PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajanikanthba378081-443e-46f7-8005-e8fc5255f592-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajanikanthba378081-443e-46f7-8005-e8fc5255f592-415x250-IndiaHerald.jpgతమిళ రాజకీయాలు ఎప్పుడు ఏ విధంగా మారుతున్నాయో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. న్యూ ఇయర్ రోజున తన కొత్త పార్టీ గురించి ప్రకటిస్తానంటూ చెప్పిన తలైవా రజినీకాంత్ అకస్మాత్తుగా రాజకీయాల్లోకి వచ్చేది లేదంటూ ఒక్కసారిగా షాకిచ్చారుrajanikanth;jayalalitha;tiru;vijay;palani;cinema;rajani kanth;tamil;cm;chief minister;chennai;hero;joseph vijay;dalapathi;master;partyరజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!rajanikanth;jayalalitha;tiru;vijay;palani;cinema;rajani kanth;tamil;cm;chief minister;chennai;hero;joseph vijay;dalapathi;master;partyWed, 30 Dec 2020 11:30:00 GMTతమిళ రాజకీయాలు ఎప్పుడు ఏ విధంగా మారుతున్నాయో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. న్యూ ఇయర్ రోజున తన కొత్త పార్టీ గురించి ప్రకటిస్తానంటూ చెప్పిన తలైవా రజినీకాంత్ అకస్మాత్తుగా రాజకీయాల్లోకి వచ్చేది లేదంటూ ఒక్కసారిగా షాకిచ్చారు. ఇక రజినీకాంత్ కథ ముగిస్తే ఇప్పుడు తమిళ రాజకీయాలు మొత్తం ఇళయదళపతి విజయ్ చుట్టూ తిరుగుతున్నాయి. విజయ్ రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తన ఫామ్ హౌస్‌లో అభిమాన సంఘాలతోనూ ఆయన భేటీ అయ్యారు. ఇప్పుడు విజయ్‌ హఠాత్తుగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామితో భేటీ అయ్యారు. ఈ భేటీ ఇప్పుటు రాజకీయ వర్గాల్లో, ఇటు కోలీవుడ్‌ లో విస్త్రృతంగా చర్చకు దారి తీసింది.

రాజకీయ రంగ ప్రవేశం కోసమే విజయ్ సీఎంతో చర్చించేందుకు భేటీ అయ్యారని విజయ్‌ వైరివర్గాలు చెబుతున్నాయి. మరోపక్క సంక్రాంతికి విడుదల కాబోతున్న మాస్టర్ చిత్రం కోసం చర్చించేందుకే సీఎంను కలిశారని కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. బిగిల్‌ చిత్రం తర్వాత విజయ్‌ నటిస్తున్న చిత్రం మాస్టర్‌. దీపావళికి ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా ఎనిమిది నెలలుగా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో మాస్టర్ చిత్రం విడుదలలో జాప్యం జరిగింది. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే.. తమిళనాట రజనీ తర్వాత అంత ఇమేజ్ ఉన్న హీరో విజయ్ అనే చెప్పాలి.

రజినీకాంత్ ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో విజయ్ పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖాయమనే వార్త వినిపిస్తోంది. ఈ నెల 31న విజయ్ కొత్త పార్టీ అనౌన్స్ చేస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమాధి దగ్గర దళపతి పార్టీ వివరాల్ని ప్రకటిస్తారని తెగ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించే ఆయన సీఎం పళని స్వామిని కలుసుకున్నారనే వాదనకు కూడా ఇప్పుడు బలం చేకూరింది.


నేడు రణ్‌బీర్‌తో అలియా భట్ నిశ్చితార్థం?

కుక్క తోక వంకరే.. గత 18 ఏళ్లలో పాకిస్తాన్ మొదటి సారి ఇలా..?

కరోనా వ్యాక్సిన్.. ఇలా చేస్తే ఖాతా ఖాళీ.?

తమిళనాట కొత్త సీఎం ఆయనే ?

అమెరికా అమ్మాయి.. మలయాళం పాఠాలు నేర్పుతోంది

ఐటీఆర్ దాఖలుకు రేపే ఆఖరు.... దాటితే భారీ జరిమానా!

'కోవాగ్జిన్' కొత్తరకం కరోనా స్ట్రెయిన్ పై కూడా పనిచేస్తుంది - భారత్ బయోటెక్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>