PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/orange-juiceca702352-8b57-4966-86f9-56b169b29035-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/orange-juiceca702352-8b57-4966-86f9-56b169b29035-415x250-IndiaHerald.jpgఅన్ని కాలాల్లో దొరికే పండు నారింజ. ఇది తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. డైరెక్టుగా తినడమే గాక.. నారింజను జ్యూస్ చేసుకుని తాగితే ఇంకా అదిరిపోయే ఉపయోగాలున్నాయని ఒక పరిశోధనలో తేలింది. నిమ్మజాతి పండ్లలో నారింజ కూడా ఒకటి. తీపి, పులుపు కలగలసిన రుచితో వుండే ఈ పండును తీసుకుంటే.. శరీరపు కఫ, వాత, అజీర్ణాలను హరించి శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది. యవ్వనాన్ని పెంపొందింపజేస్తుంది. orange juice;hari;hari music;vitamin;heart;sugar;vegetable market;shaktiనారింజ రసం తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!?నారింజ రసం తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!?orange juice;hari;hari music;vitamin;heart;sugar;vegetable market;shaktiWed, 30 Dec 2020 07:00:00 GMT
ఇక పండ్ల వినియోగం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే మార్కెట్ లో వందలాది రకాల పండ్లు లభ్యమవుతున్నాయి. ఇందులో దేనిని తీసుకోవాలి..? ఏది మన ఆరోగ్యానికి మంచిది..? అనేది ఎప్పటికీ సందేహమే. అయితే నారింజ రసం తాగడం అన్నింట్లోకెల్లా ఉత్తమమని ఒక అధ్యయనం తేల్చింది.

అయితే నారింజలో తక్కువ విటమిన్ ‌- ఏ, బి, ఎక్కువ విటమిన్‌ - సి ఎక్కువగా ఉంటాయి. రోజుకు ఒక గ్లాసు నారింజ రసం తాగితే రోజుకు కావాల్సిన విటమిన్‌ లభిస్తుంది. నారింజ రసం మంచి శక్తిని అందిస్తుంది. జీవక్రియల్లో కీలకపాత్ర పోషించే సోడియం, పొటాషియం, మెగ్నీషియం, రాగి, గంధకం, క్లోరిన్‌లు నారింజలో లభిస్తాయి. నారింజ పండు వినియోగంతో రోగ నిరోధక శక్తి పెరిగి ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులు ఉపశమిస్తాయి.బరువు తగ్గేవారికి, హృదయ సంబంధ వ్యాధుల వారికైతే నారింజ రసం ఒక వరంగా మారిందని అధ్యయనవేత్తలు చెబుతున్నారు.

నారింజ రసం తాగడం వల్ల శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోదు. ఈ రసం మన ఆరోగ్యాన్ని కాపాడటమే గాక.. జీవితకాలాన్ని కూడా పొడిగిస్తుందని పరిశోధకులు తెలిపారు. రోజుకు రెండు గ్లాసుల నారింజ రసం తాగడం వల్ల శరీరంలోని ఊబకాయం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అంతేగాక... ఇది గుండె సమస్యలు, డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని తేలింది. కెనడాలోని వెస్ట్రన్ యూనివర్శిటీ పరిశోధకులు నారింజ, కిన్నో పండ్లపై నోబిలాటిన్ ప్రభావాన్ని అధ్యయనం చేశారు.ఈ రసాయన సమ్మేళనం... శరీరంలోని ఊబకాయాన్ని తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది. అంతేగాక దీని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కూడా ఉండవట.


హెరాల్డ్ సెటైర్ : ఇంతకీ బోడిలింగం ఎవరో తేలిపోయిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాడి దింపేసిన తలైవా..కూతుర్ల ఫిట్టింగ్ ?

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్

బాక్సింగ్ డే టెస్టు విజయం టీమిండియాకు ప్రత్యేకం

ఇక నుంచి కార్లలో అవి తప్పనిసరి.. త్వరలో కేంద్రం ఆదేశాలు!

కొత్త ఏడాది భయంకరమైన పోటీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>