట్లు వేశామ‌ని.. ఇక్క‌డి ప్ర‌జ‌లు చెబుతున్నారు. అయితే.. గ‌డిచిన ఏడాదిన్న‌ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క త‌ట్టెడు మ‌ట్టి కూడా నియోజ‌క‌వ‌ర్గంలో వేయ‌లేద‌ని, గ‌తంలో ప్రారంభించి, ఎన్నిక‌ల కోడ్‌తో నిలిపివేసిన కార్య‌క్ర‌మాలు కూడా ముందుకు సాగ‌డం లేద‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు చెబుతున్నారు.

``రాజ‌కీయాల్లో మీరు ఎలా ఉంటారో మీ ఇష్టం. కానీ, అభివృద్ధి ప‌రంగా.. మ‌మ్మ‌ల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు ?  మీ రాజ‌కీయాలు మీరు చూసుకోండి. నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేయండి!`` అని ఇక్క‌డి ప్ర‌జ‌లు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ గ‌ళాన్ని వినిపిస్తున్నారు. ఇక‌, గ‌తంలో మ‌త్స్య‌కారుల కోసం ఏర్పాటు చేసిన షెడ్లు.. కొన్ని పూర్త‌యినా.. ఇప్పుడు పూర్తికావాల్సిన షెడ్లు ప‌దుల సంఖ్య‌లో ఉన్నాయి. అదేవిధంగా కూర‌గాయ‌ల మార్కెట్ల‌ను రెండు నిర్మిస్తామ‌ని చెప్పిన ఆమంచి.. ఒక‌టి పూర్తి చేశారు. కానీ, మ‌రొక‌టి.. శంకుస్థాప‌న ద‌శ‌లోనే ఆగిపోయింది. దీంతో ఆయా ప్రాజెక్టులు పూర్తి చేయాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

అదేవిధంగా ఇంటింటికీ తాగునీరు స‌ర‌ఫ‌రా చేస్తామ‌న్న హామీ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర్చ‌లేక పోయార‌ని.. ఇక్క‌డి ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. క‌ర‌ణం ఎమ్మెల్యేగా ఎన్నికై.. ఏడాదిన్న‌ర పూర్తయినా.. ఇప్ప‌టి వ‌రకు ఏ ఒక్క ప‌నీ ప్రారంభించ‌లేదు. పోనీ.. టీడీపీ నుంచి వ‌చ్చారు క‌నుక వైసీపీ ప్ర‌భుత్వం నిధులు ఇవ్వ‌డం లేదా? అంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఇటా జంప్ చేసిన ముగ్గురు ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో అభివృద్ధి పుంజుకుంది. వారంతా కూడా ప్ర‌భుత్వంలో చ‌ర్చించి నిధులు తెచ్చుకుంటున్నారు. కానీ, క‌ర‌ణం మాత్రం.. ఇక్క‌డ అభివృద్ధి చేసినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ వ‌స్తుందో రాదో.. అనే `దుర‌దృష్టి`తో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.




హెరాల్డ్ ఎడిటోరియల్ : కాడి దింపేసిన తలైవా..కూతుర్ల ఫిట్టింగ్ ?

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్

బాక్సింగ్ డే టెస్టు విజయం టీమిండియాకు ప్రత్యేకం

ఇక నుంచి కార్లలో అవి తప్పనిసరి.. త్వరలో కేంద్రం ఆదేశాలు!

కొత్త ఏడాది భయంకరమైన పోటీ ?

కొత్తరకం వైరస్ పై కీలకమైన ప్రకటన చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>