EditorialMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajanikanth-political-party-not-coming-in-tamilnadue8544eaa-6dd6-45ed-a579-e12ffa1d3b15-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajanikanth-political-party-not-coming-in-tamilnadue8544eaa-6dd6-45ed-a579-e12ffa1d3b15-415x250-IndiaHerald.jpgతమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ స్థాపిస్తున్నాడు అంటూ జరిగిన హడావుడి ఇప్పటిది కాదు. చాలా ఏళ్లుగా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. కానీ ఎప్పటికప్పుడు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు. కాకపోతే 2021 జనవరిలో రజనీ తన పార్టీ పేరును ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సైతం పూర్తి చేశారు. ఈనెల 31వ తేదీన పార్టీ పేరును సైతం ప్రకటించేందుకు సిద్ధమవుతున్న సమయంలో, అకస్మాత్తుగా సినిమా షూటింగ్ లో అనారోగ్యానికి గురయ్యారు. కొద్దిరోజుల పాటు హైదరాబాదులోనిtamil superstar rajnikanth;cinema;rajani kanth;media;tamil;survey;letter;partyఎడిటోరియల్ : రజని పార్టీ పెట్టకుండానే ఓడిపోయారా ?ఎడిటోరియల్ : రజని పార్టీ పెట్టకుండానే ఓడిపోయారా ?tamil superstar rajnikanth;cinema;rajani kanth;media;tamil;survey;letter;partyWed, 30 Dec 2020 16:00:00 GMTతమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ స్థాపిస్తున్నాడు అంటూ జరిగిన హడావుడి ఇప్పటిది కాదు. చాలా ఏళ్లుగా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. కానీ ఎప్పటికప్పుడు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు. కాకపోతే 2021 జనవరిలో రజనీ తన పార్టీ పేరును ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సైతం పూర్తి చేశారు. ఈనెల 31వ తేదీన పార్టీ పేరును సైతం ప్రకటించేందుకు సిద్ధమవుతున్న సమయంలో, అకస్మాత్తుగా సినిమా షూటింగ్ లో అనారోగ్యానికి గురయ్యారు. కొద్దిరోజుల పాటు హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందారు. దాని నుంచి కోలుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత, తాను రాజకీయ పార్టీ స్థాపించడం లేదని, తనని అందరూ క్షమించాలి అని, తనకు ఉన్న ఆరోగ్య సమస్యలు కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రకటన చేశారు. అంతేకాకుండా అభిమానులు తనను క్షమించాలని కోరుతూ, మూడు పేజీల లేఖ సైతం రాశారు. దీంతో రజనీ నిర్ణయంపై సర్వత్రా ఆందోళన, ఆసక్తి, అనుమానం అందరిలోనూ బయలుదేరాయి. అసలు ఒక్కసారిగా రజిని ఈ రకంగా యుటర్న్ తీసుకోవడానికి కారణాలు ఏమిటనే విషయంపై తమిళ మీడియా రకరకాల కథనాలు ప్రచారం చేశాయి. 



రజిని పార్టీ స్థాపించి ప్రజల్లోకి వెళ్తే, ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై సమగ్రంగా సర్వేలు చేయించినట్లు, ఆ సర్వేలో దారుణమైన ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో రజనీ పోటీకి దిగినా, కేవలం 10,12 స్థానాల్లో మాత్రమే కాస్తో కూస్తో ప్రభావం చూపించగలరు అని, 1 ,2 స్థానాలు దక్కించుకోవడం కూడా కష్టమే అనే  రిపోర్ట్ వచ్చిందట. అంతేకాదు కనీసం రజినీకాంత్ కూడా గెలవడం కష్టమేననే ఫలితాలు రావడంతో అనూహ్యంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సర్వే మొత్తం పార్టీ రిజిస్ట్రేషన్ సమయంలోనే చేయించడంతో ఫలితాలు కొద్దిరోజుల క్రితమే అందడంతో ఆకస్మాత్తుగా రజనీ తాను పార్టీ స్థాపించడం లేదని ప్రకటన చేశారనే కథనాలు తమిళ మీడియాలో వస్తున్నాయి.



 పార్టీ పెట్టి పరాభవం ఎదుర్కోకుండా ముందుగానే పక్కకు తప్పుకున్నట్టు గా కనిపిస్తున్నారు. రాజకీయంగా ప్రజల్లోనూ ఇప్పుడు రజినీ ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం 70 ఏళ్లకు పైగా వయస్సు వచ్చిన తర్వాత పార్టీని స్థాపించాలి అనుకోవడం, ఆయన వయసు, పేరు ప్రఖ్యాతలు పుష్కలంగా ఉన్న సమయంలో రాజకీయాల్లోకి వస్తానంటూ హడావుడి చేయడం తప్ప, ఆ దిశగా అడుగులు వేయకపోవడం, ఇప్పుడు ఈ సమయంలో పార్టీ పెడతాను అంటూ హడావుడి చేయడంపైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయ పార్టీ స్థాపించకపోవడానికి కారణం అనారోగ్యం అని చెబుతున్నా, సర్వేలో తేలిన ఫలితాలు, నిధుల కొరతతో ఆయన వెనక్కి తగ్గినట్లుగా ప్రచారం ఊపందుకుంది. ఏది ఏమైనా చాలా కాలం తరువాత రజిని రాజకీయ నిర్ణయం ఈ విధంగా ఉంటుందని ఎవరు ముందుగా ఊహించలేకపోయారు.

ఆశలు పార్టీ పెట్టాలనుకున్న సమయంలో పెట్టకుండా ఊగిసలాట ధోరణిని అవలంబిస్తూ రావడమే కాకుండా వయస్సు సహకరిస్తోందా లేదా ? పార్టీని నడిపించేందుకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయా లేదా ? పార్టీ పెడతాను అని ప్రకటించకముందే సాధ్య అసాధ్యాలపై విశ్లేషణ చేసుకోకుండా ఇలా చేసి రజనీ తొందరపడ్డారు అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. రజనీ లాంటి వ్యక్తి ముందు వెనుకా ఆలోచించకుండానే ఇలా ఫలితాలపై విశ్లేషణ చేసుకోకుండా ఇప్పుడు ఒక్కసారిగా ఈ యూ టర్న్ తీసుకోవడం రజనీ ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేసిందనే చెప్పాలి.   
  


పశ్చిమ గోదావరిలో పులి జాడలు . భయపడుతున్న ప్రజలు

ప్రధానికి వైసీపీ ఎంపీ లేఖ... జగన్ పై ఫిర్యాదు

సినిమా ఫక్కీలో దాడులు.. రాత్రిళ్లు ఒంటరిగా వెళ్లే వాహనాలే టార్గెట్..

2023లో అధికారం మాదే.. అప్పుడు చెబుతాం: మాజీ మంత్రి దేవినేని ఉమా

యువరాజ్ రీ ఎంట్రీపై బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. ఇప్పుడేం చేయాలి..?

వకీల్ సాబ్ ఎప్పుడొస్తున్నాడంటే..

సిబిఐ అంటున్న పవన్ కళ్యాణ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>