MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas7aecf142-26cc-4fb6-ac03-41d4eb725a83-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas7aecf142-26cc-4fb6-ac03-41d4eb725a83-415x250-IndiaHerald.jpgప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ సెట్స్ మీదకు తెస్తున్నాడు. కొత్త ఏడాది వస్తూనే ప్రభాస్ మూడు సినిమాల షూటింగునకు రెడీ అవుతున్నాడని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రాధే శ్యాం మూవీ కొత్త ఏడాదికి పూర్తి అవుతుందిట. ఆ తరువాత వెంటనే సలార్ మూవీ కోసం ప్రభాస్ మేకప్ వేసుకుంటాడు అంటున్నాడు. prabhas;prabhas;mohanlal;editor mohan;prasanth;prashanth neel;india;cinema;director;vijayadashami;makeup;kgf;prasanth neel;march;prashant kishorపెద్ద మీసాలతో...కండల వీరుడిగా ?పెద్ద మీసాలతో...కండల వీరుడిగా ?prabhas;prabhas;mohanlal;editor mohan;prasanth;prashanth neel;india;cinema;director;vijayadashami;makeup;kgf;prasanth neel;march;prashant kishorWed, 30 Dec 2020 12:00:00 GMTప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ సెట్స్ మీదకు తెస్తున్నాడు. కొత్త ఏడాది వస్తూనే ప్రభాస్  మూడు సినిమాల షూటింగునకు రెడీ అవుతున్నాడని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రాధే శ్యాం మూవీ కొత్త ఏడాదికి పూర్తి అవుతుందిట. ఆ తరువాత వెంటనే సలార్ మూవీ కోసం ప్రభాస్ మేకప్ వేసుకుంటాడు అంటున్నాడు.

కేజీఎఫ్ తో ఆల్ ఇండియా ఫేం సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ ఈ మూవీకి డైరెక్టర్. ఆయన ప్రభాస్ ని పూర్తిగా మార్చి  కొత్త గెటప్ లో చూపించబోతున్నాడుట. ఈ మూవీ కోసం రగ్డ్ ఫేస్ తో ప్రభాస్ కనిపిస్తాడని అంటున్నారు. ఈ మూవీలో ప్రభాస్ కండల వీరుడి అవతారం ఎత్తుతాడని కూడా చెబుతున్నారు. ఈ మూవీలోని ప్రభాస్ పాత్రకు తగినట్లుగా  ఆరు నుంచి ఎనిమిది కిలోల బరువు పెరుగుతాడు అంటున్నారు. అలాగే ప్రభాస్ పెద్ద మీసాలతో కనిపిస్తారని, లుక్ మొత్తం చేంజ్ అవుతుందని కూడా వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్ ప్రస్తుతం ఈ మేకోవర్ మీద దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు. సలార్ మూవీ భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ఈ మూవీ ఫుల్ ఆఫ్ యాక్షన్ అంటున్నారు. ఇందులో కాస్టింగ్ కూడా చాలా టాప్ లెవెల్లో ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే మోహన్ లాల్, రానలను ఈ మూవీ కోసం తీసుకున్నారు అని చెబుతున్నారు.

ఈ మూవీని ఖర్చుకు వెనకాడకుండా లావిష్ గా తీయడానికి ప్రశాంత్ నీల్ డిసైడ్ అయ్యాడని టాక్. శరవేగంగా ఈ మూవీని తీసి 2021లోనే థియేటర్లలోకి ఈ మూవీని తీసుకురావాలని కూడా ఆలోచన చేస్తున్నారు. ఈ మూవీ 2021 విజయదశమి కానుకగా రిలీజ్ అవుతుందని కూడా టాక్. మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ కి సలార్ ఫీవర్ వచ్చేసింది. ప్రశాంత్ నీల్ తమ హీరోను ఎలా చూపిస్తాడు అన్న ఇంటెరెస్ట్ వారిలో కలుగుతోంది. చూడాలి మరి పెద్ద మీసాల ప్రభాస్ ఎలా ఉంటాడో.




షూటింగ్ స్పాట్ లో సీరియస్ ఐన స్టార్ హీరో...!

ఘోర ఓటమి తో పాటు.. ఆస్ట్రేలియాకు మరో రెండు ఎదురు దెబ్బలు..?

తెలుగు రాష్ట్రాలలోకి వచ్చేసిన కొత్త కరోనా... గోదావరి జిల్లాలో చుక్కలు

నేడు రణ్‌బీర్‌తో అలియా భట్ నిశ్చితార్థం?

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

కుక్క తోక వంకరే.. గత 18 ఏళ్లలో పాకిస్తాన్ మొదటి సారి ఇలా..?

కరోనా వ్యాక్సిన్.. ఇలా చేస్తే ఖాతా ఖాళీ.?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>