MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/filmy-news36f68414-db88-4eed-b100-985b2c1bc50b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/filmy-news36f68414-db88-4eed-b100-985b2c1bc50b-415x250-IndiaHerald.jpgతమిళనాటా విశాల్,ఆర్య స్టార్ హీరోలుగా తమ సత్తా నిరూపించుకున్నవారే ఇద్దరికీ కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఈ తమిళ హీరోలు ఇద్దరు కలిసి ఒక చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మల్టీస్టారర్ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. filmy news;kumaar;anand malayalam actor;anand shankar;arya;shankar;vinod kumar;vishal krishna;cinema;tamil;letter;anand deverakonda;aryaaడూప్ లేకుండా స్టంట్స్ చేస్తున్న స్టార్ హీరోలు ..!!డూప్ లేకుండా స్టంట్స్ చేస్తున్న స్టార్ హీరోలు ..!!filmy news;kumaar;anand malayalam actor;anand shankar;arya;shankar;vinod kumar;vishal krishna;cinema;tamil;letter;anand deverakonda;aryaaWed, 30 Dec 2020 06:00:00 GMTతమిళనాటా విశాల్,ఆర్య స్టార్ హీరోలుగా తమ సత్తా నిరూపించుకున్నవారే ఇద్దరికీ కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఈ  తమిళ హీరోలు ఇద్దరు కలిసి ఒక చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మల్టీస్టారర్ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.

చిత్రీకరణలో భాగంగా విశాల్, ఆర్యలతో ఒక హెవీ యాక్షన్ సీన్ ప్లాన్ చేశారు టీమ్. ఇద్దరు హీరోలు సీన్లో పాల్గొంటున్నారు.అయితే ఈ ఇద్దరు హీరోలు ఎలాంటి డూప్ లేకుండానే స్టంట్స్ చేస్తున్నారు. సినిమాలో పోరాట సన్నివేశాలు సహజంగా రావలనే ఉద్దేశంతో ఈ ఇద్దరు హీరోలు ఎలాంటి డూప్ లేకుండా స్టంట్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ క్రమంలో ఆర్య ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో ఆయనకు పెద్ద గాయమే అయినట్టు తెలుస్తోంది ప్రమాదం జరిగిన వెంటనే టీమ్ ఆర్యను దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

 చికిత్స అనంతరం ఆర్య తిరిగి సెట్లోకి అడుగుపెట్టారట. మొదలుపెట్టిన యాక్షన్ సీన్ కంప్లీట్ చేశాకే ప్యాకప్ చెప్పారట. వినోద్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ఎనిమీ’ అనే టైటిల్ నిర్ణయించారు. గతంలో ఆర్య, విశాల్ కలిసి బాల దర్శకత్వంలో చేసిన ‘అవన్ ఇవన్’ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అందుకే ‘ఎనిమీ’ మీద తమిళ సినీ జనంలో మంచి అంచనాలున్నాయి. 


మనం తింటున్న పండ్లు ఎంతవరకు సురక్షితం..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాడి దింపేసిన తలైవా..కూతుర్ల ఫిట్టింగ్ ?

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్

బాక్సింగ్ డే టెస్టు విజయం టీమిండియాకు ప్రత్యేకం

ఇక నుంచి కార్లలో అవి తప్పనిసరి.. త్వరలో కేంద్రం ఆదేశాలు!

కొత్త ఏడాది భయంకరమైన పోటీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>