PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tension-tension-with-corona-new-strain67c422ef-28d5-423d-b11c-e081f42d8a9d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tension-tension-with-corona-new-strain67c422ef-28d5-423d-b11c-e081f42d8a9d-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా వణికించిందో తెలిసిందే. దీన్ని నియంత్రించడం అగ్రరాజ్యం వల్ల కూడా కాలేదు. ఎట్టకేలకు కొన్ని దేశాలు తయారు చేసిన వ్యాక్సిన్ ఈ మహమ్మారిపై పని చేయడంతో వైరస్‌పై విజయం సాధించినట్లే అనుకున్నారు. అలా కొంత ఊపిరి పీల్చుకున్న ప్రపంచానికి.. కరోనా స్ట్రెయిన్ మరోసారి భయం రుచి చూపించింది. corona;yogi;yogi adityanath;capital;bengaluru 1;uttar pradesh;house;lucknowకొత్తగా మరో 10 స్ట్రెయిన్ కేసులు.. రాష్ట్రం మొత్తం వణుకే!కొత్తగా మరో 10 స్ట్రెయిన్ కేసులు.. రాష్ట్రం మొత్తం వణుకే!corona;yogi;yogi adityanath;capital;bengaluru 1;uttar pradesh;house;lucknowWed, 30 Dec 2020 21:59:16 GMTలక్నో: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా వణికించిందో తెలిసిందే. దీన్ని నియంత్రించడం అగ్రరాజ్యం వల్ల కూడా కాలేదు. ఎట్టకేలకు కొన్ని దేశాలు తయారు చేసిన వ్యాక్సిన్ ఈ మహమ్మారిపై పని చేయడంతో వైరస్‌పై విజయం సాధించినట్లే అనుకున్నారు. అలా కొంత ఊపిరి పీల్చుకున్న ప్రపంచానికి.. కరోనా స్ట్రెయిన్ మరోసారి భయం రుచి చూపించింది. బ్రిటన్‌లో తొలిసారి బయటపడిన ఈ కొత్త స్ట్రెయిన్.. చాలా వేగంగా ప్రపంచంలో వ్యాప్తి చెందుతున్న సంకేతాలు కనబడుతున్నాయి. మన దేశంలో కూడా ఈ కొత్త స్ట్రెయిన్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్తగా 10 మందికి కరోనా కొత్త స్ట్రెయిన్ సోకినట్లు తేలింది. కొత్త స్ట్రెయిన్ కోసం వీరి శాంపిల్స్‌కు చేసిన టెస్టుల్లో పాజిటివ్ ఫలితం వచ్చినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. వీరిలో ముగ్గురు నోయిడాకు చెందిన వారు కాగా, మీరుట్, బరైలీలో ఒక్కొక్కరు, ఘజియాబాద్‌లో ముగ్గురు ఉన్నారని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఓ రెండేళ్ల పాపలో కరోనా స్ట్రెయిన్ లక్షణాలు కనబడటం సంచలనం రేపింది. ఈ వైరస్ వ్యాప్తి చూసిన ప్రజలు భయంతో వణికిపోతున్నారు. రెండేళ్ల పాప విషయం తెలుసుకున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అప్రమత్తమైందట. స్ట్రెయిన్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, రాష్ట్రంలోని అధికారులు, ఆసుపత్రి సిబ్బందికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి.

కాగా, యూకే నుంచి ఇటీవల తిరిగి వచ్చిన వారికి ఆర్‌టీ - పీసీఆర్ రిపోర్ట్ నెగిటివ్ వచ్చినప్పటికీ 28 రోజుల పాటు హోమ్ క్యారంటైన్‌లో ఉండాలని సూచనలు చేస్తున్నారు. యూపీ ప్రభుత్వ అడ్వయిజరీ ప్రకారం, కొత్త స్ట్రెయిన్ పాజిటివ్ పేషెంట్లను ఐసొలేషన్ వార్డుల్లో ఉంచుతున్నారు. మరోవైపు, బుధవారం ఉదయం దేశంలో కొత్తగా 14 కరోనా స్ట్రెయిన్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో 8 కేసులు దేశ రాజధాని ఢిల్లీలో, 7 బెంగళూరులో వెలుగు చూశాయి. వీరంతా ఇటీవల యూకే నుంచి తిరిగి వచ్చినవారే అని తేలింది.


భూకంపాన్ని ఎప్పుడైనా లైవ్‌లో చూశారా..? అయితే ఇప్పుడు చూడండి..

కొడాలి నానీని చంద్రబాబే టార్గెట్ చేయించారా...?

తెలంగాణ‌లో నేరాలు త‌గ్గాయి... ఇక మా ల‌క్ష్యం అదే.. డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి

2020 టాలీవుడ్ బెస్ట్ మూవీస్.. టాప్ ప్లేస్ ఎవరిదంటే!

బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన తెలుగు హీరోయిన్స్.. సక్సెస్ కొట్టేస్తారా?

అప్పుడు కాల్పులు జరిపాడు.. ఇప్పుడు బీజేపీలో చేరాడు..

రేవంత్ కి పదవి ఇస్తే నేను ఉండను: ఎంపీ వార్నింగ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>