PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-bjp-full-swing-in-2020-year436a3d81-da2b-4430-9055-80badf898cd5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-bjp-full-swing-in-2020-year436a3d81-da2b-4430-9055-80badf898cd5-415x250-IndiaHerald.jpg 2020.. ప్రపంచ వ్యాప్తంగా ఇది అత్యంత దుర్భర సంవత్సరం. చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ మంతా విస్తరించి అన్ని దేశాలను ఆగమాగం చేసింది. కరోనా దెబ్బకు ఆర్థికరంగంపై కోలుకోలేని దెబ్బ పడింది. చిన్న దేశాలైతే చితికిపోయాయి. అగ్రరాజ్యాలు ఆర్థిక ఆంక్షలు విధించుకున్నాయి. భారత దేశం కూడా కరోనా విలయానికి తల్లడిల్లింది. కరోనా నామ సంవత్సరంగా చెప్పుకుంటున్న 2020 అందరికి పీడకలను మిగల్చగా.. తెలంగాణ బీజేపీకి మాత్రం బాగా కలిసొచ్చింది. రాష్ట్రంలో బీజేపీ ఈ ఏడాది ఊహించని విజయాలు సాధించిందిtelangana bjp;kcr;vijayashanti;raghu;thirtha;hyderabad;bharatiya janata party;telangana;congress;mp;huzur nagar;2020;assembly;hindus;karimnagar;party;mantraకమలానికి కలిసొచ్చిన కరోనా కాలం!కమలానికి కలిసొచ్చిన కరోనా కాలం!telangana bjp;kcr;vijayashanti;raghu;thirtha;hyderabad;bharatiya janata party;telangana;congress;mp;huzur nagar;2020;assembly;hindus;karimnagar;party;mantraWed, 30 Dec 2020 09:11:40 GMT2020 అందరికి పీడకలను మిగల్చగా.. తెలంగాణ బీజేపీకి మాత్రం బాగా కలిసొచ్చింది. రాష్ట్రంలో బీజేపీ ఈ ఏడాది ఊహించని విజయాలు సాధించింది.

2020లో  బీజేపీ పగ్గాలు చేపట్టారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. నాయకత్వ మార్పుతో కాషాయ దళానికి కొత్త ఊపు వచ్చినట్లైంది. సీఎం కేసీఆర్ సొంత గడ్డ దుబ్బాక అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో సంచలన విజయం సాధించింది బీజేపీ.  2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 15,131 ఓట్లతో 9.82 శాతంలో ఉన్న బీజేపీ అభ్యర్థి రఘునందనరావు ఉప ఎన్నికల్లో మాత్రం 38.47 ఓట్లను దక్కించుకున్నారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపింది. హిందుత్వం ఎజెండాగా సాగిన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి చుక్కలు చూపించింది. 2016లో గ్రేటర్హైదరాబాద్ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాల్లో గెలిచి 10.34 శాతం ఓట్లు సాధించిన కమలం పువ్వు.. ఈసారి మాత్రం అధికార పార్టీకి చెమటలు పట్టిస్తూ..  48 స్థానాల్లో విజయఢంకా మోగించింది. 35.55 శాతం ఓట్లు రాబట్టుకుంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ విజయాలతో బీజేపీ ఒక్కసారిగా రాష్ట్రంలో రెండో స్థానంలోకి వచ్చింది.


వరుస విజయాలతో దూకుడు పెంచిన బీజేపీలోకి ఈ ఏడాది వలసలు భారీగా జరిగాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్నేతలు బీజేపీ గూటికి చేరారు. తెలంగాణ శాసన మండలి తొలి చైర్మన్ స్వామిగౌడ్‌తో పాటు పలువురు జిల్లాల నేతలు కాషాయం కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ కూడా దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితే. దుబ్బాక, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి నేతలు క్యూ కట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయా ప్రాంతాల నుంచి నేతలు బీజేపీలో చేరారు. ఇంకా పార్టీలోకి వచ్చేవారు ఎక్కువగానే ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఇద్దరు మాజీ మంత్రులు, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు కాషాయదళంలో చేరే అవకాశాలున్నాయి.దీంతో అందరిని ఆందోళనకు గురి చేసిన 2020 సంవత్సరం తెలంగాణ కమలనాధులకు మాత్రం స్వీట్ మెమెరీస్ ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది.





రేవంత్ రెడ్డి కోసం రంగంలోకి దిగింది ఎవరు...?

హెరాల్డ్ ఎడిటోరియల్ : కాడి దింపేసిన తలైవా..కూతుర్ల ఫిట్టింగ్ ?

రజినీ కథ ముగిసింది.. ఇప్పుడు ఫోకస్ మొత్తం ఆయనపైనే!

ఈ ముగ్గురికి చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్

బాక్సింగ్ డే టెస్టు విజయం టీమిండియాకు ప్రత్యేకం

ఇక నుంచి కార్లలో అవి తప్పనిసరి.. త్వరలో కేంద్రం ఆదేశాలు!

కొత్త ఏడాది భయంకరమైన పోటీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>