HealthSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/covaxin-will-coming-soon-in-india68377710-e8b8-4fb0-adb3-fc66887248e6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/covaxin-will-coming-soon-in-india68377710-e8b8-4fb0-adb3-fc66887248e6-415x250-IndiaHerald.jpgకొత్త కరోనా వైరస్ వ్యాప్తి విషయమై ప్రజల్లో కలకలం రేగుతున్న తరుణంలో భారత్ బయోటెక్ కీలక ప్రకటన చేసింది. తమ సంస్థ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ కరోనా వ్యాక్సిన్‌ ఈ కొత్తరకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్ పైనా కూడా పనిచేస్తుందని స్పష్టం చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని ఐఐసీటీ ఏర్పాటు చేసిన వర్చువల్‌ సమావేశంలో భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డెరెక్టర్ ‌(సీఎండీ) డాక్టర్‌ కృష్ణ ఎల్ల మాట్లాడారుcovaxin;krishna;delhi;india;telangana;telugu;cm;december;bengaluru 1;central government;coronavirus'కోవాగ్జిన్' కొత్తరకం కరోనా స్ట్రెయిన్ పై కూడా పనిచేస్తుంది - భారత్ బయోటెక్'కోవాగ్జిన్' కొత్తరకం కరోనా స్ట్రెయిన్ పై కూడా పనిచేస్తుంది - భారత్ బయోటెక్covaxin;krishna;delhi;india;telangana;telugu;cm;december;bengaluru 1;central government;coronavirusWed, 30 Dec 2020 09:35:00 GMTఇటీవలే బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్తరకం వైరస్ ‘స్ట్రెయిన్’ భారత్ లో కూడా అలజడి రేపుతోంది. దేశంలో ఇప్పటివరకు 6 ఈ కొత్తరకం కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం (డిసెంబర్ 29) తెలిపింది. బెంగళూరులోని నిమ్‌హన్స్‌లో 3, హైదరాబాద్‌లోని సీసీఎంబీలో 2, పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)లో ఒక కేసు నిర్ధారణ అయినట్లు వెల్లడించింది. తెలంగాణ నుంచి ఇద్దరికి, ఇటీవల ఢిల్లీ నుంచి రైల్లో రాజమండ్రికి వచ్చిన మహిళకు కొత్త వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో ఆందోళన నెలకొంది.




కొత్త కరోనా వైరస్ వ్యాప్తి విషయమై ప్రజల్లో కలకలం రేగుతున్న తరుణంలో భారత్ బయోటెక్ కీలక ప్రకటన చేసింది. తమ సంస్థ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ కరోనా వ్యాక్సిన్‌ ఈ కొత్తరకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్ పైనా కూడా పనిచేస్తుందని స్పష్టం చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని ఐఐసీటీ ఏర్పాటు చేసిన వర్చువల్‌ సమావేశంలో భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డెరెక్టర్ ‌(సీఎండీ) డాక్టర్‌ కృష్ణ ఎల్ల మాట్లాడారు. ఈ సందర్భంగా బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్‌పై టీకా పనిచేస్తుందా? అని అడిగిన ప్రశ్నకు ఆయన మ్యుటేషన్‌ చెందిన కరోనా వైరస్‌ నుంచి కొవాగ్జిన్‌ టీకా రక్షణ కల్పిస్తుందని ఎల్ల తెలిపారు. కరోనా వైరస్‌లో మ్యుటేషన్ (కొత్త మార్పులు) కొత్త విషయం కాదని కృష్ణ ఎల్ల చెప్పారు. ఒక మనిషి నుంచి మరొక మనిషికి సోకే కొద్ది వైరస్‌లో చాలా మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఇది ఊహించిన విషయమేనని చెప్పారు. వైరస్‌లో ఎన్ని మార్పులు వచ్చినా.. వ్యాక్సిన్ రక్షణ ఇస్తుందని స్పష్టం చేశారు. ‘వ్యాక్సిన్ రెండు అంశాల కారణంగా రక్షణ కల్పిస్తుంది. ఇది ప్రధానంగా కరోనా వ్యాక్సిన్‌ను యాక్టివ్ చేసే ప్రొటీన్‌పై దాడి చేస్తుంది. వైరస్‌లో ఎలాంటి మార్పులు వచ్చినా వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తుంది’ అని కృష్ణ ఎల్ల వివరించారు.


ఆరోజు అందుకే అలా మాట్లాడాను - డాక్టర్ సుధాకర్

కమలానికి కలిసొచ్చిన కరోనా కాలం!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాడి దింపేసిన తలైవా..కూతుర్ల ఫిట్టింగ్ ?

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్

బాక్సింగ్ డే టెస్టు విజయం టీమిండియాకు ప్రత్యేకం

ఇక నుంచి కార్లలో అవి తప్పనిసరి.. త్వరలో కేంద్రం ఆదేశాలు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>