WomenP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/america-woman-teaching-malayalam-classes-to-europeans64bf5f1a-9bfb-4090-998d-f39f89f318b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/america-woman-teaching-malayalam-classes-to-europeans64bf5f1a-9bfb-4090-998d-f39f89f318b5-415x250-IndiaHerald.jpgఅమెరికా అమ్మాయి కేరళ భాషను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నేర్పుతోంది. అమెరికా అమ్మాయేంటి.. మన దేశానికి సంబంధించిన భాషనే నేర్పడమేంటని అనుకుంటున్నారా? అయితే ఆమె గురించి తెలుసుకుందాం రండి.. అపర్ణ మల్బరీ అనే యువతి తల్లిదండ్రులు జీవిత అర్థం గురించి శోధిస్తూ ఆధ్యాత్మిక గురువు కోసం గతంలో ఇండియాకు వచ్చారు. aparna;aparna;jeevitha rajaseskhar;kerala;india;american samoa;marriage;sanskrit;girl;father;mulberryఅమెరికా అమ్మాయి.. మలయాళం పాఠాలు నేర్పుతోందిఅమెరికా అమ్మాయి.. మలయాళం పాఠాలు నేర్పుతోందిaparna;aparna;jeevitha rajaseskhar;kerala;india;american samoa;marriage;sanskrit;girl;father;mulberryWed, 30 Dec 2020 10:30:00 GMTఅమెరికా అమ్మాయి కేరళ భాషను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నేర్పుతోంది. అమెరికా అమ్మాయేంటి.. మన దేశానికి సంబంధించిన భాషనే నేర్పడమేంటని అనుకుంటున్నారా? అయితే ఆమె గురించి తెలుసుకుందాం రండి.. అపర్ణ మల్బరీ అనే యువతి తల్లిదండ్రులు జీవిత అర్థం గురించి శోధిస్తూ ఆధ్యాత్మిక గురువు కోసం గతంలో ఇండియాకు వచ్చారు. ఇండియా వచ్చిన తరువాతే వారిద్దరూ తొలిసారి కలిశారు. అలా వారి మధ్య పరిచయం పెరగడం.. పరిచయం ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకున్నారు. తరువాత అమెరికా వెళ్లిపోయాక అక్కడ అపర్ణ పుట్టింది. మళ్లీ ఇండియాకు వచ్చి కేరళలోని మాతా అమృతానందమయి అనే ఆధ్యాత్మిక గురువు వద్ద పాఠాలు నేర్చుకున్నారు. అపర్ణకు మూడేళ్ల నుంచి 15 ఏళ్లు వచ్చే వరకు కేరళలోనే ఉన్నారు.

దీంతో అపర్ణకు కేరళ వాతావరణం అలవాటైపోయింది. ఆ తరువాత అమెరికా వెళ్లిపోయినా అక్కడ ఉండలేకపోయింది. ఇక్కడి సంస్కృతిని వదల్లేకపోయింది. అందుకని ఆరు నెలల క్రితం ఇన్‌వర్టెడ్ కోకోనట్ పేరుతో ఇన్‌స్టాగ్రమ్ ఖాతాను తెరిచింది. మలయాళం ఎంతో స్పష్టంగా మాట్లాడగలదు కాబట్టి.. ఇప్పుడు యూరోపియన్లకు ఈ భాషను నేర్పుతోంది. అపర్ణ కేరళలో పెరిగినా పాఠశాలలో సంస్కృత భాషను తన లాంగ్వేజ్‌గా ఎంచుకుంది. అయినప్పటికి మలయాళం నేర్చుకోవాలనే ఆత్రుతతో స్నేహితుల సహాయంతో  మలయాళం భాషను అపర్ణ నేర్చుకుంది. ఆమె చదివింది ఇంగ్లీష్‌ మీడియం అయినా స్నేహితులందరూ ఆమెతో మలయాళంలోనే మాట్లాడేవారు. అలా అపర్ణకు మలయాళం బాగా వంటబట్టింది.

‘నా భారతీయ సంస్కృతీ మూలాలను వదులుకోవద్దన్నారు మా నాన్న.  అంతేకాదు నా అసలైన ఉనికిని పోగొట్టు కోవద్దన్నారు. అలా నాకు ఆయన మార్గనిర్దేశం చేశారు’ అని అపర్ణ చెబుతోంది. ఈ కారణంగానే అపర్ణ అమెరికాలో ఉన్నప్పటికి తన మలయాళం భాషను, భారతీయ సంస్కృతిని వదలకుండా ముందుకు పోతోంది. అపర్ణ పేరు నిజానికి శైషా. అయితే ఆరేడేళ్ల వయసులో ఆమె పేరును శైషా నుంచి అపర్ణగా మార్చారు.  


రష్మి గౌతమ్‌కు అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్..!?

తమిళనాట కొత్త సీఎం ఆయనే ?

ఐటీఆర్ దాఖలుకు రేపే ఆఖరు.... దాటితే భారీ జరిమానా!

'కోవాగ్జిన్' కొత్తరకం కరోనా స్ట్రెయిన్ పై కూడా పనిచేస్తుంది - భారత్ బయోటెక్

ఆరోజు అందుకే అలా మాట్లాడాను - డాక్టర్ సుధాకర్

కమలానికి కలిసొచ్చిన కరోనా కాలం!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాడి దింపేసిన తలైవా..కూతుర్ల ఫిట్టింగ్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>